Praja Deveena
Newspaper Banner
Date of Publish : 14 October 2026, 12:26 pm Posted by : praja deveena

Gutha Sukender Reddy key suggestions : శాసనమండలి చైర్మన్ గుత్తా ఘాటు వ్యాఖ్యలు, మహబూ బ్‌నగర్‌, నల్లగొండ మధ్య నీటి పంచాయితీకి తెరదించాలి

—జల వివాదాలతో సీఎం రేవంత్ రెడ్డిపై ఒత్తిడితెచ్చే ప్రయత్నమా

–నీటి కేటాయింపులపై సీఎం వెంటనే జోక్యం చేసుకోవాలి

Gutha Sukender Reddy key suggestions : ప్రజా దీవె న, నల్లగొండ: తెలంగా ణలో సాగునీటి ప్రాజెక్టుల చుట్టూ రాజ కీయ వేడి రాజుకుం టోంది. మహబూబ్‌నగర్‌, నల్గొండ జిల్లాల మధ్య జలవివాదం ఎందుకు సృష్టిస్తున్నారని తెలంగాణశాసన మండలి చైర్మన్ గు త్తా సుఖేందర్ రెడ్డి ప్రశ్నించారు. ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డిపై ఒ త్తిడి తెచ్చేందుకే ఈ వివాదాలను తెర పైకి తీసుకొస్తున్నారా? అని ఆయన ఘాటుగా వ్యాఖ్యానిం చా రు. జిల్లాల మధ్య చిచ్చుపెట్టి తెలంగాణ ప్రయోజనాలకు న ష్టం కలిగించడం సరికాదని హితవు పలికారు.నల్లగొండలోని తన క్యాంపు కార్యాలయంలో మీడియా ప్రతినిధులతో నిర్వ హించిన చిట్‌చాట్‌లో గుత్తా సుఖేందర్ రె డ్డి పలు కీలక అంశా లను ప్రస్తావించారు. ఎదుళ్ల రిజర్వాయర్ నీటి కేటాయింపు ల పై అనవసర వివాదాలకు తావివ్వకుండా, రెండు జిల్లాల రైతు ల ప్రయోజనాల ను దృష్టిలో ఉంచుకుని సమస్యను సామర స్యంగా పరిష్కరించాలని సూచించారు.

   సీఎం చొరవతోనే సమస్యకు పరిష్కారం

మహబూబ్‌నగర్‌, నల్గొండ జిల్లాలకు చెందిన మంత్రులు, ఎ మ్మెల్యేలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక సమావేశం ని ర్వహించి నీటి పంపకాలపై స్పష్టత ఇవ్వా లని గుత్తా కోరారు. ఎదుళ్ల రిజ ర్వాయర్ నుంచి రోజుకు 1.5 టీ ఎంసీల నీటిని పాలమూరు రం గారెడ్డి ప్రాజెక్టుకు, 0.5 టీఎంసీల నీటిని డిండి ఎత్తిపోతల పథకానికి కేటాయించే అంశానికి మంత్రివర్గం ఆ మోదం తెలిపిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. ఈ నే ప థ్యంలో మళ్లీ వివాదాలు సృష్టించడం వల్ల రెండు ప్రాంతాల ప్ర జల్లో అనవసర అపోహలు పెరిగే ప్రమాదం ఉందన్నారు. మహబూబ్‌నగర్ ప్రజలను రెచ్చ గొట్టేలా వ్యవహరించడం తగ దని, నీళ్లు, నిధులు, నియామకాల కోసం పోరాడి సాధించుకు న్న తెలంగాణలో జిల్లాల మధ్య నీటి కోసం ఘర్షణ వాతావర ణం నెలకొనడం బాధాకరమని పేర్కొన్నారు.

   ప్రాజెక్టుల పనులు వేగవంతం చేయాలి

పాలమూరు–రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాల పనులను త్వరితగతిన పూర్తి చేసి రెండు జిల్లాల రైతులకు సాగునీరు అందించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని గుత్తా సూ చించారు. నార్లాపూర్ నుంచి నీటిని త రలించే ప్రతిపాదనలో అదనపు వ్యయం, ఎక్కువ సమయం పట్టే అంశాలను పరిగణ నలోకి తీసు కోవాలని అన్నారు.సాగునీటి ప్రాజెక్టుల రూపకల్ప న, నీటి తరలింపు విషయంలో సాం కేతిక అంశాలు, ఆర్థిక భా రం కీలకమని స్పష్టం చేశారు. ఇంజనీర్లు రాజకీయాలకు అతీ తంగా వ్యవ హరిస్తూ వాస్తవ పరిస్థితుల ఆధారంగా నిర్ణయా లు తీసుకో వా లని సూచించారు.

  ఫ్లోరైడ్ బాధిత నల్గొండకు సాగునీరు అవసరం

గతంలో ఫ్లోరైడ్ సమస్యతో తీ వ్రంగా ఇబ్బందులు ఎదుర్కొన్న నల్గొండ జిల్లాకు సాగునీటి వస తులు కల్పించడం అత్యంత ము ఖ్యమని గుత్తా పేర్కొన్నారు. వ్య వసాయానికి అవసరమై న నీటిని అందించడం ద్వారా రైతులకు భరోసా కల్పించాల న్నారు. ఒక జి ల్లాకు ప్రయోజనం కల్పించే క్ర మంలో మరో జి ల్లాకు అన్యా యం జరగకుండా సమతుల్య విధానాన్ని అను సరించాలని అభి ప్రాయపడ్డారు.

ఎల్‌నినో ప్రభావంపై అప్రమత్తంగా ఉండాలి

ఎల్‌నినో ప్రభావంతో కరువు పరిస్థితులు ఏర్పడే అవకాశాల ను దృష్టిలో ఉంచుకుని రైతులు అ ప్రమత్తంగా ఉండాలని గు త్తా సూచించారు. జలాశయాల్లో నీటి నిల్వలు తగ్గుతున్న నేప థ్యంలో జ లవిద్యుత్ ఉత్పత్తిపైనా ప్రభావం పడే అవకాశం ఉందని పేర్కొన్నా రు. నీటిని, విద్యుత్‌ను పొదుపుగా విని యోగించుకోవాలని ప్రజలకు సూచించారు. రబీ సీజన్‌లో అధి క నీరు అవస రమయ్యే పంటలకు బదులు గా ఆరుతడి పంట ల సాగుపై రైతు లు దృష్టి సారించాలని తెలిపారు. అందుబా టులో ఉన్న నీటి వ నరులను సమర్థంగా వినియోగిం చుకుం టూ భవిష్యత్తులో ఎదుర య్యే ఇబ్బందులను తగ్గించుకో వా లని సూచించారు.

తెలంగాణ ప్రయోజనాలే ప్రథమ ప్రాధాన్యం

మహబూబ్‌నగర్‌–నల్గొండ జిల్లా ల మధ్య నెలకొన్న జల వివా దాన్ని పరస్పర చర్చలు, సమన్వయంతో పరిష్కరించుకోవా ల ని గుత్తా సుఖేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. ప్రాంతాల మధ్య సో దర భావాన్ని దెబ్బతీసే వ్యాఖ్యలకు, చర్యలకు దూరంగా ఉం డాలని కోరారు. రెండు జిల్లాల రైతులకు సాగునీరు అందిం చ డమే లక్ష్యంగా ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు కలిసి పనిచేయా లని స్పష్టం చేశారు.జిల్లాల మధ్య పోటీ కాదు.. రైతుల ప్రయో జనాలే ముఖ్యం. రాజకీ యాలకు అతీతంగా జల సమ స్యను పరిష్కరించి తెలంగాణ స మగ్ర అభివృద్ధికి కృషి చేయాల్సి న అవసరం ఉందని గుత్తా సు ఖేందర్ రెడ్డి వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి.

Gutha Sukender Reddy key suggestions