Praja Deveena
Newspaper Banner
Date of Publish : 10 October 2026, 4:02 pm Posted by : praja deveena

Mahabubabad tragedy family deaths : మహబూబాబాద్ జిల్లాలో తీవ్రవిషాదం, ఇద్దరు పిల్లలతో కలిసి తల్లిమృతి

 

Mahabubabad tragedy family deaths :   ప్రజా దీవెన, మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లాలో తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది. కురవి మండలం లింగ్యా తండాలో కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ తల్లి తన ఇద్దరు చిన్నారు లతో కలిసి బావిలో దూకిప్రాణాలు కోల్పో యినట్లు సమాచా రం. ఈ ఘటన స్థానికంగా తీవ్రకలకలం రే పింది.ఈ దుర్ఘటన లో బానోత్ అనూష (35), ఆ మె కుమారు డు విశాల్ కృష్ణ (9), కుమార్తె వర్షిణి (5) మృతి చెందినట్లు గుర్తించారు. చిన్నా రులతో సహా తల్లి మృతి చెందడంతో తండాలో విషాదఛా యలు అలుముకున్నాయి.

సమాచారం అందుకున్న పోలీసు లు వెంటనే ఘటనా స్థలా ని కి చేరుకుని వివరాలు సేకరించారు. ఘటనకు గల కారణాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు పోలీ సుల విచారణలో వెల్లడికావాల్సి ఉంది.