Praja Deveena
Newspaper Banner
Date of Publish : 13 October 2026, 4:01 am Posted by : praja deveena

Tehsildar and Mandal Surveyor ACB Trap : బిగ్ బ్రేకింగ్, ఏసీబీ వలలో తహ సీల్దార్, మండల సర్వేయర్,సర్వే రిపోర్టు కోసం రూ.20 లక్షల లం చంతో రెడ్‌హ్యాండెడ్‌గా అరెస్ట్

Tehsildar and Mandal Surveyor ACB Trap : ప్రజా దీవె న, రంగారెడ్డి: ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతికి పాల్ప డే అధికారులపై తెలంగాణ అవి నీతి నిరోధక శాఖ (ఏసీబీ) మరో సారి కొరడా ఝళిపించింది. లేఅ వుట్‌కు సంబంధించిన సర్వే ని ర్వహించి, జాయింట్ ఇన్‌స్పెక్షన్ సర్వే రిపోర్టు జారీ చేసే అ ధికారిక పనిని పూర్తి చేసేందుకు భారీ మొత్తంలో లంచం డి మాండ్ చే సిన అబ్దుల్లాపూర్మెట్ మండల స ర్వేయర్, తహసీ ల్దార్ ఏసీబీ వలలో చిక్కారు.

రూ.30 లక్షల నుంచి రూ.20 లక్షలకు బేరం

ఏసీబీ వివరాల ప్రకారం.. రంగారె డ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండ ల సర్వేయర్ బటుక శ్రీనివాసులు (AO-1), తహసీల్దార్ బి. సుదర్శ న్ రెడ్డి (AO-2) కలిసి ఫిర్యాదు దారుని నుంచి తొ లుత రూ.30 లక్షల లంచం డిమాండ్ చేశారు. అనంతరం ఆ మొత్తాన్ని రూ.20 లక్షలకు తగ్గించినట్లు అధికారులు వెల్లడిం చారు.హెచ్‌ఎండీఏ (HMDA) మార్గదర్శకాల ప్రకారం లేఅవు ట్ కోసం సర్వే నిర్వహిం చి, జాయింట్ ఇన్‌స్పెక్షన్ సర్వే రిపోర్టు జారీ చేసే ప్రక్రియను పూ ర్తి చేసేందుకు తహసీల్దార్ సూ చనల మేరకు మండల సర్వే య ర్ లంచం తీసుకుంటుండగా, ఏసీబీ కి చెందిన సీఐయూ (CIU) బృందం దాడిచేసి పట్టుకుంది.

   లంచంసొమ్ము స్వాధీనం

సర్వేయర్ వద్ద ఉన్న రూ.20 లక్ష ల లంచం సొమ్మును ఏసీబీ అధి కారులు స్వాధీనం చేసుకున్నా రు. నిర్వహించిన రసాయ న పరీక్షలో ఆయన చేతి వేళ్లపై లంచం తీసుకున్నట్లు నిర్ధారణ కావడం తో పరీక్ష ఫలితం పాజిటివ్‌గా వ చ్చింది. ఈ వ్యవహా రంలో ఇద్దరు అధికారులు తమ ప్రభుత్వ విధులను అక్రమం గా, నిజాయితీకి విరుద్ధంగా నిర్వహించినట్లు ఏసీ బీ పేర్కొంది.

   న్యాయస్థానం ముందు హాజరు

సర్వేయర్ బటుక శ్రీనివాసులు, తహసీల్దార్ బి. సుదర్శన్ రెడ్డి లను అరెస్టు చేసి, హైదరాబా ద్‌ లోని నాంపల్లిలో ఉన్న ఎస్‌ పీఈ, ఏసీబీ కేసుల ప్రిన్సిపల్ స్పెషల్ జడ్జి ఎదుట హాజరుపరి చేందుకు చర్యలు చేపట్టారు. ఈ కేసు ప్ర స్తుతం దర్యాప్తులో ఉంది. ఫిర్యా దుదారుని గుర్తింపును భద్రతా కారణాల దృష్ట్యా గోప్యంగా ఉం చినట్లు అధికారులు తెలిపారు.

  లంచం అడిగితే 1064కు ఫోన్ చేయండి

ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే ప్రజలు ని ర్భయంగా తెలంగాణ ఏసీబీని సంప్రదించాలని అధికారులు సూ చించారు. ఫిర్యాదుల కోసం 10 64 టోల్‌ఫ్రీ నంబర్ కు కా ల్ చేయ వచ్చు. వాట్సాప్ ద్వారా 944 0446106 నంబర్‌కు సమాచారం అందించవచ్చు. అలాగే ఫేస్‌ బుక్‌లో Telanga na ACB, ఎక్స్‌ (గతంలో ట్విట్టర్‌) వేదికపై @ Te langana ACB ద్వారా కూడా సంప్రదించవచ్చు. ప్రభుత్వ కార్యాలయా లు, ముఖ్యమైన బహి రంగ ప్రదేశాల్లో ఏసీబీని సంప్రదిం చేం దుకు QR కోడ్‌లను సైతం ఏ ర్పాటు చేశారు.ఫిర్యాదుదారుల పేర్లు, వివరాలు గోప్యంగా ఉంచుతామని ఏసీబీ భరోసా ఇ చ్చింది. అవినీతికి వ్యతిరేకంగా ప్రజలు ముందుకు వచ్చి స మాచారం అందించాలని కోరింది.