Praja Deveena
Newspaper Banner
Date of Publish : 07 October 2026, 2:26 pm Posted by : praja deveena

Telangana government employees DA : బిగ్ బ్రేకింగ్, తెలంగాణ ఉద్యోగులకు దసరా కానుక,రెండు డీఏలు విడుదల

 

Telangana government employees DA : ప్రజా దీవెన , హైదరాబాద్: తెలం గాణ ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభు త్వం దసరా కానుకగా కీలక శుభవార్త అందించింది. ఉ ద్యోగు లు, పెన్షనర్లు ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న రెండు పెం డిం గ్ డీఏలపై ప్రభుత్వం ఉత్త ర్వులు జారీ చేసింది. వేర్వేరు పే స్కేళ్లకు అనుగుణంగా డీఏను సవరించడంతో ఉద్యోగుల వేత నాల్లో గణనీయమైన పెరుగుదల చోటుచేసుకోనుంది. తాజా నిర్ణయంతో బేసిక్ పే ఆధారంగా దాదాపు 6.43 శాతం మేర అ దనపు ప్రయోజనం లభించనుంది.

       2024 జనవరి నుంచి తొలి డీఏ పెంపు

సాధారణ పే స్కేళ్ల ఉద్యోగులకు 2024 జనవరి నుంచి డీఏను 33.67 శాతం నుంచి 37.31 శా తానికి పెంచారు. అనంతరం 20 24 జూలై నుంచి డీఏను 40.04 శాతానికి సవరించారు. రివైజ్డ్ పే స్కేల్-2020 ఉద్యోగులకు కూడా డీఏను 37.31 శాతం నుంచి నే రుగా 40.04 శాతానికి పెంచారు.

      2015 పే స్కేల్ ఉద్యోగులకూ ఊరట

2015 పే స్కేల్ పరిధిలోని ఉ ద్యో గులకు డీఏను తొలుత 73.344 శాతం నుంచి 78.06 శాతానికి పెంచారు. 2024 జూలై నుంచి అది 81.728 శాతానికి చేరింది.ఉన్నత విద్యా ర్హతలతో కూడిన UGC, AICTE పే స్కేళ్ల ఉద్యోగు ల విషయం లోనూ ప్రభుత్వం డీ ఏను పెంచింది. 2016 పే స్కేల్ ఉద్యోగు లకు డీఏ 46 శాతం నుం చి 50 శాతానికి, 2024 జూలై నుంచి 53 శాతానికి పెరిగింది. 2006 పే స్కేల్ ఉద్యోగులకు డీఏ 230 శాతం నుంచి 239 శాతా ని కి, ఆ తర్వాత 246 శాతానికి చే రింది.

   పార్ట్‌టైమ్ అసిస్టెంట్లకు అదనపుభత్యం

క్షేత్రస్థాయిలో విధులు నిర్వర్తించే పార్ట్‌టైమ్ అసి స్టెంట్లు, గ్రామ రెవె న్యూ అసిస్టెంట్లు (VRA)కు కూడా ప్రభుత్వం ఊరటని చ్చింది. వారికి నెలకు అద నంగా రూ. 100 చొప్పున పెంచు తూ ఉత్తర్వుల్లో పేర్కొంది.పెంచిన డీఏను 2026 అక్టోబర్ నెల వేత నంతో కలిపి నవంబర్ 1, 2026న ఉద్యోగుల కు చెల్లించ నున్నారు. దీంతో దసరా తర్వా త ఉద్యో గుల జీతాల్లో పెరిగిన డీఏ ప్రతిఫలించనుంది.

కేవలం ప్రస్తుత డీఏ పెంపుతోనే ప్రభుత్వం ఆగలే దు. గతంలో పే రుకుపోయిన డీఏ బకాయిల చె ల్లింపునకు కూడా మార్గం సు గమం చేసింది. 20 24 జనవరి నుంచి 2026 సెప్టెంబర్ వరకు ఉన్న బకాయిలను 33 సమాన వాయిదాల్లో, అలాగే 20 24 జూ లై నుంచి 2026 సెప్టెంబర్ వరకు ఉన్న బకాయిల ను 27 వాయి దాల్లో చెల్లించనున్నారు.ఈ బకాయిలను ఉ ద్యోగుల GPF ఖాతాల్లో జమ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీం తో ఒకవైపు పెరిగిన డీఏ తో నెలవారీ వేత నంలో ఊరట లభించనుండగా, మరోవైపు పెం డింగ్ బ కా యిలు కూడా దశలవారీగా ఉద్యోగుల ఖాతాల్లో కి చేర నున్నా యి.