Praja Deveena
Newspaper Banner
Date of Publish : 16 October 2026, 9:09 am Posted by : praja deveena

Telangana Automated Fitness Testing Centres : తెలంగాణలో వాహనదారులకు కీలక మార్పు, రూ.425.50 కోట్ల తో 37 ఆటోమేటెడ్ ఫిట్‌నెస్ టెస్టింగ్ కేంద్రాలు

Telangana Automated Fitness Testing Centres : ప్రజా దీవెన, హైదరాబాద్: వాహనాల ఫిట్‌నెస్ పరీక్షల్లో పారదర్శకత పెంచడం, మానవ జోక్యాన్ని తగ్గించడం, అత్యాధు నిక సాంకేతికతతో తనిఖీలు ని ర్వహించడమే లక్ష్యంగా తెలం గాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా 37 ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్ల (AT S) ఏర్పాటుకు రూ.425.50 కో ట్ల పరిపాలనా అనుమతులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జా రీ చేసింది. ఈ కేంద్రాలు అందు బాటులోకి వస్తే వాహనాల ఫిట్‌ నెస్ పరీక్షలు మరింత ఆధునిక విధానంలో నిర్వహించే అవకా శం ఉంటుంది.

ఒక్కో కేంద్రానికి రూ.11.50 కోట్లు

వాహనాల ఫిట్‌నెస్ పరీక్షల్లో ఆ ధునిక సాంకేతికతకు ప్రాధాన్యత నిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్ర భాకర్ వెల్లడించారు. గతంలో ఒ క్కో కేంద్రానికి రూ.8 కోట్ల చొప్పు న మొత్తం రూ.296 కోట్లకు అను మతులు ఇవ్వగా, ప్రస్తుత అవస రాలకు అనుగుణంగా ఒక్కో కేం ద్రం వ్యయాన్ని రూ.11.50 కోట్ల కు పెంచారు. దీంతో మొత్తం ప్రా జెక్టుకు రూ.425.50 కోట్ల నిధు లు ఆమోదం పొందాయి.

రెండు దశల్లో నిర్మాణం

రాష్ట్రంలో మొత్తం 37 ఆటోమే టెడ్ టెస్టింగ్ స్టేషన్లను రెండు దశల్లో ఏర్పాటు చేయనున్నారు.
తొలి దశలో 15 కేంద్రాల నిర్మా ణానికి రూ.172.50 కోట్లు కేటా యించారు. ఉమ్మడి జిల్లాల ప్ర ధాన కార్యాలయాల్లో ఒక్కొక్కటి చొప్పున, గ్రేటర్ హైదరాబాద్ మె ట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథా రిటీ (HMDA) పరిధిలో అదనం గా నాలుగు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఇక రెండో దశ లో మిగిలిన 22 కేంద్రాలను ని ర్మించనున్నారు. ఇందుకోసం రూ.253 కోట్ల నిధులను ప్రభు త్వం ఆమోదించింది.

రుణాలతో నిధుల సమీకరణ

ఈ కేంద్రాల నిర్మాణం, నిర్వహణ కోసం రవాణా శాఖ పరిధిలో ప్ర త్యేక ప్రయోజన సంస్థ (స్పెషల్ పర్పస్ వెహికల్‌–SPV) ఏర్పా టు చేసేందుకు ప్రభుత్వం అను మతిచ్చింది. ప్రాజెక్టుకు అవస రమైన నిధులను హడ్కో (HU DCO), ఇతర ఆర్థిక సంస్థల నుం చి రుణాల రూపంలో సమీకరిం చనున్నారు.

వాహనాల ఫిట్‌నెస్ పరీక్షల ద్వా రా లభించే దరఖాస్తు రుసుము లు, వినియోగదారు ఛార్జీలను ప్రత్యేక నిధిలో జమ చేయను న్నారు. ఈ నిధుల ద్వారా బ్యాం కు రుణాల అసలు, వడ్డీ చెల్లిం పులు చేపట్టేలా ప్రణాళిక రూ పొందించారు.

పారదర్శకతకు పెద్దపీట

ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్ల ఏ ర్పాటుతో వాహనాల ఫిట్‌నెస్ ప రీక్షలను సాంకేతిక పరిజ్ఞానం ఆ ధారంగా నిర్వహించేందుకు మా ర్గం సుగమం కానుంది. మానవ జోక్యం తగ్గించడం ద్వారా పరీ క్ష ల్లో పారదర్శకతను పెంచడంతో పాటు, వాహనాల రహదారి భద్ర తకు మరింత ప్రాధాన్యత కల్పిం చే అవకాశం ఉంది. అయితే ఈ కేంద్రాల ప్రారంభం, ప్రాంతాలవారీ గా పూర్తి వివరాలు వెల్లడైన త ర్వాతే వాహనదారులకు అందు బాటులోకి వచ్చే సేవలపై స్పష్టత రానుంది.