Praja Deveena
Newspaper Banner
Date of Publish : 21 October 2026, 3:18 pm Posted by : praja deveena

Surge in liquor sales in Telangana during Dasara : బిగ్ బ్రేకింగ్, దసరావేళ తెలంగాణలో మద్యంఅమ్మకాల జోరు, నాలుగు రోజుల్లోనే రూ.755 కోట్ల విక్రయాలు, గతేడాది రికార్డుబద్దలు

 

Surge in liquor sales in Telangana during Dasara : ప్రజా దీవెన, హైదరాబాద్: దసరా పండుగ వేళ తెలంగాణలో మద్యం అమ్మకాలు కొత్త రికార్డులు సృష్టించాయి. పండుగకు ముందు నాలుగు పనిదినాల్లోనే రాష్ట్రవ్యాప్తంగా ఏకంగా రూ. 75 5.14 కోట్ల విలువైన మద్యం విక్ర యాలు నమోదయ్యా యి. గత ఏడాది ఇదే పండుగ సమయంలో నాలుగు రో జుల్లో జరిగిన రూ.698 కోట్ల అమ్మకాలతో పోలిస్తే ఈసారి విక్రయా లు గణనీయంగా పెరిగాయి. ఎక్సై జ్ శాఖ గణాంకాలు పండు గ సీజన్‌లో మద్యం వ్యాపారం ఏ స్థాయిలో సాగిందో వెల్లడిస్తు న్నాయి.

ఒక్కరోజులోనే రూ.303 కోట్ల అమ్మకాలు

దసరాకు ముందు రోజు అయిన అక్టోబర్ 19న మ ద్యం విక్రయాలు పతాక స్థాయికి చేరుకున్నాయి. ఒ క్కరోజులోనే రూ.303. 40 కోట్ల విలువైన మద్యం అ మ్ముడైంది. అంతకుముందు అ క్టోబర్ 14న రూ.102.17 కోట్లు, అక్టోబర్ 16న రూ.126.32 కో ట్లు, అక్టోబర్ 17న రూ.223.25 కోట్ల విక్రయాలు న మోదయ్యా యి. అక్టోబర్ 15న డిపోలకు సెలవు ఉండటంతో ఆరోజు అమ్మకాల లెక్కలు నమోదు కాలేదు. ఈ నాలుగు పనిదినాల విక్రయాలు కలిపి రూ.755.14 కోట్లకు చేరాయి.

      బీరుకు భారీ డిమాండ్

పండుగ వేళ మద్యం విక్రయాల్లో బీరు వినియోగం ముందంజ లో నిలిచింది. నాలుగు రోజుల్లో 10. 44 లక్షల కేసుల బీరు, 6.83 లక్ష ల కేసుల హార్డ్ లిక్కర్ అమ్ముడైన ట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. రా ష్ట్రవ్యాప్తంగా వైన్‌షా పు లు, బార్లు, రెస్టా రెంట్లు, ప బ్బులు, క్లబ్బుల ద్వారా ఈ విక్రయాలు జరిగాయి.

అక్టోబర్‌లోనూ ఆదాయానికి ఊతం

అక్టోబర్ 19 నాటికి నెల మొత్తం మద్యం విక్రయాల విలువ రూ.2, 055 కోట్లకు చేరింది. సెప్టెంబర్‌ లో రూ.3,209 కోట్లు, ఆగస్టులో రూ.3,482 కోట్ల విలు వైన మద్యం విక్రయాలు న మోదయ్యాయి. దసరా పండుగ నేపథ్యంలో అక్టోబర్ నెల అ మ్మకాలు మ రింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

 ప్రభుత్వ ఆదాయంలో కీలకవాటా

తెలంగాణలోని 2,620 వైన్‌షా పులు, సుమారు 1,200 బార్లు, రెస్టారెంట్లు తదితర విక్రయ కేం ద్రా లకు 17 మద్యం డిపోల నుంచి సరఫరాలు జరు గుతున్నాయి. మద్యం విక్రయాల ద్వారా వచ్చే ఆ దాయం రాష్ట్ర ప్రభుత్వా నికి ప్రధాన ఆదాయ వన రుల్లో ఒకటిగా ఉంది. పండుగ సీజన్‌లో నమోదైన భారీ విక్రయాలు ఎక్సైజ్ శాఖ ఆదాయానికి గణనీ యమైన ఊతమిచ్చాయి. మొత్తంగా దసరా సంబ రాల వేళ తెలంగాణలో మద్యం వ్యాపారం జో రం దుకోగా, గత ఏడాది విక్రయాలను అధిగమించడం ఈసారి ప్రత్యేకతగా నిలిచిందని చెప్పవచ్చు.