Praja Deveena
Newspaper Banner
Date of Publish : 15 October 2026, 1:05 pm Posted by : praja deveena

Electricity Department AE Bribery Case : బిగ్ బ్రేకింగ్, రూ.1.20 లక్షల లం చంతో ఏసీబీకి చిక్కిన విద్యుత్ శాఖ ఏఈ, రెడ్‌హ్యాండెడ్‌గా ప ట్టుబడ్డ వైనం

Electricity Department AE Bribery Case : ప్రజా దీవెన, హైదరాబాద్ : ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతికి పాల్పడే అ ధికారులపై ఏసీబీ కొరడా ఝుళిపిస్తోంది. ఈ క్రమంలో హైదరా బాద్‌లోని సంతోష్‌న గర్ సబ్‌ డివిజన్‌ పరిధిలో ఉన్న మదన్న పేట సెక్షన్‌కు చెందిన TG SPDCL అసిస్టెంట్ ఇంజినీర్ పం డ ల సంధ్య రాకేష్‌ రూ.1.20 లక్ష ల లంచం తీసుకుంటూ ఏసీబీ అ ధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా ప ట్టుబడ్డారు.ఏసీబీ సిటీ రేం జ్‌-II అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఫిర్యాదుదారుని కి పాత విద్యుత్‌ మీటర్లు పోయిన స్థానం లో ఆరు కొత్త విద్యు త్‌ మీటర్లు మంజూరు చేయడంతో పాటు, వాటికి సంబంధిం చిన ఆన్‌లైన్‌ దరఖాస్తులను ఆమోదించేందుకు నిందిత అధి కారి రూ.1,20,0 00 లంచం డిమాండ్‌ చేశారు. ఈ మొత్తాన్ని స్వీకరిస్తుండగా అక్టో బర్‌ 15న ఏసీబీ అధికారులు దా డి చేసి పట్టుకున్నారు. లంచంగా తీసుకున్న నగదును కూడా స్వా ధీ నం చేసుకున్నారు.

అవినీతి నిరోధక చట్టం కింద చర్యలు

తన అధికారిక విధులను అక్ర మంగా, నిజాయితీకి విరుద్ధంగా నిర్వహించి అక్రమ లబ్ధి పొందేందుకు ప్రయత్నించినట్లు ఏసీబీ అ ధికారులు పేర్కొన్నారు. నిందిత అధికారిని నాంపల్లిలోని SPE & ACB కేసుల ప్రత్యేక న్యాయ స్థానం ముందు హాజరు పరిచి జ్యుడీషియల్‌ రిమాండ్‌కు తరలించే ప్రక్రియ చేపట్టారు. ఈ కేసులో త దుపరి విచారణ కొనసాగుతోంది. ఫిర్యాదుదా రుని భద్రత దృష్ట్యా ఆయన వివరాలను ఏసీబీ అధి కారులు గోప్యంగా ఉంచారు.

  లంచం అడిగితే ఫిర్యాదు చేయండి 

ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా లంచం డిమాండ్‌ చేస్తే ప్రజలు ని ర్భయంగా తెలంగాణ ఏసీబీకి ఫి ర్యాదు చేయవచ్చని అ ధికారులు సూచించారు.ఏసీబీ టోల్‌ ఫ్రీ నంబర్‌ 1064, వాట్సా ప్‌ 944 0446106, ఫేస్‌బుక్‌ లో Telan gana ACB,ఎక్స్‌ (ట్విట్టర్‌) @ Telangana ACB లతో పాటు ప్రభుత్వ కార్యాల యాలు, ప్రధాన బహిరంగ ప్రదేశాల్లో అందు బాటులో ఉన్న ఏసీబీ క్యూఆర్‌ కోడ్‌ ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చు. ఫి ర్యాదుదారుల పేర్లు, వ్యక్తిగత వివరాలను గోప్యంగా ఉం చు తామని ఏసీబీ స్ప ష్టం చేసింది.అవినీతిని సహించకుండా, లం చం డిమాండ్‌ చేసే అధికారులపై ఫిర్యాదు చేసి పారదర్శక పా లనకు ప్రజలు సహక రించాలని అధికారులు కోరుతున్నారు.