Praja Deveena
Newspaper Banner
Date of Publish : 26 October 2026, 11:39 am Posted by : praja deveena

Minister Komatireddy Venkat Reddy : మంత్రి కోమటిరెడ్డి చొరవతో పానగల్ ఛాయా సోమేశ్వరాలయానికి మహర్దశ

–రూ.20 కోట్ల నిధుల మంజూరుపై హర్షాతిరేకం
–మంత్రి కోమటిరెడ్డి ఫ్లెక్సీకి పాలాభిషేకం

Minister Komatireddy Venkat Reddy : ప్రజా దీవెన, న ల్లగొండ టౌన్: నల్లగొండ జిల్లాలోని చారిత్రాత్మక పానగల్ ఛా యా సోమేశ్వరాలయ అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం రూ. 20 కోట్ల నిధులు మంజూరు చేయడంతో ఆలయ ప్రాంగణం లో హర్షాతిరేకాలు వెల్లివిరిశాయి. ఆలయ అభివృద్ధికి కృషి చే సిన రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమ టిరెడ్డి వెంకట్‌రెడ్డికి ఆలయ కమిటీ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞత లు తెలిపారు. ఈ సందర్భంగా సోమవారం ఆలయ ప్రాంగణం లో మంత్రి ఫ్లెక్సీకి పాలాభిషేకం నిర్వహించి తమ ఆనందాన్ని వ్యక్తంచేశారు. మంత్రి పేరుతో ప్రత్యేక పూజలు కూడా నిర్వ హించారు.

ఆలయ అభివృద్ధికి కీలక ముందడుగు

ఆలయ కమిటీ ప్రతిపాదిత చైర్మ న్ కోడదల ఎల్లయ్య ఆధ్వ ర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నల్లగొండ మున్సిపల్ కా ర్పొ రేషన్ 1వ డివిజన్ కార్పొరేటర్ ఆట్లకుంట్ల నాగరాజు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ సంద ర్భంగా వారు మాట్లా డుతూ శతాబ్దాల చరిత్ర, విశిష్టమైన ఆధ్యా త్మిక ప్రాధాన్యత కలిగిన ఛాయా సోమేశ్వరాలయ అభివృద్ధికి రూ. 20 కోట్ల భా రీ నిధులు మంజూ రు కావడం సంతోషకరమని పేర్కొన్నారు. ఈ నిధులతో ఆలయ అభివృద్ధి పనులు వేగవంతమై, పానగ ల్ ప్రాంతానికి మరింత గుర్తింపు లభిస్తుందని ఆశాభావం వ్య క్తం చేశారు. అభివృద్ధి పను లు పూర్తయితే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు, ప ర్యాటకుల రాక పెరిగే అవకాశం ఉందని తెలిపారు. తద్వారా పానగల్ ఆధ్యాత్మిక వైభవంతో పాటు పర్యాటక ప్రాధాన్యత కూడా మరింత పెరుగుతుందని అభిప్రాయపడ్డారు.

    ప్రజాప్రతినిధులకు కృతజ్ఞతలు

ఆలయ అభివృద్ధికి సహకరించి న మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి తో పాటు నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్‌రెడ్డి, మాజీ జెడ్పీ టీ సీ గుమ్ముల మోహన్‌రెడ్డి కి ఆల య కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. భవిష్య త్తులోనూ ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు స హకరించాలని కోరారు. పానగల్ చారిత్రక, ఆధ్యాత్మిక వారస త్వాన్ని కాపా డుతూ మరింత అభివృద్ధి చేసేందుకు ప్రజలం తా సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ పార్టీ నాయకులు పల్‌రెడ్డి వెంకట్‌రెడ్డి, గుండగోని యాదయ్య గౌడ్, గురజాల నరేందర్, గుండగోని శ్రీనివాస్ గౌడ్, బుర్రి యాదయ్య, కొమ్ము జానీ యాదవ్, యువజన కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు గాలి నాగరాజు, కొప్పు ప్రవీణ్, కొప్పు సత్త య్య, గండికోట సాగర్, హరి శంకర్, జంపాల శంకర్, హర్ష, త క్కెళ్ల బన్నీ, ఆలయ అర్చకులు ఉదయ్ కుమార్, అజయ్ కు మార్ తదితరులు పాల్గొన్నారు.