Praja Deveena
Newspaper Banner
Date of Publish : 07 October 2026, 10:36 am Posted by : praja deveena

Cyber Fraud : బిగ్ బ్రేకింగ్, సైబర్ మోసగాళ్లపై తెలంగాణ పోలీసుల భారీ ఆప రేషన్

 

Cyber Fraud : ప్రజా దీవెన, హైదరాబాద్: సైబర్ మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు తెలంగాణ పోలీసులు భారీ ఆప రేషన్ చేపట్టారు. సైబర్ క్రైమ్ బ్యూరో ఆధ్వర్యంలో ఆరు రా ష్ట్రాల్లో ఏకకాలంలో నిర్వహిం చిన ప్రత్యేక ఆపరేషన్‌లో 101 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.వీరిలో 18 మంది మ హిళలు, 83 మంది పురుషు లు ఉన్నట్లు అధికారులు వెల్లడిం చారు.కేరళ, తమిళనాడు, ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ, పు దుచ్చేరి రాష్ట్రాల్లో ఈ ఆపరేషన్ కొనసాగింది. వివిధ రకాల సైబర్ మోసాలకు పాల్పడుతున్న నింది తులపై నిఘా పెట్టి, ప క్కా ఆధారాలతో పోలీసులు చర్యలు చేపట్టారు.

ఈ ఆపరేషన్‌లో భాగంగా 1,172 సైబర్ క్రైమ్ కేసులకు సం బంధం ఉన్న నిందితులను గుర్తించినట్లు సైబర్ క్రైమ్ బ్యూరో తెలిపింది. ముఖ్యంగా సైబర్ నేరగాళ్లకు బ్యాంకు ఖాతాలను సమకూర్చు తూ, వాటిని మోసాల కోసం విని యోగించేందుకు సహకరిస్తున్న ‘మ్యూల్ అకౌంట్స్’ ముఠాలపై పోలీసులు ప్రత్యే కంగా దృష్టి సా రించారు.సైబర్ నేరాల వెనుక ఉన్న నెట్‌వర్క్‌ ను ఛేదించడంతో పాటు, మోసాలకు ఉపయోగిస్తున్న బ్యాంకు ఖాతాల మూలాల ను గుర్తించే దిశగా దర్యాప్తు కొన సాగుతోం ది. ఆరు రాష్ట్రాల్లో చేప ట్టిన ఈ సమన్వయ ఆపరేషన్‌ తో సై బర్ మోసాల వెనుక ఉన్న అంతర్రాష్ట్ర నెట్‌వర్క్‌పై పోలీసులు గట్టి నిఘాపెట్టినట్లు స్పష్టమవుతోంది.