—బియ్యం, కిరాణా, వంట నూనె దుకాణాలపై తనిఖీలు
–తూనికలు, కొలతల నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
Nalgonda legal metrology officers surprise Inspe ctions : ప్రజా దీవెన, నల్లగొండ టౌన్ : వినియోగదారులకు సరైన తూ కం అందించడంతో పాటు వ్యాపార లావాదేవీల్లో పారదర్శకతను పెంపొందించేందుకు నల్లగొండ పట్టణంలో లీ గల్ మెట్రాలజీ, పౌర సరఫరాల శాఖల అధికారులు సంయు క్తంగా తనిఖీలు నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు శనివారం బియ్యం దుకాణాలు, కిరాణా షాపులు, వంట నూ నెల విక్రయ కేంద్రాల్లో తనిఖీలు చేపట్టారు. నిబంధనల ఉల్లం ఘనలకు సంబం ధించి నాలుగు కేసులు నమోదు చేశారు. జి ల్లా లీగల్ మెట్రాలజీ అధికారి, జిల్లా పౌర సరఫరాల అధికారు లు, డీటీ సివిల్ సప్లైస్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు ఈ తనిఖీ ల్లో పాల్గొన్నారు.
దుకాణాల్లో వినియోగిస్తున్న తూనికల పరికరాల ధృవీకరణ, అధి కారిక ముద్రలు, తూనికలు కొల తలకు సంబంధించిన నిబంధన ల అమలును క్షుణ్ణంగా పరిశీలిం చారు.లీగల్ మె ట్రాలజీ చట్టం– 2009, సంబంధిత నిబంధనలను ఉల్లం ఘిం చిన వ్యాపార సం స్థలపై అధికారులు కేసులు నమోదు చేశా రు. వ్యాపారులు ధృ వీకరణ పొంది, అధికారిక ముద్రలు కలి గిన తూనికల పరికరాలనే వినియోగించాలని స్పష్టం చేశారు. వినియోగదారులకు సరైన తూకం అందించడంతో పాటు చట్ట నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు.
తూనికలు, కొలతల్లో అక్రమాల కు పాల్పడే వారిపై చట్టప్రకా రం కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించా రు. విని యోగదారులు తక్కువ తూకం, తప్పుడు కొలతలు లే దా ఇతర ఉల్లంఘనలను గుర్తించినప్పుడు సంబంధిత శాఖ అధికారులకు ఫిర్యాదు చేయాలని కోరారు. వినియోగదారుల హక్కుల పరిరక్షణే లక్ష్యంగా తనిఖీలు కొనసాగుతాయని అధి కారులు స్పష్టం చేశారు.
Nalgonda legal metrology officers surprise Inspections

