–-లబ్ధిదారు కుటుంబంలో వెల్లి విరిసిన ఆనందం
— పేదల సొంతింటి కలసాకారమే ప్రభుత్వ లక్ష్యమన్న ఆర్టిఏ మెంబర్ రాజిరెడ్డి
Indiramma Housewarming Ceremony in Nalgonda district : ప్రజా దీవెన, కనగల్: పేద కుటుం బాలకు సొంతింటి కలను సాకా రం చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం అమలు చేస్తు న్న ఇందిరమ్మ ఇళ్ల పథకం మరో కుటుంబంలో ఆనందాన్ని నిం పింది. ఇస్లాంనగర్ గ్రామపంచాయతీ పరిధిలోని కన్నెబాయి తండాలో ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిర మ్మ ఇంటిలో ర జిత కుటుంబ సభ్యులు నూతన గృహప్రవేశం ని ర్వహించా రు. ఈ సందర్భంగా కుటుంబసభ్యులు ఆనందోత్సాహాల మ ధ్య వేడుకను ఘనంగా జరుపుకున్నారు.
రజిత కుటుంబం నూతన గృ హంలోకి అడుగుపెట్టిన సంద ర్భంగా ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామ పెద్ద లు, యువజన నాయకులు పాల్గొని కుటుంబ సభ్యులకు శు భాకాం క్షలు తెలిపారు. ప్రభుత్వ సంక్షే మ పథకాలతో పేద, మ ధ్యతరగ తి కుటుంబాలకు సొంతింటి కల నెరవేరడం సంతో షకరమని వారు పేర్కొన్నారు.
ప్రతి పేద కుటుంబానికి సొంతింటి భరోసా
ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా అ ర్హులైన పేద కుటుంబాలకు సొం తింటి కలను నిజం చేసే దిశగా ప్ర భుత్వం కృషి చేస్తోం ద ని ఈ సందర్భంగా నాయకులు పేర్కొన్నారు. సొంతింటిలో నివసించాలనే చిరకాల ఆకాంక్ష నెరవేరడం కుటుంబాలకు భద్రతతో పాటు ఆత్మవిశ్వాసాన్ని అందిస్తుందని తెలిపారు.ఈ గృహప్రవేశ కార్యక్రమంలో న ల్గొండ ఆర్టీఏ మెంబర్ కూసు కుం ట్ల రాజిరెడ్డి, కనగల్ మాజీ ఎంపీ పీ కరీం, ఇస్లాంనగర్ సర్పంచ్ జా నయ్య, గ్రామశాఖ అధ్యక్షుడు స లీం, కనగల్ మండల మై నారిటీ అధ్యక్షుడు షబ్బీర్, ఇస్లాంనగర్ గ్రామ కాంగ్రెస్ పెద్ద ఖా దర్, మా ర్కెట్ మాజీ సభ్యులు శ్రీను, సునీల్, నవీన్, గ్రామపం చాయతీ కార్యదర్శి నర్సిరెడ్డి, వార్డు మెంబర్ నజీర్, యూత్ అ ధ్యక్షుడు సలీం, యూత్ ఉపాధ్యక్షుడు ఉమర్ తదితరులు పా ల్గొన్నారు.
Indiramma Housewarming Ceremony in Nalgonda district
