Devi Sarannavarathrulu start : ప్రజా దీవెన, తుంగతుర్తి: తుంగతుర్తి మండల వ్యా ప్తంగా దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల కు సర్వం సిద్ధమైంది. ఆదివారం నుండి దేవీ నవరాత్రులు ఘ నంగా ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా పట్టణంలోని ప్రధాన దుర్గా మాత మంట పాల వద్ద రంగురంగుల విద్యుత్ దీపాలతో, పూలతో అందం గా అలంకరించారు. అలాగే మం డలంలోని వివిధ గ్రామాలలో సైతం అమ్మవారి విగ్రహాలను నెలకొల్పి మంటపాలు ఏర్పాటు చేశారు
తొమ్మిది రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో అమ్మ వారు ప్రతిరోజూ ఒక ప్రత్యేక అవతారంలో దర్శన మిస్తారు. మొదటి రోజు *బాలా త్రిపుర సుందరీ దే విగా*, రెండో రోజు *గాయత్రీ దేవిగా*, మూడో రో జు *శ్రీ అన్నపూర్ణా దేవిగా* భక్తులకు దర్శ నమివ్వ నున్నారు.అలాగే నాల్గవ రోజు *శ్రీ మహా చండి దేవి గా*, ఐదవ రోజు *శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవిగా*, ఆర వ రోజు *సరస్వతీ దేవిగా* అమ్మవారిని అలంకరించనున్నారు.
ఏడవ రోజు *శ్రీ మహాలక్ష్మీ దేవిగా*, ఎనిమిదవ రోజు *శ్రీ దుర్గా దేవిగా*, తొమ్మిదవ రోజు *మహిషాసురమర్దినీ దేవిగా*, పదవ రోజు విజయదశమి పర్వదినాన *శ్రీ రాజరాజేశ్వరీ దేవిగా* అ మ్మవారు దర్శనమివ్వనున్నట్లు ఆలయ అర్చకులు తెలిపారు. ఈ పది రోజులు అమ్మవారి మంటపాల వద్ద ప్రత్యేక పూజలు, కుంకుమార్చనలు, లలితా సహస్రనామ పారాయణాలు, అన్న దాన కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
