Praja Deveena
Newspaper Banner
Date of Publish : 17 October 2026, 1:14 pm Posted by : praja deveena

SBI Insurance one crore Cheque to Policeman’s Family : ప్రమాదంలో మృతి చెందిన పోలీసు కుటుంబానికి ఎస్‌బీఐ అండ, రూ.కోటి బీమా చెక్ అందజేత

 

SBI Insurance one crore Cheque to Policeman’s Family : ప్రజా దీవెన, మిర్యాలగూడ టౌన్: విధినిర్వహణ అ నంతరం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన నల్గొండ జి ల్లా పోలీసు ఉద్యోగి షేక్ తయ్యుబ్ కుటుంబానికి స్టేట్ బ్యాం క్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) రూ.కోటి బీమా పరిహారాన్ని అం దించింది. శాలరీ ప్యాకేజ్ ఖాతాదారులకు ప్రమాద బీమా ద్వా రా కుటుంబాలకు ఆర్థిక భరోసా లభిస్తుందని ఎస్‌బీఐ చీఫ్ జ నరల్ మేనేజర్ నీళేష్ ద్వివేది తెలిపారు.నల్గొండలో 2026 ఫి బ్రవరి 13న మున్సిపల్ ఎన్నికల ఓట్లలెక్కింపు విధులు ము గించుకుని మోటార్ సైకిల్‌పై వెళ్తున్న షేక్ తయ్యుబ్ చంద నప ల్లి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఆ యనకు ఎస్‌బీఐ నకిరేకల్ శాఖలో పోలీస్ శాలరీ ప్యాకేజ్ ఖా తా ఉండటంతో, ఆ పథకం కింద అందాల్సిన బీమా పరి హా రాన్ని కుటుంబానికి అందజేశారు.

మిర్యాలగూడ పట్టణంలోని వైష్ణ వి గార్డెన్స్‌లో శుక్రవారం ఎస్‌ బీఐ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్య క్రమంలో దివంగత షేక్ తయ్యు బ్ తండ్రి షేక్ యూసుఫ్ అలీకి రూ.కోటి బీమా చెక్కు ను చీఫ్ జనరల్ మేనేజర్ నీళేష్ ద్వివేది అందజేశారు.ఈ సం దర్భంగా ఆ యన మాట్లాడుతూ సమాజ రక్షణ కోసం నిరం త రం సేవలందించే పోలీసు సిబ్బందికి, వారి కుటుంబాలకు ఆ ర్థిక భద్రత కల్పించడంలో పోలీస్ శాలరీ ప్యాకేజ్ కీలకంగా ని లుస్తుందని పేర్కొన్నారు. ప్రమాదవశాత్తు ఉద్యోగి మర ణించి న సమయంలో బీమా పరిహారం కుటుంబానికి ఆర్థికంగా అం డగా నిలుస్తుందని తెలిపారు. ఇలాంటి ప్రయోజనాలు ఆపద సమయంలో బాధిత కుటుంబాలకు ఎంతో తోడ్పాటు నంది స్తాయని వివరించారు.ఈ కార్యక్ర మoలో ఎస్‌బీఐ జనరల్ మే నే జర్ సతీష్ కుమార్, డిప్యూటీ జనరల్ మేనేజర్ ప్రియబ్రత మిశ్రా, రీ జినల్ మేనేజర్ పద్మ బాబు, ఏ జీఎం నితిన్ ఎం., చీ ఫ్ మేనేజర్ మధు బల్లా తదితరులు పాల్గొన్నారు.