Praja Deveena
Newspaper Banner
Date of Publish : 19 October 2026, 4:42 pm Posted by : praja deveena

Nalgonda district collector Chandra Shekhar : నల్లగొండ కలెక్టర్ చంద్రశేఖర్ కీలక ఆదేశం, ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు 300 రోజుల కార్యాచరణ

 

Nalgonda district collector Chandra Shekhar :  ప్రజా దీవెన, నల్లగొండ: ఎల్‌నినో నేపథ్యంలో రానున్న 300 రోజులు అత్యంత కీలకమని, తాగు, సా గునీరు, విద్యుత్ సమస్యలు త లెత్తకుండా అన్ని శాఖల అధి కారులు ముందస్తు కార్యాచ రణ ప్ర ణాళిక రూపొందించాలని జిల్లా కలెక్టర్ బి. చంద్ర శే ఖర్ ఆదేశించారు. ప్రతి నీటి చుక్కను పొదుపుగా వినియోగించు కోవాలని, ము ఖ్యంగా డిసెంబర్, జ నవరి నెల ల్లో తాగునీటి కొరత ఏర్పడకుండా ఇప్ప టి నుండే అవసరమైన చర్యలు చేపట్టాలని అన్నారు.

ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం ఆ యన కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కా ర్యక్రమంలో ప్రజల నుండి దరఖాస్తులు స్వీక రించిన అనంతరం అధి కారులతో కలెక్టర్ సమీక్షించారు. గ్రామాలు, మున్సి పల్ ప ట్టణ ప్రాంతాలలో తాగునీటికి ఇ బ్బంది రాకుండా వచ్చే ఆగస్టు వరకు నీటి సరఫరాకు ఇబ్బం దులు లేకుండా ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. గ్రా మ పంచాయతీల్లో నీటి వనరులకు సంబంధించిన రిజిస్టర్లను నిర్వహించాలని, నీటి స రఫరా వ్యవ స్థలో లీకేజీలను అరి కట్టాలని, పాడైన పైపులు, ట్యాంకులకు వెంటనే మరమ్మతులు చేప ట్టాలని తెలిపారు.

పబ్లిక్ హెల్త్ శాఖ, మిషన్ భగీర థ, అమృత్ పథకం అధికారుల తో సమన్వయం చేసుకొని నీటి సర ఫరా ప్రణాళికను సిద్ధం చేయాలని చెప్పారు.పట్టణ ప్రాంతాల్లోనూ నీటిని పొదుపుగా వినియోగించే వి ధానాలను అమలు చేయాలన్నారు. వాహ నాలను పై పులతో కడగకుండా బకెట్ నీటితో శుభ్రం చేసు కునేలా ప్రజలకు అవగాహన కల్పించాలని, దుకాణాలు, వా హనాల శుభ్రత కేంద్రా ల్లోనూ నీటి వృథాను నివారించాలని ఆదేశించారు. నీటిని వృథా చేస్తే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని, నీ టి కొరతపై ప్రజలకు అవగాహన కల్పించాల న్నా రు. ఎల్‌నినో ప్రభావం వల్ల వ్యవసాయ రంగానికి ఇబ్బం దులు కలగకుండా వ్యవసాయ అధికారులు రైతులకు ముం దస్తు సూచనలు చేయాలని కలెక్టర్ తెలిపారు.

యాసంగిలో వరి సాగు చేయకుండా, తక్కువ నీటి తో పండే వేరు శనగ, జొన్నలు, మినుములు, కందులు వంటి ప్రత్యా మ్నాయ పంటల సాగుపై రైతుల కు అవ గాహన కల్పించాలని ఆదేశించా రు. 90 రోజుల్లో పండే పంటలపై రైతులకు వివ రిం చాలని, పండిం చిన పంటలకు సరైన మార్కెటింగ్ సదు పా యాలు కల్పించేలా చ ర్యలు తీసుకోవాలని చెప్పారు. జిల్లా లోని పాఠశాలలు, వసతి గృహాలు, అంగ న్‌వాడీ కేంద్రాలు, పల్లె దవాఖానాల్లో ప్రస్తుతం ఉన్న నీటి నిల్వలను తక్షణమే గు ర్తించాలని కలెక్టర్ ఆదే శించారు. ఎక్కడైనా నీటి కొరత ఉంటే భూగర్భ జ లవనరులు, మిషన్ భగీరథ ద్వారా ప్రత్యామ్నా య ఏర్పాట్లు చేసి పిల్లలు, విద్యార్థులు, రోగులకు ఎ లాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు.

గ్రామాల్లో పశువులు, అటవి జం తువులకు తాగునీటి కొరత ఏర్ప డకుండా నీటి లభ్యత ఉన్న ప్రాం తాలను గుర్తించి అవస రమైన ఏ ర్పాట్లు చేయాలని, నీరు అందక జంతువులు మృ త్యువాత పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు.పీఎం సూర్య ఘర్ పథ కం కింద ఇళ్లపై సోలార్ విద్యుత్ వ్యవస్థలను ఏర్పాటు చేసుకునే లా ప్రజలకు అవగాహన కల్పించాలని గ్రా మపంచాయతీలు, మున్సిపాలిటీల్లో సమావేశాలు నిర్వహించి ప్రభుత్వ పథకాలపై వివరించాలని, సోలార్ పంపు సెట్ల విని యోగాన్ని ప్రోత్సహించా లని అన్నారు. కలెక్టరేట్ క్యాంపు కా ర్యాలయంలోనూ సోలార్ వ్య వస్థ ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదే శించారు. రెవెన్యూ అద నపు కలెక్టర్ జె. శ్రీనివాస్, స్థానిక సంస్థల ఇంచార్జ్ అదనపు కలెక్టర్ ప్రేమ్ కరణ్ రెడ్డి,జిల్లా గ్రామీణ అభి వృద్ధి అధికారి టి. శేఖర్ రెడ్డి , జిల్లా అధికారులు ప్రజల వద్ద నుండి ఫిర్యాదు లను స్వీకరించారు. కాగా ఈ సోమవారం రెవిన్యూ శాఖకు (21) ఫిర్యాదులు, ఇతర శాఖలకు(28) ఫిర్యాదులు మొ త్తం (49) ఫిర్యాదులు వచ్చాయి.

   జిల్లా రైతులకు విస్తృతంగా బ్యాంకింగ్ సేవలు 

నల్లగొండ: ఎల్‌నినో నేపథ్యంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా రైతు ల కు విస్తృతంగా బ్యాంకింగ్ సేవలు అం దించాలని జిల్లా కలె క్టర్,నల్లగొండ జిల్లా కేంద్ర స హకార బ్యాంకు (ఎన్‌డీ సీసీబీ) అ ధికారిక పర్సన్ ఇన్‌చార్జి బి. చంద్ర శేఖర్ అన్నారు. వసూలు కానీ మొండి బకాయిలను (ఎన్ పి ఏ) తగ్గించేందుకు బ్రాంచ్ మేనేజర్లు కృషి చేయాలని చెప్పారు. సోమవారం ఆయన క్లాక్ టవర్ సమీ పంలో ఉన్న డి సి సి బ్యాంకు ప్రధాన కార్యాలయం లో నిర్వహించిన బ్రాంచ్ మేనేజర్ల సమావేశంలో రైతులకు రు ణాల మంజూరులో ఎలాంటి అలసత్వం వహించకూడదని, ప్ర తి బ్రాంచ్‌లో డిపాజిట్ల సేకరణను పెంచిరూ. 100 కోట్ల లక్ష్యా న్ని చేరుకునేలా చర్యలు తీసుకో వాలని ఆదేశించారు. రైతుల అవసరాలకు అను గుణంగా రుణసదుపాయాలు కల్పిస్తూ బ్యాంకు పనితీరును మెరుగుపరచాలని అన్నారు.

స్వయం సహాయక మహిళా సం ఘాలకు చిన్న చిన్న రుణాలు ఇ వ్వడం వల్ల ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేసుకుం టారని, వారు ఇబ్బందుల్లో ఉన్న ప్పుడు వ్యాపారాలు, ఆర్థిక కా ర్యకలాపాల నిర్వహణకు రు ణాలు ఇచ్చి ఆదుకుంటే బ్యాంకు పై వారికి నమ్మకం కలుగుతుంద న్నారు.బ్యాంకు సీఈఓ శంకర్రా వు,జాయింట్ రిజిస్ట్రార్ మైఖేల్ బోస్, జనరల్ మేనేజర్ నర్మద, మార్కెటింగ్ ఎడి ఛాయాదేవి బ్యాంకు సీనియర్ అధికారులు, బ్రాంచ్ మేనేజర్లు హాజరయ్యారు.

పకడ్బందీగా కంప్యూటర్ ఆధారిత నియామక పరీక్షలు

నల్లగొండ: తెలంగాణ పబ్లిక్ సర్వీ స్ కమిషన్ ఆధ్వ ర్యంలో ఈ నెల 24, 26 తేదీలలో నిర్వహించనున్న టీజీపీఎస్సీ అసిస్టెంట్ సైంటి స్ట్( అనలిస్ట్ గ్రేడ్ -2), మరియు అసిస్టెంట్ ఎన్విరాన్‌ మెంటల్ ఇంజనీర్ కంప్యూటర్ ఆధారిత నియామక పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ అ న్నారు. ఇందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని ఆ యన సంబంధిత అధికా రులను ఆదేశించారు. సో మవారం టిజిపిఎస్ సి చైర్మన్ , విశ్రాంత ఐఏఎస్ అధికారి బుర్ర వెంకటే శం హైదరాబాద్ నుండి టీజీపీఎస్సీ అసిస్టెంట్ సైంటిస్ట్ (అనలి స్ట్ గ్రేడ్ -2), మరియు అసిస్టెంట్ ఎన్వి రాన్‌ మెంటల్ ఇం జనీర్ కంప్యూటర్ ఆధారిత నియామక పరీక్షల ఏర్పాట్లపై వీడి యో కాన్ఫరెన్స్ నిర్వ హించారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జి ల్లా కలెక్టర్ పై పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై జిల్లా అధి కారుల తో సమీక్షించారు.

టిజీపీఎస్సీ ఆధ్వర్యంలో నిర్వ హించనున్న అసి స్టెంట్ సైంటి స్ట్( అనలిస్ట్ గ్రేడ్ -2), మరియు అసి స్టెంట్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీర్ కంప్యూటర్ ఆ ధారిత నియామక పరీక్షకు నల్గొండ పట్టణంలోని నేతాజీ నగర్ (రామ గిరి)లో ఉన్న ఎస్పీఆర్ పాఠ శాలలో పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.ఈ నెల 24 న నిర్వహించనున్న అసిస్టెం ట్ సైంటిస్ట్( అనలిస్ట్ గ్రేడ్ -2) పరీ క్షకు (185) మం ది అభ్యర్థులు, 26 న నిర్వహించనున్న అసిస్టెంట్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీర్ కంప్యూటర్ ఆధారిత పరీక్షకు (180) మంది అభ్యర్థులు హా జరుకా ను న్నారని తెలిపారు. ఈ పరీక్షలు ఉదయం 10 గంట ల నుండి మధ్యాహ్నం 12.30 గం టల వరకు, మ ధ్యాహ్నం 2.30 గంటల నుండి సాయంత్రం 5 గం టల వరకు రెండు పూటలు ఉంటాయని తెలిపా రు.

అభ్యర్థులు పరీక్ష ప్రారంభానికి 1 గంట ముందుగానే పరీక్ష కేంద్రా నికి చేరుకోవాలని, పరీక్ష ప్రా రం భానికి 30 నిమిషాల ముందే గే ట్లు మూసి వేయడం జరుగుతుం దని స్పష్టం చేశారు.పై పరీక్షల ని ర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయా లని, ఇందులో భాగంగా పరీక్ష కేంద్రం లోపల, వెలుపల తగినం త బందోబస్తు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్పీని కోరా రు. పరీక్షలు నిర్వహించే రోజున టిఎస్ ఆర్ టిసి తగినన్ని బ స్సులు నడపాలని ఆర్టీసీ అధి కారులను ఆదేశిం చారు.పరీక్ష రో జున పరీక్ష కేంద్రం వద్ద,లోపల నిరంతర విద్యు త్ సరఫరా ఉం డేలా చర్యలు తీసుకోవాలని విద్యుత్ అధి కారులను ఆదే శించారు. కాగా అభ్యర్థులకు తాగునీరు, పరీక్షా కేంద్రంలో పరి శుభ్రత ఏర్పాటు చేయాలని నల్గొండ మున్సి పల్ కార్పొరేషన్ కమి షనర్ ను ఆదే శించారు.

అత్యవసర మందులతో పరీక్ష కేంద్రంలో వైద్య శిబిరం ఏర్పా టు చేయాలని జిల్లా వైద్య ఆరో గ్య శాఖ అధి కారిని ఆదేశిం చారు. పరీక్షలు సవ్యంగా నిర్వ హించేందుకు ఫ్లయింగ్ స్క్వాడ్ ను ఏ ర్పాటు చేసి, పోలీసు బందోబస్తు కల్పించాలని, పరీక్ష లకు ఎ లాంటి అం తరాయం కలగకుండా పరి సర ప్రాంతాల్లో తగిన బందో బస్తు చర్యలు తీసు కో వాలని తెలిపారు. అభ్య ర్థులకు ఎలాంటి ఇబ్బం దులు కలగకుండా అన్ని ఏర్పాట్లు ముందుగానే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆ దేశించారు. రెవెన్యూ అదనపు కలెక్టర్ జే. శ్రీనివాస్, స్థానిక సం స్థల ఇం చార్జ్ అదనపు కలెక్టర్ ప్రేమ్ కరణ్ రెడ్డి, ఆర్డిఓ వై .అశో క్ రెడ్డి, జిల్లా అధికారులు ఉన్నారు.