–కీలక పదవులన్నీ ఏకగ్రీవం నూ తన కమిటీపై సభ్యుల్లో హర్షం
Doctor Hemalatha elected Nalgonda Red Cross Chairperson : ప్రజా దీవెన, నల్లగొండ: నల్లగొండ ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ చరి త్రలో నూతన అధ్యాయం ఆవి ష్కృత మైంది. సొసైటీ తొలి మ హిళా చైర్మన్‌గా డాక్టర్ హేమలత ఎం పికయ్యారు. కీలక పదవుల కు పోటీ లేకుండా ఏకగ్రీవంగా ఎ న్నిక కావడంతో నూతన నాయకత్వం కొలువుదీరింది. చైర్మన్ గా డాక్టర్ హేమలత, వైస్ చైర్మన్‌గా భీమనపల్లి శ్రీకాంత్, ట్రెజ రర్‌గా కుంభం జ్యోతిరెడ్డి, ఎగ్జిక్యూటివ్ సభ్యుడిగా మంచుకొం డ చిన్న బిక్షమయ్య ఎంపికయ్యారు.నామినేషన్ల దాఖలుకు కేటాయిం చిన పది నిమిషాల గడువులో ఈ పదవులకు పోటీ గా ఎవరూ నామినేషన్లు దాఖలు చేయకపో వడంతో వీరి ఎం పిక ఏకగ్రీవంగా పూర్తయింది.
సే
వా కార్యక్రమాలపై కొత్త ఆశలు
నల్లగొండ రెడ్‌క్రాస్ సొసైటీకి నూ తన నాయకత్వం రావడంతో స భ్యుల్లో హర్షం వ్యక్తమవుతోంది. మానవతా సేవలను మరిం త వి స్తరించడం, పేదలకు వైద్య సహా యం అందించడం, రక్త దాన కా ర్యక్రమాలను బలోపేతం చేయడం, సొసైటీ అభివృ ద్ధి కి కొత్త ది శానిర్దేశం చేయడంపై నూతన క మిటీ దృష్టి సారి స్తుందనే ఆశాభా వం వ్యక్తమవుతోంది.సేవా స్ఫూర్తితో ప్రజ కు మరింత చేరువగా రెడ్‌క్రాస్ సేవలను తీసుకెళ్లడంలో నూతన కమిటీ కీలక పాత్ర పోషి స్తుందని సభ్యులు ఆశిస్తున్నారు. నల్ల గొండ రెడ్‌క్రాస్ సొసైటీ భవి ష్యత్ ప్రస్థానంలో ఈ నూతన నా యకత్వం ఎలాంటి మార్పులు తీ సుకొస్తుందోనన్న ఆసక్తి నెల కొంది.
Doctor Hemalatha elected Nalgonda Red Cross Chairperson
