Praja Deveena
Newspaper Banner
Date of Publish : 09 October 2026, 2:54 pm Posted by : praja deveena

Mla Komatireddy Raj Gopal Reddy : పూలపండుగ బతుకమ్మ.. తెలంగాణ సంస్కృతికి ప్రతీక

 

Mla Komatireddy Raj Gopal Reddy : ప్రజా దీవెన, చౌటు ప్పల్: తెలంగాణ సంస్కృతి, సంప్రదా యా లకు ప్రతీకగా నిలి చే బతుకమ్మ వేడుకలు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ లో అంగరంగ వైభవంగా జరిగాయి. పూలను దేవతలుగా భా వించి పూజించే గొప్ప సంస్కృతి తెలంగాణకు ప్రత్యేకమని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సతీ మణి కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ చైర్‌పర్సన్ కోమ టిరెడ్డి లక్ష్మి అన్నారు. పండుగల వెనుక ఉన్న గొప్పతనాన్ని, మన పూర్వీ కులు అందించిన ఆచార సంప్ర దాయాలను నేటి తరానికి ప రిచయం చేయడంలో బతుకమ్మ వేడుకలు కీలక పాత్ర పోషి స్తున్నాయని పేర్కొన్నారు.

చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలో ట్రినిటీ విద్యా సంస్థల ఆ ధ్వర్యంలో 30 అడుగుల భారీ బతుకమ్మను ఏర్పాటు చేసి వే డుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మును గోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగో పాల్ రెడ్డి సతీమణి, కోమ టిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ చైర్‌పర్సన్ కోమటిరెడ్డి లక్ష్మి ము ఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యార్థులతో కలిసి బతుకమ్మ ఆడుతూ, పాటలు పాడుతూ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొ న్నారు.

పండుగల గొప్పతనాన్ని పిల్లలకు తెలియజేయాలి

ఈ సందర్భంగా కోమటిరెడ్డి లక్ష్మి మాట్లాడుతూ మహిళలంతా ఒ కచోట చేరి భక్తిశ్రద్ధలతో బతుకమ్మను జరుపుకోవడం, ప్రకృ తిలో లభించే పూలను దైవస్వరూ పంగా భావించి పూజించ డం తెలంగాణ ప్రత్యేకత అని అన్నారు. మన పూర్వీకులు అం దించిన సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించే లా ఇలాంటి వేడుకలు నిర్వహించడం ఆనందదాయకమని పే ర్కొన్నారు.దసరా సెలవుల్లో విద్యార్థినులు తమ గ్రామాలకు వెళ్లి నానమ్మ లు, అమ్మమ్మలతో సమయం గడపాలని సూచిం చారు. వారు చె ప్పే పాతకాలపు ఆచారాలు, పండుగల విశిష్ట త, కుటుంబ సంప్రదాయాలను తెలుసుకోవడం ద్వారా మన సంస్కృతిపై అవగా హన పెరుగుతుందని తెలిపారు.

       సేవా కార్యక్రమాలే లక్ష్యం

దేవుడిచ్చిన శక్తి ఉన్నంతవరకు కోమటిరెడ్డి సుశీల మ్మ ఫౌం డేషన్ ద్వారా సమాజానికి, పేద ప్రజలకు సహాయ సహకారా లు అంది స్తూనే ఉంటామని కో మటిరెడ్డి లక్ష్మి పునరుద్ఘా టిం చారు. ప్రజలకు సేవ చేయడమే తమ లక్ష్యమని స్పష్టం చేశా రు.ఈ బతుకమ్మ వేడుకల్లో చౌటుప్పల్ మున్సిపల్ మహి ళా పాలకవర్గ సభ్యులు, ప ట్టణ మహిళలు, ము ఖ్య నాయకులు, విద్యార్థినులు పాల్గొని వే డుకల ను విజయవంతం చేశారు.