Praja Deveena
Newspaper Banner
Date of Publish : 14 October 2026, 2:57 pm Posted by : praja deveena

Blue Drum Murder Case Verdict : బిగ్ బ్రేకింగ్, బ్లూడ్రమ్ హత్య కే సులో సంచలన తీర్పు, భార్య ముస్కాన్‌, ప్రియుడు సాహిల్‌ శు క్లాకు ఉరిశిక్ష

Blue Drum Murder Case Verdict : ప్రజా దీవెన, దేశవ్యా ప్తంగా సంచలనం సృష్టించిన ఉత్తరప్రదేశ్‌ లోని మీరట్‌ బ్లూ డ్ర మ్‌ హత్య కే సులో కోర్టు సంచలన తీర్పు వెలువరించినట్లు స మాచారం. మర్చంట్‌ నేవీ అధికారి సౌరభ్‌ రాజ్‌ పుత్‌ హత్య కే సులో ఆయన భా ర్య ముస్కాన్‌, ఆమె ప్రియుడు సాహిల్‌ శు క్లాకు ఉరిశిక్ష విధించి నట్లు కథనాలు వెల్లడించాయి. ఈ దారు ణ హత్య దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది.

    పక్కా ప్రణాళికతో దారుణహత్య

మీరట్‌కు చెందిన సౌరభ్‌ రాజ్‌పు త్‌ మర్చంట్‌ నేవీ అధికారిగా పని చేస్తున్నారు. ఆయన భార్య ము స్కాన్‌కు సాహిల్‌ శుక్లా తో వివాహేతర సంబంధం ఉన్నట్లు దర్యా ప్తులో వెల్లడైంది. ఈ నేపథ్యంలో భర్తను హత్య చేయాలని ఇద్దరూ ప్రణాళిక రూ పొందించినట్లు అభి యోగాలు నమోదయ్యాయి.

2025 మార్చి 4న లండన్‌ నుంచి ఇంటికి వచ్చిన సౌరభ్‌కు ఆ హారంలో నిద్రమాత్రలు కలిపి ఇచ్చినట్లు, ఆయన స్పృహ కో ల్పోయిన తర్వాత కత్తితో పొడిచి హత్య చేసినట్లు దర్యాప్తు లో ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. అనంతరం మృతదే హాన్ని ముక్కలుగా చేసి బ్లూ డ్రమ్‌లో ఉంచి, దానికి సిమెంట్‌ తో సీల్‌ వేసినట్లు పోలీ సులు గుర్తించారు.

   బ్లూ డ్రమ్‌తో వెలుగులోకి వచ్చిన హత్య

హత్య అనంతరం నిందితులు హిమాచల్‌ప్రదేశ్‌కు వెళ్లిపోయి నట్లు పోలీసులు తెలిపారు. సౌరభ్‌ ఫోన్‌కు స్పందన లేకపోవ డంతో అనుమానం వచ్చిన కుటుంబ స భ్యులు పోలీసులను ఆశ్రయిం చారు. దీంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు 2025 మార్చి 17న ఇంటిని తనిఖీ చేయగా, సిమెం ట్‌తో మూసివేసి న బ్లూ డ్రమ్‌ కనిపించింది. దానిని తెరిచి చూడగా సౌరభ్‌ మృ తదేహ భాగాలు బయటపడ్డాయి.

వెయ్యి పేజీల ఛార్జ్‌షీట్‌.. 22మంది సాక్షులు

ఈ కేసులో పోలీసులు సుమారు వెయ్యి పేజీల ఛార్జ్‌షీట్‌ సిద్ధం చే సినట్లు, విచారణలో మొత్తం 22 మంది సాక్షులను పరిశీ లించిన ట్లు కథనాలు పేర్కొన్నాయి. ఈ దారుణ హత్యకు సం బంధించి కోర్టు నిందితులకు ఉరిశిక్ష విధిం చినట్లు సమాచారం వెల్లడైంది.కుటుంబ బంధాలను ఛిద్రం చేసి న ఈ ఘటన, నేరా ల వెనుక దా గి ఉన్న కుట్రలు ఎంతటి విషాదా నికి దారితీస్తా యో మరోసారి చాటిచెప్పింది.