Praja Deveena
Newspaper Banner
Date of Publish : 24 October 2026, 3:22 pm Posted by : praja deveena

Telangana Weather : తెలంగాణపై తీవ్ర వాయుగుండం ప్రభావం

–రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్ష సూచన

–ఐదు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్

Telangana Weather : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంపై తీవ్ర వాయు గుండం ప్రభావం చూపే అవకాశా లు ఉండటంతో వాతావరణశాఖ అప్రమత్తమైంది. రాష్ట్రవ్యాప్తంగా భారీ నుంచి అత్యంత భారీ వ ర్షా లు కురిసే సూచనలు ఉన్నాయ ని హెచ్చరించింది. ఈ నేపథ్యం లో ప్రజలు అప్రమత్తంగా ఉండా లని సూచించింది.

భూపాలపల్లి, హన్మకొండ, మహ బూబాబాద్‌, వరంగల్‌, సిద్దిపేట జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్‌ జారీ చే సింది. మిగిలిన జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ ప్రకటించింది. ఈ నెల 28 నుంచి 30వ తేదీ వరకు వర్షాల ప్రభావం కొనసాగే అవకాశం ఉ న్నట్లు హెచ్చరికలు జారీ అయ్యా యి.

భారీ వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే తప్ప ప్రయాణాలు చేయవద్దని సూ చిస్తున్నారు. వర్షాల పరిస్థితిని ఎ ప్పటికప్పుడు గమనిస్తూ అధికా రులు జారీ చేసే సూచనలు పా టించాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తు న్నారు.వాయుగుండం ప్రభావం తో రాష్ట్రంలో వర్షాలు మరింత తీవ్రతరం అయ్యే అవకాశం ఉం డటంతో ప్రజలు, రైతులు అప్ర మత్తంగా ఉండాలి.