Praja Deveena
Newspaper Banner
Date of Publish : 14 October 2026, 8:57 am Posted by : praja deveena

Jagan Assets Case ED Daily Hearings : బిగ్ బ్రేకింగ్, జగన్ ఆస్తుల కేసు ల్లో కీలక మలుపు, ఈడీ కేసులపై రోజువారీ విచారణకు సీబీఐ కో ర్టు నిర్ణయం

Jagan Assets Case ED Daily Hearings : ప్రజా దీవెన, హైదరాబాద్: వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ము ఖ్యమం త్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆస్తుల కేసుల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. జగన్‌పైన మోదైన ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరె క్టరే ట్‌ (ఈడీ) కేసుల విచారణను రోజువారీగా చేపట్టేందుకు సీబీ ఐ ప్రత్యేక కోర్టు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ నిర్ణ యం అమలులోకి వస్తే, దశాబ్ద కాలంగా పెండింగ్‌లో ఉన్న కే సుల విచారణలో వేగం పెరిగే అవకాశం ఉంది.

  పదేళ్లుగా పెండింగ్‌లో 9 ఛార్జిషీట్లు

జగన్‌ ఆస్తులకు సంబంధించిన ఈడీ కేసుల్లో దాఖలైన తొమ్మి ది ఛార్జిషీట్లు సుమారు పదేళ్లుగా కో ర్టులో పెండింగ్‌లో ఉన్నా యి. డి శ్చార్జి పిటిషన్లపై నిర్ణయాలు వెలువడకపోవడంతో వి చారణ ముందుకు సాగడం లేదని ఈడీ అధికారులు అభ్యం తరం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

   70 మంది నిందితులపై విచారణ

ఈ కేసులకు సంబంధించి వైఎస్‌ జగన్‌తో పాటు మొత్తం 70 మం ది నిందితులను వ్యక్తిగతంగా వి చారించే అంశం కూడా ప్రాధా న్యం సంతరించుకుంది. కేసుల విచారణను రోజువారీ గా నిర్వ హించాలని కోరుతూ ఈడీ అధి కారులు గతంలోనే హైకోర్టును ఆశ్రయించారు.

ఇక విచారణలో వేగం పెరుగుతుందా?

ఏళ్ల తరబడి కొనసాగుతున్న ఈ కేసుల విచారణలో తాజా పరిణామం కీలకంగా మారింది. రోజు వారీ విచారణతో కేసుల్లో పురోగ తి సాధ్యమవుతుందా? డిశ్చార్జి పిటిషన్లపై ఎలాంటి ని ర్ణయాలు వెలువడతాయి? అన్న అంశాలపై రాజకీయ, న్యా య వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఇదిలా ఉండగా కోర్టు ఆదేశాల ఖచ్చితమైన వివ రాలు, రోజువారీ విచారణ ప్రారంభ తేదీ, వ్య క్తిగత హాజరుకు సం బంధించిన నిబంధనలను అధికారిక ఉ త్తర్వులతో నిర్ధారించుకో వాల్సి ఉందని న్యాయ నిపుణులు చెబుతున్నారు.