Praja Deveena
Newspaper Banner
Date of Publish : 14 October 2026, 12:46 pm Posted by : praja deveena

Nalgonda collector Chandrashekhar : త్వరితగతిన నూతన కలెక్టర్ కా ర్యాలయ నిర్మాణ పనులు పూర్తి — నల్లగొండ జిల్లా కలెక్టర్ బి చం ద్రశేఖర్

Nalgonda collector Chandrashekhar : ప్రజా దీవెన, నల్లగొండ: నల్లగొండ ప్రస్తుత కలెక్టర్ కార్యాలయ ఆవ రణలో చేపట్టిన నూతన కలెక్టర్ కార్యాలయ భవన నిర్మాణ ప నుల న్నీ సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసి అందుబాటులోకి తీ సు కురావాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ అధికారులను ఆదే శించారు. బుధవారం ఆయన ప్ర స్తుత కలెక్టరేట్ ప్రాంగణంలో ని ర్మాణంలో ఉన్న నూతన కలెక్టర్ కార్యాలయ భవన నిర్మాణ పను లను పరిశీలించారు.

సమావేశ మందిరం, ప్రజావాణి సమావేశ మందిరం,వి సి హాల్, మంత్రి, కలెక్టర్, అదనపు కలెక్ట ర్లు, జిల్లా రెవెన్యూ అధికారి ఛాంబర్లను,ఉద్యోగులు,సిబ్బంది విభాగాలను కలెక్టర్ పరిశీలిం చి, అవసరమైన ఫర్నిచర్, విద్యుత్ ఇతర సౌకర్యాలు ఏర్పా టు చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. ప్ర జావాణి హాలులో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని, సౌండ్ సిస్టం, కంప్యూటర్లు, ప్రొ జెక్టర్, ఇంటర్నెట్, ఏసీ, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆ దేశించారు. ప్రతి గదికి బీఎస్‌ఎన్‌ఎల్ నెట్‌వర్క్‌తో పాటు, ఇం టర్నెట్ సౌకర్యం కల్పించాలని, టైల్స్ పనులు నాణ్యతతో చేప ట్టాలని ఆదేశించారు.

సమావేశ మందిరంలో విద్యుత్, సౌండ్ సిస్టం, సీటింగ్, ఫర్ని చర్, పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌కు అవసరమైన ఏర్పాట్లు చేయాల ని సూచించారు. లిఫ్ట్‌లకు అవస రమైన కనెక్షన్లు ఏ ర్పాటు చేయ డంతో పాటు, రెండో అంతస్తులోని కార్యాల యాలకు సీసీ కెమెరా ల సౌకర్యం కల్పించాలని, వీడియో కా న్ఫరెన్స్ హాలులో టీవీ, మైక్ సిస్టం ఏర్పాటు చేయాలని ఆదేశిం చారు.భవనంలో ఎక్కడా నీటి లీకేజీలు లేకుండా చూడా ల ని, గ్లాస్ ఫిట్టింగ్ పనులను నా ణ్యతతో పూర్తి చేయాలని, ఫైర్ సేఫ్టీ ఏర్పాట్లు తప్పనిసరిగా చేప ట్టాలని ఆదేశించారు. భవనం చు ట్టూ ల్యాండ్‌స్కేపింగ్, పా ర్కింగ్, తెలంగాణ తల్లి విగ్రహం, ఫ్లాగ్ ఏర్పాటు, వంటి పనుల న్నింటినీ నిర్ణీత గడువులోగా పూ ర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

నూతన కలెక్టరేట్‌ కు వచ్చే ప్రజలు, అధికారులు, సిబ్బందికి అ న్ని విధాలా సౌకర్యవంతంగా ఉండేలా నిర్మాణ పనులను నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించా రు. జిల్లా రెవెన్యూ అ ధికారి దశ రథ , ఆర్ అండ్ బి ఎస్ ఈ. మోహన్, ఈ ఈ శ్రీధర్ రెడ్డి, ప్రాజెక్టు మేనేజర్ అభిషేక్, ఎలక్ట్రి కల్ డి ఈ శృ తి, సివిల్ డిఈ ఫణిజ, ఎ ఈ పుణ్య,ఏవో మోతి లాల్ తది తరులు కలె క్టర్ వెంట ఉన్నారు.