Praja Deveena
Newspaper Banner
Date of Publish : 14 October 2026, 3:31 pm Posted by : praja deveena

Nalgonda Court sensational Verdict in rapecase : బిగ్ బ్రేకింగ్, నల్లగొండ మహిళా కోర్టు సంచలన తీర్పు, వివాహిత పై అత్యాచారo కేసులో నిందితు డికి 20 ఏళ్ల కఠిన కారాగారశిక్ష

Nalgonda Court sensational Verdict in rapecase : ప్రజా దీవెన, నల్ల గొండ క్రైమ్ : మహిళపై అత్యాచారం, అప హరణ, దోపిడీకి పా ల్పడిన నిందితుడికి నల్లగొండ మహిళా కోర్టు కఠిన శిక్ష విధించింది. వాడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన ఈ కేసులో నిందితుడు బానోత్ శ్రీను అలియాస్ చి న్నా (35)కు మొత్తం20 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.20 వేల జరి మానా విధిస్తూ న్యాయస్థా నం తీర్పు వెలువరించింది. మ హి ళలపై నేరాలకు పాల్పడేవారికి చట్టప్ర కారం కఠిన చర్యలు త ప్పవనే విషయాన్ని ఈ తీర్పు మరోసా రి స్పష్టం చేసింది.

ప్రయాణం మధ్యలో దారుణం

2019లో జరిగిన ఈ ఘటన వివ రాల ప్రకారం.. నిందితుడు టాటా ఏస్ వాహనంలో భార్యాభర్తలను వారి గమ్యస్థానానికి తీసుకెళ్తున్న సమయంలో, వారు దిగాల్సిన ప్ర దేశానికి చేరుకో గానే భర్త వాహనం దిగాడు. అదే అదనుగా భావించిన నింది తుడు వాహనం తలుపు మూసి వివాహితను బలవంతంగా తనతో పాటు తీసుకెళ్లి అపహరించాడు. అనంతరం ఆ మెను బెదిరించి అత్యాచారానికి పాల్పడటంతో పాటు, ఆమె వద్ద ఉ న్న ఆభరణాలను దోచుకుని మార్గమధ్యలో వదిలేసి పరార య్యాడు.

   …మూడు సెక్షన్ల కింద శిక్షలు

బాధితురాలి ఫిర్యాదు మేరకు వాడపల్లి పోలీసులు కేసు న మోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నే రం నిరూపించేందుకు అవ సరమై న ఆధారాలను సేకరించి న్యాయ స్థానంలో సమర్పిం చారు. విచార ణ అనంతరం నల్లగొండ మహిళా కోర్టు కమ్‌ IV అదనపు జిల్లా, సెషన్స్‌ న్యాయస్థానం నిందితుడికి వివిధ సెక్ష న్ల కింద శిక్షలు విధించింది.

ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.5వేల జరిమానా

ఐపీసీ సెక్షన్ 376 ప్రకారం పదేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.10,0 00 జరిమానా తో పాటు ఐపీసీ సెక్ష న్ 392 ఐదేళ్ల కఠిన కారా గార శిక్ష, రూ.5వేల జరిమానా, మొత్తంగా 20 ఏళ్ల కఠిన కారా గార శిక్షతో పాటు రూ.20 వేల జరిమానా విధించింది. జరిమా నా చెల్లించని పక్షంలో న్యాయస్థానం ఉత్తర్వుల మేరకు అదన పు శిక్ష కూడా అమలుకానుంది. ఈ కేసులో అ ప్పటి వాడపల్లి ఎస్‌ఐ కె. నరసింహారావు, మిర్యాలగూడ రూరల్ సర్కిల్ అప్ప టి సీఐ ఏ. రమేష్ బాబు సమర్థవంతంగా దర్యాప్తు నిర్వ హిం చి, నిందితుడికి శిక్షపడేలా కీలకపాత్ర పోషించారు. అదనపు ప బ్లిక్ ప్రాసిక్యూటర్ ఆర్. అఖిల న్యాయస్థానంలో ప్రాసిక్యూషన్ తరఫున వాదనలు వినిపించారు.

మహిళల భద్రతకు అత్యంతప్రాధాన్యం: ఎస్పీ

మహిళలపై నేరాలకు పాల్పడే వారిపై చట్టప్రకారం కఠిన చర్య లు తీసుకుంటామని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ స్పష్టం చేశారు. నేరస్తులు ఎంతటివారైనా చ ట్టం నుంచి తప్పించుకో లేరని, బాధితులకు న్యాయం జరిగేలా పోలీస్ శాఖ నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు. నేరాల నియంత్రణలో ప్రజలు పోలీ సులకు సహకరించాలని, వేధింపులు లేదా ఇతర నేర ఘటన లు ఎదురైతే వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌ ను సంప్రదించాల ని సూచించారు.

 పోలీసులకు అభినందనలు

ఈ కేసులో దర్యాప్తు, ప్రాసిక్యూ షన్‌, కోర్టు విధుల నిర్వహణ లో సమన్వయంతో పనిచేసిన అప్ప టి వాడపల్లి ఎస్‌ఐ కె. న రసింహారావు, అప్పటి సీఐ ఏ. రమేష్ బాబు, అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆర్. అఖిలతో పాటు ప్రస్తుత వాడపల్లి ఎస్‌ఐ డి. సైదులు, మి ర్యాలగూడ రూరల్ సీఐ పి.ఎన్. డి. ప్రసాద్, డీఎస్పీ జి. రవి, డి. సి.ఆర్.బి సీఐ శ్రీను నాయక్, కోర్టు డ్యూటీ ఆఫీసర్ ఎండీ అద్నాన్ అహ్మద్, లైజన్ అధికారులు హెడ్ కా నిస్టేబుల్ పి. నరేందర్, కానిస్టేబుల్ ఎన్. మల్లికార్జున్‌లను జి ల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ అభినందించారు.మహిళలపై నే రాలకు పాల్పడితే కఠిన శిక్షలు తప్పవనే సందేశాన్ని ఈ తీర్పు ఇచ్చిందని పోలీస్ శాఖ పేర్కొంది.