Rta fitness centers in Telangana : ప్రజా దీవెన, హైద రాబాద్: వాహనాల ఫిట్నెస్ పరీక్షల్లో పారదర్శకత పెంచడం, మానవ జోక్యాన్ని త గ్గించడం, అత్యాధునిక సాంకేతికతతో తనిఖీలు నిర్వహించడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కీల క నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా 37 ఆ టోమేటెడ్ టె స్టింగ్ స్టేషన్ల (ATS) ఏర్పాటుకు రూ. 425.50 కోట్ల పరిపాలనా అనుమతులు మంజూ రు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.ఈ కేంద్రాలు అందు బాటులోకి వస్తే వాహనాల ఫిట్ నెస్ పరీక్షలు మరింత ఆధునిక విధానంలో నిర్వహించే అవకాశం ఉంటుం ది.
ఒక్కో కేంద్రానికి రూ.11.50 కోట్లు
వాహనాల ఫిట్నెస్ పరీక్షల్లో ఆధునిక సాంకేతికతకు ప్రాధా న్యతనిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. గతంలో ఒక్కో కేంద్రానికి రూ.8 కోట్ల చొప్పున మొ త్తం రూ.296 కోట్లకు అను మతులు ఇవ్వ గా, ప్రస్తు త అవస రాలకు అనుగుణంగా ఒక్కో కేంద్రం వ్య యాన్ని రూ.11.50 కోట్ల కు పెంచారు. దీంతో మొత్తం ప్రా జెక్టుకు రూ.425.50 కోట్ల నిధులు ఆమో దం పొందాయి.
రెండు దశల్లో నిర్మాణం
రాష్ట్రంలో మొత్తం 37 ఆటోమే టెడ్ టెస్టింగ్ స్టేషన్లను రెండు దశల్లో ఏర్పాటు చేయనున్నారు.తొలిదశలో 15 కేంద్రాల నిర్మా ణానికి రూ.172.50 కోట్లు కేటా యించారు. ఉమ్మడి జిల్లాల ప్రధాన కా ర్యాలయాల్లో ఒక్కొక్కటి చొప్పున, గ్రేటర్ హైదరా బాద్ మె ట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (HMDA) పరి ధిలో అదనంగా నాలుగు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నా రు. ఇక రెండో దశలో మిగిలిన 22 కేంద్రాలను నిర్మించను న్నా రు. ఇందుకోసం రూ.253 కోట్ల నిధులను ప్రభుత్వం ఆమోదిం చింది.
రుణాలతో నిధుల సమీకరణ
ఈ కేంద్రాల నిర్మాణం, నిర్వహణ కోసం రవాణా శాఖ పరిధిలో ప్ర త్యేక ప్రయోజన సంస్థ (స్పెషల్ పర్పస్ వెహికల్–SPV) ఏర్పాటు చేసేందుకు ప్ర భుత్వం అను మతిచ్చింది. ప్రాజెక్టుకు అవస రమై న నిధులను హడ్కో (HU DCO), ఇతర ఆర్థిక సం స్థల నుంచి రుణాల రూపంలో సమీకరించనున్నారు. వాహనా ల ఫిట్నెస్ పరీక్షల ద్వారా లభించే ద రఖాస్తు రుసుములు, వినియోగదారు ఛార్జీలను ప్రత్యేక నిధిలో జమ చేయను న్నా రు. ఈ నిధుల ద్వారా బ్యాంకు రుణాల అసలు, వడ్డీ చెల్లిం పులు చేపట్టేలా ప్రణాళిక రూపొందించారు.
పారదర్శకతకు పెద్దపీట
ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్ల ఏర్పాటుతో వాహనాల ఫిట్నెస్ పరీక్షలను సాంకేతిక పరిజ్ఞానం ఆ ధారం గా నిర్వహించేందుకు మార్గం సుగమం కానుంది. మానవ జోక్యం తగ్గించడం ద్వారా పరీక్షల్లో పార దర్శకతను పెంచడంతో పాటు, వాహనాల రహ దా విరి భద్ర తకు మరింత ప్రాధాన్యత కల్పించే అవ కాశం ఉం ది. అయితే ఈ కేంద్రాల ప్రారంభం, ప్రాంతాలవారీగా పూర్తి వివ రాలు వెల్లడైన తర్వాతే వాహనదారులకు అందుబాటులోకి వ చ్చే సేవలపై స్పష్టత రానుంది.

