–పోలీసులకు యాదాద్రి జోన్ ఐ జీ షాహనవాజ్ ఖాసిం ఆదేశం
Yadadri jone IG surprise visit chityal PS : ప్రజా దీవెన, చిట్యాల: ప్రజల ప్రాణాలు, ఆస్తుల రక్షణే లక్ష్యంగా పోలీసు అ ధికారులు నిరంత రం అప్రమత్తంగా ఉంటూ, నేరాల నియం త్రణతో పాటు రోడ్డు ప్ర మాదాల నివారణకు ప్రత్యేక కా ర్యా చరణ చేపట్టాలని యాదాద్రి జోన్ ఐజీ షాహనవాజ్ ఖాసిం ఆ దేశించారు. సోమవారం చిట్యాల పోలీస్ స్టేషన్‌ను సందర్శించి త నిఖీ చేసిన ఆయన, స్టేషన్‌లో ని ర్వహిస్తున్న విధులు, కేసుల ద ర్యాప్తు పురోగతి, రికార్డుల నిర్వ హణ, శాంతిభద్రత ల పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలను సమీ క్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ పాల్గొ న్నారు.
ఫిర్యాదుదారులకు సత్వర న్యా యం అందించాలి
పోలీస్ స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదు దారులతో మర్యాదపూర్వ కంగా వ్యవహరించాలని, వారి సమస్య లను ఓపికగా విని చట్టప్రకారం సత్వర న్యాయం అందేలా చర్యలు తీసుకోవాల ని ఐజీ సూచిం చారు. ప్రతి ఫిర్యాదును ప్రాధాన్యతతో పరిశీ లించి, బాధితుల్లో పోలీస్ శాఖపై నమ్మకం పెంపొం దించేలా విధులు నిర్వహించాల ని స్పష్టం చేశారు. పెండింగ్ కేసు ల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారించి, దర్యాప్తులను వేగవం తం చేయాలని ఆదేశించారు.
ప్రమాదాల నివారణే ప్రధాన లక్ష్యం
చిట్యాల పోలీస్ స్టేషన్ పరిధిలో ని జాతీయ రహదారితో పాటు ఇ తర రహదారులపై ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేప ట్టాలని ఐజీ సూచించారు. తర చూ ప్రమాదాలు జరిగే ప్రాంతాల ను గుర్తించి, వాటికి గల కారణాలను విశ్లేషించి సంబంధిత శాఖ ల సమన్వయంతో నివారణ చర్యలు చేప ట్టాలని తెలిపారు. అ తివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్, మద్యం సే వించి వాహనాలు నడప డం, ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘ న లపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
వాహనదారులకు హెల్మెట్, సీ ట్ బెల్ట్ వినియోగంపై అవగాహ న కల్పించడంతో పాటు, రహదారి భద్రతపై విస్తృత ప్రచారం నిర్వ హించాలని సూచించారు. ప్రమా దాలు జరిగిన వెంటనే స్పందించి క్షతగాత్రులకు సకాలంలో వైద్య సహాయం అందేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.
మహిళలు, బాలల భద్రతకు ప్రాధాన్యం
మహిళలు, బాలికలు, చిన్నారు ల భద్రత విషయంలో రాజీ పడ కూడదని ఐజీ స్పష్టం చేశారు. పోక్సో చట్టం కింద నమోదయ్యే కేసులను అత్యంత ప్రాధాన్యత తో విచారిం చాలని, బాధిత బాల బాలికలకు రక్షణ, భరోసా కల్పి స్తూ వారి గోప్యతను కాపాడాలని సూచించారు. శాస్త్రీయ ఆధారాల సేక రణతో నాణ్యమైన దర్యాప్తు చేపట్టి, నిందితులకు శిక్షలు పడే లా చర్యలు తీసుకోవాలని ఆదే శించారు. పాఠశాలలు, కళాశాల లు, గ్రామా ల్లో అవగాహన కార్య క్రమాలు ని ర్వహిం చి, బాలలపై నేరాల నివా రణకు ప్రజలను చైత న్యపరచా లని తెలిపారు.
దొంగతనాల నియంత్రణకు నిరం తర నిఘా
ఇళ్ల దొంగతనాలు, వాహనాల చో రీలు, ఇతర ఆస్తి సంబంధిత నే రాల నియంత్రణకు పటిష్ట చర్య లు చేపట్టాలని ఐజీ సూచించా రు. నేరాలు ఎక్కువగా నమోద య్యే ప్రాంతాలను గుర్తించి, రాత్రి వేళల్లో పెట్రోలింగ్‌ను ముమ్మరం చేయాలని ఆదేశించారు. అను మానాస్పద వ్యక్తుల కదలికలపై నిఘా ఉంచడంతో పాటు సీసీ కె మెరాల వినియోగాన్ని ప్రోత్సహిం చాలని, అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థ వంతంగా వినియోగించు కోవాల ని తెలిపారు.
రౌడీషీటర్లు, గతంలో నేరాలకు పాల్పడిన వ్యక్తులు, పునరావృత నేరస్తులపై నిఘా కొనసాగించా లని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై చట్టప్రకారం చ ర్యలు తీసుకోవాలని సూచిం చా రు. సైబర్ నేరాల పట్ల ప్రజలకు అవగాహన కల్పించి, ఆన్‌లైన్ మోసాలకు గురైన బాధితులు వెంటనే 1930 హెల్ప్‌లైన్‌కు ఫి ర్యాదు చేసేలా ప్రచారం నిర్వ హించాలని పేర్కొన్నారు.
నాణ్యమైన దర్యాప్తుతో నేరస్తు లకు శిక్షలు పడేలా చర్యలు
పెండింగ్ కేసులను ఎప్పటికప్పు డు సమీక్షిస్తూ దర్యాప్తులను వేగ వంతం చేయాలని, సాక్ష్యాధారా లను పకడ్బందీగా సేకరించాలని ఐజీ ఆదేశించారు. కోర్టు కేసుల్లో సాక్షుల హాజరు, సమన్ల అమ లు, చార్జిషీట్ల దాఖలు వంటి అం శాలపై ప్రత్యేక దృష్టి సారించా లని సూచించారు. పోలీస్ స్టేషన్ రికార్డులను సక్రమంగా నిర్వహి స్తూ, విధుల్లో పారదర్శకత, క్రమ శిక్షణ పాటించాలని స్పష్టం చేశా రు.
ఐజీ సూచనల మేరకు చర్యలు తీసుకుంటాం: ఎస్పీ
జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ మాట్లాడుతూ జిల్లాలో రోడ్డు ప్ర మాదాల నివారణ, నేరాల ని యంత్రణ, మహిళలు, బాలల భ ద్రత, దొంగతనాల అరికట్టడం, ప్ర జలకు మెరుగైన పోలీస్ సేవలు అందించేందుకు సమగ్ర చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఐజీ సూచనల మేరకు క్షేత్రస్థాయి ప ర్యవేక్షణను మరింత పెంచి, ప్రజ లకు మెరుగైన సేవలు అందించ డంతో పాటు శాంతిభద్రతల పరి రక్షణకు కృషి చేస్తామని పేర్కొ న్నారు.ఈ తనిఖీలో నల్లగొండ డీ ఎస్పీ శివరాంరెడ్డి, చిట్యాల సీఐ సురేష్, ఎస్‌ఐ వెంకట్ రెడ్డి, ఇత ర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
Yadadri jone IG surprise visit chityal PS

