Nalgonda Tragedy road accident : ప్రజా దీవెన, నల్ల గొండ క్రైమ్:ప్రజల సమస్యల పరిష్కారం, గ్రామాభివృద్ధి ధ్యే యంగా నిరంతరం సేవ లందించే ఒక ప్రభుత్వ ఉద్యోగి ప్ర యాణం అర్థాంతరంగా ముగిసింది. నల్గొండ జిల్లా నిడమనూ రు మండలంలో ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించే శనివారం చో టుచేసుకున్న ఘోర రోడ్డు ప్ర మాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చిం ది.పుల్లెంల గ్రామ పంచాయతీ కా ర్యదర్శిగా విధులు నిర్వర్తిస్తు న్న ఈయన చిన్నా రెడ్డిగూడెం వాసి గా గుర్తించారు. స్థానిక మెడికల్ కాలేజీ సమీపంలో జరిగిన ప్రమాదంలో అక్కడి క క్కడే ప్రాణాలు కో ల్పోయారు.
నిత్యం పల్లెబాట పట్టి ప్రజలకు చేరువగా ఉండే బా ధ్యతాయు తమైన అధికారి ఇలా రోడ్డు ప్రమాదా నికి బలవ్వడంతో స్థాని కంగా, తోటి ఉద్యోగుల్లో తీ వ్ర దిగ్భ్రాంతి వ్యక్త మవుతోంది. ప్ర మాద తీవ్రత కా రణంగా సంఘటనా స్థలంలో వివరాల సేకర ణ సవాలుగా మారింది. మృతుడి కుటుంబసభ్యులకు సమా చారం చేరవేయడంలో తీవ్రజాప్యం జరుగుతుండటంతో అధి కారులు, స్థానికులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

బాధిత కుటుంబానికి అండగా నిలవండి
ఈ ప్రమాదానికి గురైన పంచాయతీ కార్యదర్శి కుటుంబ స భ్యులు లేదా బంధువుల జాడ తెలిసిన వారు వెంటనే పోలీ సులకు గానీ, సంబంధిత అధికారులకు గానీ సమాచారం అం దించి సహ కరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు.
