Praja Deveena
Newspaper Banner
Date of Publish : 07 October 2026, 3:26 pm Posted by : praja deveena

Nalgonda collector Chandrashekhar : పోలీస్ ఉద్యోగాల కోసం ఉచిత శిక్షణను వినియోగించుకోవాలి

 

Nalgonda collector Chandrashekhar : ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: ఎస్‌ ఐ, పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగా ల కోసం పోటీ పరీక్షలకు సిద్ధమ వుతున్న నిరుద్యోగ యువతీ యువకు లకు నల్గొండ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జిల్లా పోలీస్ ట్రైనింగ్ సెంటర్‌లో నిర్వ హిస్తున్న ఉచిత శిక్షణ కార్యక్రమా న్ని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్, జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ సందర్శించి పరిశీలించారు.ఈ సందర్భంగా శిక్షణ పొందుతున్న యువతీ యువకులకు ఉద్యోగ సాధనకు అవసరమైన పలు సూ చనలు చేస్తూ దిశా నిర్దేశం చేశా రు.

జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్ మా ట్లాడుతూ ఎ స్‌ఐ, పోలీస్ కాని స్టేబుల్ ఉద్యో గాలను లక్ష్యంగా పెట్టుకున్న నిరుద్యోగ యువత కు ఉచితంగా శిక్షణ అందించడం అ భినందనీ యమని అన్నా రు. పో టీ పరీక్షల్లో విజయం సాధించా లంటే లక్ష్యంపై పూర్తి దృష్టి పెట్టడంతో పాటు క్రమశిక్షణతో చదు వుకోవాలని సూ చించారు. శిక్షణలో అందించే బోధనను శ్రద్ధగా వినడంతో పా టు, ప్రతిరోజూ స్వయంగా చదువుకునేందుకు స మయాన్ని కేటాయించాలని తెలిపారు.


జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ మాట్లాడుతూ ఎస్‌ఐ, పోలీస్ కా నిస్టేబుల్ ఉద్యోగాల కోసం పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న యువ తీ యువకులకు ఈ ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ సహకారంతో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి అవసరమైన సహకారం, ప్రోత్సాహం అందిస్తున్న జిల్లా కలెక్టర్ కి పోలీస్ శా ఖ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ శిక్షణ కేంద్రం లో సుమారు 35 0 మంది యువతీ యువకులకు 45 రోజుల పాటు ఉచితంగా శిక్షణ అందించనున్నట్లు ఎస్పీ తెలిపారు. ఎస్‌ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం నిర్వహించే రాత పరీక్ష లతో పాటు ఉద్యోగ ఎంపిక ప్రక్రియలోని వివిధ దశలను దృష్టి లో ఉంచుకొని అభ్యర్థులు సమగ్రంగా సిద్ధం కావాలని సూచిం చారు.

పోటీ పరీక్షల్లో విజయం సాధించ డానికి కేవలం శిక్షణ తరగతు లకు హాజరు కావడం మాత్రమే కా కుండా, ప్రతిరోజూ క్రమం త ప్పకుండా చదవడం, గత ప్రశ్నప త్రాలను పరిశీలించడం, మాక్ టెస్టులు రాయడం, సమయపాలన పాటించడం ఎంతో ము ఖ్యమని ఎస్పీ తెలిపారు. శిక్షణ సమయంలో తమకు వచ్చే సందేహాలను వెంటనే శిక్షకులను అడిగి నివృత్తి చేసుకోవాలని సూచించారు.“మీ భవిష్యత్తును మార్చుకునేందుకు ఈ ఉచిత శిక్షణ ఒక మంచి అవ కాశంగా భావించాలి. 45 రోజుల శిక్షణ ను పూర్తిస్థాయిలో సద్వి నియోగం చేసుకొని, క్రమశిక్షణతో, ప ట్టుదలతో చదివి అనుకు న్న లక్ష్యాన్ని సాధించాలి. ప్రతి ఒ క్కరూ పోలీస్ శాఖలో ఉద్యోగం సాధించాలనే సంకల్పంతో ముందుకు సాగాలి” అని ఎస్పీ యువతీ యువకులకు సూచిం చారు. యువత తమ లక్ష్య సాధనకు ఆటంకం కలిగించే అన వసర విషయాలకు దూరంగా ఉండా లని, మొబైల్ ఫోన్లు, సో షల్ మీడియాను అవసరమైన మేరకే ఉపయోగించాలని సూ చించారు. శారీరక దృఢత్వానికి కూడా ప్రాధాన్యత ఇస్తూ ప్రతి రోజూ వ్యాయామం, పరుగు వంటి శా రీరక శిక్షణలో పాల్గొనా లని తెలి పారు.

అనంతరం జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ శిక్షణ తరగతులను పరిశీ లించి అభ్యర్థులతో మాట్లాడారు. శిక్షణలో అందుతున్న బోధన, అ భ్యర్థులకు కల్పిస్తున్న సదుపా యాలు, శిక్షణా విధానం తదితర అంశాలను సంబంధిత అధికారు లను అడిగి తెలుసుకున్నారు. అ భ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన సౌక ర్యాలు కల్పించాలని అధికా రుల కు సూచించారు. జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అంది స్తున్న ఈ ఉచిత శిక్షణ ద్వారా నిరుద్యోగ యువతీ యువకు లు ఎస్‌ఐ, పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలను సాధించి తమ భవిష్యత్తును తీ ర్చిదిద్దుకోవాలని అధికారులు ఆ కాంక్షించా రు.ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పి రమేష్,డిటిసి డి లఎస్పీ నగేష్,ఎస్బి సీఐ నాగరా జు,సీఐ కరుణాకర్,ఆర్.ఐలు సం తోష్, హరిబాబు, ఎస్.ఐలు, సి బ్బంది, శిక్షణ పొందుతున్న సు మారు 350 మంది యువతీ యువకులు పాల్గొన్నారు.