–నల్లగొండజిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్
Nalgonda SP Sharath Chandra : ప్రజా దీవెన నల్లగొండ క్రైమ్: పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగం గా నల్లగొం డ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా రక్తదాన కా ర్యక్రమాలు నిర్వహించగా, జిల్లా పోలీస్ కార్యాల యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ప్రారంభించారు. ఈ సం దర్భంగా ఎస్పీ మాట్లా డుతూ రక్తదానం అనేది ప్రాణదానంతో సమానమని, అత్య వ సర పరిస్థితుల్లో రక్తం అందక ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఎం తోమందిని రక్త దానం ద్వారా ప్రాణాలను కాపాడే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యత గా భావించి రక్తదానానికి ముందుకు రావాలని పిలుపునిచ్చా రు.
పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల ప్రధాన ఉద్దేశం దే శం కోసం, ప్రజల రక్షణ కోసం త మ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా విధులు నిర్వర్తించి అమరులైన వారి త్యాగాలు ప్రతి ఒక్క రికీ స్ఫూర్తిదాయకమని అన్నారు. వారి స్ఫూర్తితో ని ర్వహిస్తున్న రక్తదాన కార్యక్రమం ద్వారా ఆపదలో ఉన్నవారికి ప్రాణదానం చేయడం ఎంతో గొప్ప విషయమని పేర్కొన్నారు.
ఒకరు స్వచ్ఛందంగా ఇచ్చే రక్తం ప్రమాదాల్లో గాయపడిన వా రికి, శస్త్రచికిత్సలు చేయించుకునే రోగులకు, ప్రసవ సమయం లో అధిక రక్తస్రావంతో బాధపడే మహిళలకు, ఇతర అత్యవస ర వైద్య చికిత్సలు పొందుతున్న వారికి ఎంతో ఉపయోగపడు తుందని ఎస్పీ వివరించారు. రక్తానికి ప్రత్యా మ్నాయం లేదని, అవసరమైన సమయంలో సకాలంలో రక్తం అందించడం ద్వా రా విలువైన ప్రాణాలను కాపాడవచ్చని తెలిపారు. రక్తదానం చేయడం వల్ల స మాజానికి సేవ చేయడంతో పాటు మానవ త్వాన్ని చాటుకునే అవకాశం లభిస్తుందని అన్నారు.
యువత సామాజిక సేవా కార్యక్ర మాల్లో చురుకుగా పాల్గొనా లని, రక్తదానంపై ప్రజల్లో ఉన్న అపోహ లను తొలగించి మరిం త అవగాహన కల్పించాలని ఎస్పీ సూచించారు. ఆరోగ్యంగా ఉన్న అర్హులైన వ్యక్తులు వైద్యుల సూచనల మేరకు స్వచ్ఛం దంగా రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని కోరారు. రక్త దానం చేయడం వల్ల మరొకరి కుటుంబంలో ఆనందాన్ని నింప డంతో పాటు, ఆ కుటుంబానికి కొత్త ఆశను అందించిన వార మవుతామని తెలిపారు.
పోలీస్ అమరవీరుల స్ఫూర్తితో నిర్వహించిన ఈ కార్యక్రమం లో అధిక సంఖ్యలో పాల్గొని రక్తదా నం చేసేందుకు ముందుకు వచ్చి న అమ్మ ఫౌండేషన్ సభ్యులు, యువజన సంఘాల ప్రతి నిధులు, ఇతర యువతను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించా రు. స మాజ సేవ పట్ల యువత చూ పుతున్న ఆసక్తి అభినంద నీయమని, ఇలాంటి సేవా కార్యక్రమాలను భవిష్యత్తులోనూ కొనసాగించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రమేష్, ఎస్బీ డీఎస్పీ మల్లారెడ్డి, నల్లగొండ డీఎస్పీ కె. శివ రాం రెడ్డి, సీఐలు ఆదిరెడ్డి, నాగరాజు, శ్రీను నాయక్, మంజుల, ఆర్ఐలు సంతోష్, సూరపు నాయుడు, ఎస్ఐలు, పోలీస్ సి బ్బంది, అమ్మ ఫౌండేషన్ సభ్యులు, యువజన సంఘాల ప్రతి నిధులు, యువత తదితరులు పాల్గొన్నారు.
కుటుంబాలకు ఎల్లవేళలా అండదండ
నల్లగొండ: పోలీస్ అమరవీరుల కుటుంబాలకు పోలీసు శాఖ ఎ ల్లవేళలా అండగా నిలుస్తుందని నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ అన్నారు. పోలీ సు అమరవీరుల సంస్మ రణ వారోత్సవాల్లో భాగంగా 2 టౌన్ పోలీస్ స్టేషన్ ఏరియాలో శనివారం 1994 సంవత్సరంలో అడవిదే వులపల్లి పోలీస్ స్టే షన్లో విధులు నిర్వహిస్తూ నక్సలైట్ల దాడిలో అమరులైన ఎస్ఐ లక్ష్మయ్య కుటుంబ సభ్యులను జిల్లా ఎస్పీ వారి నివా సానికి వెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యు ల యోగక్షేమాలను అడిగి తెలుసుకొని, వారికి పోలీసు శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుం దని భరోసా ఇచ్చారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ విధి నిర్వహణలో ప్రజల రక్ష ణ కోసం, సమాజంలో శాంతిభద్ర తల పరిరక్షణ కోసం త మ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడి అమరులైన పోలీసు వీరుల త్యాగాలు వెలకట్టలేనివని అన్నారు. నల్లగొండ జిల్లా వ్యాప్తం గా విధి నిర్వహణలో సంఘవిద్రోహ శక్తులతో పో రాడుతూ 15 మంది పోలీసు సిబ్బంది అమరులయ్యారని గు ర్తుచేశారు. వారి త్యాగాల ఫలితంగానే నేడు పోలీసు అధికా రులు, సిబ్బంది ప్రశాంత వాతావరణంలో విధులు నిర్వహిస్తూ ప్రజలకు భద్రత క ల్పించగలుగుతున్నారని పేర్కొన్నారు. అ మరవీరుల కుటుంబ సభ్యులు ఏ సమస్య ఎదుర్కొన్నా పోలీ సు శాఖ దృష్టికి తీసుకురావాలని, వారికి అవసరమైన సహా యాన్ని అందించేందుకు కృషి చేస్తామని భరోసా ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ వెం ట అడిషనల్ ఎస్పీ రమేష్,న ల్గొండ డిఎస్పీ శివరాం రెడ్డి,ఎస్బీ సీఐ నాగరాజు, 2 టౌన్ సీఐ ఆ దిరెడ్ది,అడ్మిన్ ఆర్ఐ సంతోష్, 2 టౌన్ ఎస్. ఐ సైదాబాబు, అమరవీరుడు ఎస్ఐ లక్ష్మయ్య కుటుంబ సభ్యులు తదితరు లు పాల్గొన్నారు.


