–రావికంపాడు జంక్షన్ వద్ద భవానీలపైకి దూసు కెళ్లిన వాహనం
kakinada tragedy road accident : ప్రజా దీవెన, కాకి నా డ: కత్తిపూడి హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. రావికంపాడు జంక్షన్ సమీపంలో నడుచుకుంటూ వెళ్తున్న భవానీలపైకి స్కార్పియో వాహనం ఒక్కసారిగా దూ సుకెళ్లింది. ఈ ప్రమాదంలో నలుగురు భవానీ లు అక్కడికక్కడే మృతిచెందినట్లు సమాచారం. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
ఊహించని ఈ ఘటనతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అ లుముకున్నాయి. ప్రమాదంలో గాయ పడిన వారిని చికిత్స ని మిత్తం ఆసుపత్రికి తరలిం చినట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
kakinada tragedy road accident
