Praja Deveena
Newspaper Banner
Date of Publish : 10 October 2026, 7:24 am Posted by : praja deveena

Varshini State-Level Kabaddi Championship : రాష్ట్రస్థాయి కబడ్డీ సమరానికి తి ప్పర్తి క్రీడా కిరణం వర్షిణి సన్నద్ధం

–రాష్ట్రస్థాయి కబడ్డీ సమరానికి తిప్పర్తి క్రీడా కిరణం వర్షిణి
–జూనియర్ బాలికల తెలంగాణ రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక
–33 జిల్లాల క్రీడాకారులతో తల పడేందుకు సిద్ధం
–అశ్వారావుపేటలో అక్టోబర్ 10 నుంచి 13 వరకు టోర్నీ

Varshini State-Level Kabaddi Championship : ప్రజా దీవెన, తిప్పర్తి: గ్రామీణ ప్రాంతాల్లోనూ అసాధారణ క్రీడా ప్రతిభ దాగి ఉంటుందని మరో సారి నిరూపించింది నల్లగొండ జిల్లా తి ప్పర్తి విద్యార్థిని జెర్రిపోతు ల వర్షిణి. పట్టుదల, నిరంతర సా ధ నతో రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీ లకు ఎంపికై తన ప్రతిభను చా టుకుంది. తిప్పర్తి మండల కేంద్రంలోని PM SHRI ZPHS పా ఠశాలలో చదువుతున్న వర్షిణి, తెలంగాణ రాష్ట్రస్థాయి జూ నియర్ బాలికల కబడ్డీ పోటీల్లో జిల్లా తరఫున ప్రాతినిధ్యం  వ హించనుంది. దీంతో పాఠశాలతో పాటు స్థానికంగా హర్షాతి రే కాలు వ్యక్త మవుతున్నాయి.

  జిల్లా స్థాయి నుంచి రాష్ట్రస్థాయికి..

ఇటీవల నిర్వహించిన జిల్లా స్థా యి ఎంపిక పోటీల్లో వర్షిణి త న రైడింగ్, డిఫెన్స్ నైపుణ్యాలతో పాటు శారీరక దారుఢ్యాన్ని ప్రద ర్శించి ఎంపిక నిర్వాహకులను ఆ కట్టుకుంది. ఆమె ఆట తీరుతో రా ష్ట్రస్థాయి జట్టులో చోటు సంపాదించింది. గ్రామీణ ప్రాంతం నుం చి రాష్ట్రస్థాయికి ఎదగడం ఆమె కృషికి, క్రీడల ప ట్ల ఉన్న ఆసక్తికి నిదర్శనమని ఉపాధ్యాయులు అభిప్రాయప డ్డారు.

     33 జిల్లాల క్రీడాకారులతో పోటీ

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వా రావుపేటలో అక్టోబర్ 10 నుం చి 13 వరకు నాలుగు రోజుల పా టు జరగనున్న రాష్ట్రస్థాయి జూనియర్ బాలికల కబడ్డీ పోటీల్లో వర్షిణి పాల్గొననుంది. తె లంగాణలోని 33 జిల్లాలకు చెందిన ప్రతిభావంతులైన క్రీడా కారిణులు ఈ పోటీల్లో తమ సత్తా చాటనున్నా రు. ఈ పోటీ ల్లో వర్షిణి అత్యుత్త మ ప్రదర్శనతో నల్లగొండ జిల్లాకు గుర్తింపు తీసుకురావాలని పాఠ శాల వ్యాయామ ఉపాధ్యాయుడు ని మ్మల లెనిన్ బాబు ఆకాం క్షించారు. పాఠశాల స్థాయి నుం చే కబడ్డీపై ఆమె చూపుతున్న ఆ సక్తి, క్రమశిక్షణతో కూడిన సాధ నే ఈ విజయానికి కారణమని పే ర్కొన్నారు.

క్రీడల్లో రాణించే విద్యార్థులకు ప్రోత్సాహం

వర్షిణి రాష్ట్రస్థాయి పోటీలకు ఎం పిక కావడం పట్ల పాఠశాల ప్రధా నోపాధ్యాయుడు పి. నరసింహ నాయక్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వర్షిణిని పూల మాల, శాలువాతో ఘనంగా అ భినందించారు. చదువుతో పాటు క్రీడల్లోనూ వి ద్యార్థులు రాణించడం అభినందనీయమని ఆయన అన్నారు. రాష్ట్రస్థాయి పో టీల్లోనూ వర్షిణి తన ప్రతిభను చాటుకుని పా ఠశాలకు, జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆ కాంక్షించా రు. క్రీడల్లో ప్రతిభ కనబరిచే విద్యార్థులకు పాఠశాల ఎల్లప్పు డూ అండగా ఉంటుందని తెలిపారు.

   పాఠశాలలో ఆనందోత్సాహాలు

వర్షిణి విజయంపై సీనియర్ ఉ పాధ్యాయుడు దామోదర్ రెడ్డి, ఉపాధ్యాయ బృందం, తోటి వి ద్యార్థులు, స్థానిక ప్రజాప్రతిని ధులు అభినందనలు తెలిపారు. ఆమె సాధించిన విజయం ఇ తర వి ద్యార్థుల్లోనూ క్రీడల పట్ల ఆసక్తిని పెంచుతుందని పే ర్కొన్నారు. సరైన ప్రోత్సాహం, కృషి తోడైతే గ్రామీణ ప్రాంత వి ద్యార్థులు సైతం ఉన్నత స్థాయికి చేరుకోగలరనే సందేశాన్ని వ ర్షిణి అందించిందని ఉపాధ్యాయులు సంతోషం వ్యక్తం చేశారు.

Varshini State-Level Kabaddi Championship