–గ్రామసభల్లో భూ సర్వే వివరా లతో పారదర్శక పరిష్కారం
–బంజరుభూముల్లో మహిళా సంఘాలతో సోలార్ ప్లాంట్లు
Nalgonda collector Chandra Shekhar : ప్రజా దీవెన దేవరకొండ: రైతుల భూసమస్యల పరి ష్కారంలో జాప్యం లే కుండా క్షేత్రస్థాయిలోనే ప రిశీ లనలు జరిపి, రైతులతో నేరుగా మాట్లాడి సమ స్యలకు పరి ష్కారం చూపాలని నల్గొండ జిల్లా కలె క్టర్ బి. చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. భూ సర్వే వి వరాలను ప్రజలకు అందుబాటులో ఉంచడంతో పాటు, గ్రా మసభల్లో చదివి వినిపించాలని స్పష్టం చేశారు. ఎల్‌నినో ప్రభా వం నేపథ్యంలో నీటి వినియోగంలో జాగ్రత్తలు పాటించాలని, బం జరు భూములను సద్వినియోగం చేసుకొని మహిళా సం ఘాలు సోలార్ విద్యుత్ ఉత్పత్తి ద్వారా ఆదాయం పొందే అ వకాశాలను పరిశీలించాలని సూచించారు.
తెల్లవారుజామునే క్షేత్రస్థాయి పరిశీలన
దేవరకొండ నియోజకవర్గంలోని చందంపేట మండ లం పొగిళ్ల, కం బాలపల్లి గ్రామాల్లో శుక్రవారం కలెక్టర్ పర్యటించి, భూస ర్వే నిర్వహించిన ప్రాంతాలను పరిశీ లించారు. సూర్యోదయా నికి ముందే గ్రామాలకు చేరుకున్న ఆయన రైతులతో ముఖా ముఖి మాట్లాడి భూముల విస్తీర్ణం, సర్వే వివరాలు, రెవెన్యూ రికార్డులు, పట్టాదారు పాసుపుస్తకాలు, రైతుల అభ్యంతరాల పై వివరాలు సేకరించారు.పొగిళ్ల గ్రామంలోని సర్వే నంబర్ 2 లో మొత్తం 1,066 ఎక రాల భూమిని సర్వే చేసినట్లు అధికా రులు కలెక్టర్ కు వివరించారు. వాస్తవసాగు భూములు, అసైన్డ్ భూములు, భూములపై హక్కులు కలిగిన రైతుల వివరాలను ఆయన పరిశీలించారు. సర్వేకు సం బంధించిన స మాచారా న్ని గ్రామంలో ప్రదర్శించడంతో పాటు, అవసరమైతే గ్రామసభ ల్లో చదివి వినిపించాలని ఆదేశించారు.
30 అభ్యంతరాలపై సమగ్ర విచారణ
పొగిళ్ల గ్రామంలో భూ సర్వేకు సంబంధించి ఇప్పటి వరకు 30 అభ్యంతరాలు వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఈ అభ్యం తరాలను క్షుణ్ణంగా పరిశీలించి, పరిష్కారానికి తీసుకున్న చర్యలను స్పష్టంగా వివరించాలని కలెక్టర్ సూచించారు. భూ ముల రికార్డులు, పట్టాదారు పాసుపుస్తకాలు, పహాణీ వి వరా లు, క్షేత్రస్థాయిలో ఉన్న భూమి విస్తీర్ణాన్ని పర స్పరం సరిపోల్చి పరిశీలించాలని ఆదేశించారు. భూములపై హక్కులు కోరుతు న్న రైతులు తమకు సం బంధించిన ధ్రువపత్రాలను సమ ర్పిం చాలని సూచించారు. అసైన్డ్ భూముల చట్టవిరుద్ధ విక్ర యా లు కొనుగోళ్లు చేయకూడదని స్పష్టం చేశారు. సర్వే ప్రక్రియలో పూర్తి పారదర్శకత పాటిస్తూ, రైతు లకు వాస్తవ వివరాలు తెలి యజేసిన అనంతరం అభ్యంతరాలపై నిర్ణయం తీసుకోవాలని అధికా రులకు దిశానిర్దేశం చేశారు.
రైతులతో చర్చల ద్వారానే పరిష్కారం
కంబాలపల్లి రైతు వేదికలో రైతులతో సమావేశమై న కలెక్టర్ సర్వే నంబర్ల వారీగా భూ సర్వే పురోగతిని సమీక్షించారు. స ర్వే నంబర్లు 37, 50లకు సంబంధించిన వివరాలను పరిశీలిం చి, పూర్తయిన సర్వే సమాచారాన్ని గ్రామ సభల్లో ప్రజలకు అం దుబాటులో ఉంచాలని సూచించారు.సర్వే రికార్డుల్లో ని వివ రాలు, పహాణీలో నమోదైన పేర్లు, వాస్తవంగా భూ ములను సా గు చేస్తున్న రైతుల వివరా లను సరిపోల్చాలని ఆదేశించారు. భూముల విస్తీర్ణంలో తేడాలు ఉన్నా, రికార్డుల్లో వ్యత్యాసాలు కని పించినా సంబంధి త రైతులు, అధికారులు కలిసి చ ర్చిం చుకోవాలని సూచించారు. అన్నదమ్ములు, ఇతర భూహక్కు దారుల మధ్య తలెత్తే వివాదా ల ను పరస్పర చర్చల ద్వారా పరి ష్కరించుకోవాలని తెలిపారు. సర్వే పనులను వేగవంతం గా పూర్తి చేసి, అన్ని వివరాలు సక్ర మంగా ఉన్న అర్హులైన రై తులకు నిబంధనల ప్రకారం పట్టాదారు పాసుపుస్తకాలు అం దేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఎల్‌నినో నేపథ్యంలో నీటిపొదుపే కీలకం
వాతావరణ మార్పులు, ఎల్‌నినో ప్రభావంతో వర్షపాతంలో మార్పులు సంభవించే అవకాశం ఉన్నందున రైతులు అప్రమ త్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు. భూగర్భ జలాల లభ్య తను దృష్టిలో పెట్టుకొని పంటలకు అవసరమైన మేరకే నీటిని వి నియోగించా లని, ప్రతి నీటి చుక్కను పొదుపు చేయాలని కోరారు.నీటి లభ్యతకు అనుగుణంగా తక్కువ నీటి తో సాగు చేయగల పంటలు, కూర గా యల సాగుపై దృష్టి సారించాలని సూచించారు. ప శుసం పదను సంరక్షించుకుంటూ, అందుబా టులో ఉన్న వనరులను స మర్థవంతంగా వినియోగించు కోవ డం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకా శాలను పెంచు కోవచ్చని తెలిపారు.
సంఘాలకు సోలార్ ఆదాయ అవకాశాలు
గ్రామాల్లోని బంజరు భూములను వినియోగించు కొని మహి ళా సంఘాలు సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకునే అవకాశాల ను పరి శీలించాలని కలెక్టర్ సూచించారు. సౌర విద్యుత్‌ను ఉ త్పత్తి చేసి విక్ర యించడం ద్వారా మహి ళా సంఘాలు ఆదా యం పెంచు కొని ఆర్థికంగా బలోపేతం కావచ్చని తెలి పారు. అలాగే పశువుల పేడతో గోబర్ గ్యాస్ తయారీని ప్రోత్స హిం చాలని, తద్వారా ఇంధన అవ సరాలను తీర్చుకోవడంతో పా టు స్థానిక వనరుల ను సద్వినియోగం చేసుకోవచ్చని పేర్కొ న్నారు. గ్రా మీణ కుటుంబాలు అనవసర ఖర్చులను తగ్గించు కొని పొదుపు అలవాటును పెంపొందించు కోవాల ని కలెక్టర్ పిలు పునిచ్చారు.ఈ పర్యటనలో రెవె న్యూ అదనపు కలెక్టర్ జే. శ్రీనివా స్, దేవరకొండ స బ్ కలెక్టర్ కరోలి యన్ చింగ్ థి యాన్ మావి, ల్యాం డ్ సర్వే ఏడీ దేవరాజ్, తహసీల్దార్ సత్య నారాయణ, పొగి ళ్ల సర్పంచ్ జటా జైహింద్ నాయక్, కం బాల పల్లి సర్పంచ్ గోవిం దు, మండల సర్వేయర్లు శ్రీనివాస్, హరీష్, రైతులు, గ్రామస్తులు పాల్గొన్నా రు.
Nalgonda collector Chandra Shekhar


