Praja Deveena
Newspaper Banner
Date of Publish : 28 October 2026, 11:44 am Posted by : praja deveena

State Human Rights Commission tour in Nalgonda : మానవ హక్కుల కమిషన్‌ కీలక వ్యాఖ్య, మానవ హక్కుల కేసుల పరిష్కారంలో నల్గొండ జిల్లా ముందంజ

–గతేడాది 45 కేసులు,ఈ ఏడాది ఇప్పటివరకు ఐదే నమోదు
–జిల్లా అధికారుల తక్షణ స్పందన ప్రశంసనీయం

–రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్‌పర్సన్ డాక్టర్ జస్టిస్ ష మీమ్ అక్తర్

State Human Rights Commission tour in Nalgonda : ప్రజా దీవెన, నల్లగొం డ : ప్రజల హక్కుల పరిరక్షణలో అధి కార యంత్రాంగం బాధ్య తాయుతంగా వ్యవహరిస్తే బాధితుల కు సత్వర న్యాయం అం దడంతో పాటు ఫిర్యాదుల సంఖ్య కూడా తగ్గుతుందని న ల్గొండ జిల్లా యంత్రాంగం నిరూపిస్తోం ది. గత ఏడాదితో పో లి స్తే ఈ ఏడాది జిల్లాలో మానవ హక్కు ల కమిషన్‌కు అందిన ఫి ర్యాదులు గణనీయంగా తగ్గడంపై రా ష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్‌పర్సన్ డాక్టర్ జస్టిస్ ష మీ మ్ అక్తర్ సంతృప్తి వ్య క్తం చేశారు. అధికారుల సమన్వయం, తక్షణ స్పందన వల్లే ఈ మార్పు సాధ్యమైందని ప్రశంసించారు. బుధవారం నల్గొండ జి ల్లా కేంద్రంలోని ఆర్‌అండ్‌బీ అతిథి గృ హంలో ప్రజల నుంచి ఫి ర్యాదులు స్వీ కరించిన చైర్‌పర్సన్ అ నంతరం జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్, ఎ స్పీ శరత్ చంద్ర పవా ర్, ఇతర జిల్లా అధికారు లతో సమావేశమై మానవ హక్కుల కేసుల పరిష్కారంపై సమీ క్ష నిర్వహించారు.

గత ఏడాది నల్గొండ జిల్లాకు సం బంధించి మానవ హక్కుల కమి షన్‌కు సుమారు 45 ఫిర్యాదులు అందగా, ఈ ఏడాది ఇప్పటివర కు కేవలం ఐదు కేసులు మాత్రమే నమోదయ్యా యని తెలిపారు. వాటిలో నాలుగు కేసులను పరి ష్కరించి న ట్లు కలెక్టర్ వివరించారు. గత ఏడాది వచ్చిన కేసుల్లోనూ ఒక టి మినహా మిగిలిన వాటిపై జిల్లా అధికారులు స్పందించి పరి ష్కారచర్యలు తీసుకున్నారని కమిషన్ చైర్‌పర్సన్పేర్కొన్నారు.

  15 వేలకుపైగా కేసులకు పరిష్కారం

రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ వద్ద గతంలో సుమారు 17 వేల కేసులు పెండింగ్‌లో ఉండగా, వా టిలో 15 వేలకుపైగా కే సులను పరిష్కరించినట్లు జస్టిస్ షమీమ్ అక్తర్ వెల్లడించారు. ప్రస్తుతం ప్ర తిరోజూ 40 నుంచి 50 వరకు ఫిర్యాదులు అం దు తున్నాయని తెలిపారు.విద్య, వైద్యం, భూ వివాదాలు, సీని యర్ సిటిజన్ల సమస్యలు, పోలీసు, రెవెన్యూ శాఖలకు సం బంధించిన ఫిర్యాదులతో పాటు కమిషన్ సుమోటోగా స్వీక రించే కేసులపైనా చర్యలు తీసుకుంటు న్నట్లు వివరించారు. ఫిర్యాదులు అందిన వెంటనే సంబంధిత అధికారులను పిలి పించి, నివేదికలు తెప్పించి బాధితులకు న్యాయం జరిగేలా చ ర్యలు చేపడుతున్నామని చెప్పారు.

విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌ మెంట్, ఉపకార వేతనాల మం జూరులో జాప్యం, ఫీజులు చె ల్లించలేదనే కారణంతో ఒరిజిన ల్ సర్టిఫికెట్లు, బోనఫైడ్ పత్రాల ను నిలిపివేయడం వంటి అం శాలపై ఫిర్యాదులు వస్తున్నాయ ని తెలిపారు. ఇలాంటి సమ స్యల ను సంబంధిత విద్యాసంస్థల యాజమాన్యాలు, విద్యా శాఖ అ ధికారులతో చర్చించి పరిష్కరిస్తు న్నట్లు వెల్లడించా రు. విద్యార్థుల హక్కులను కాపాడటం ప్రభుత్వం, విద్యాసం స్థల బాధ్యతఅని స్పష్టంచేశారు.

ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవల పరిశీలన

సమీక్ష అనంతరం జస్టిస్ షమీమ్ అక్తర్ నల్గొండ ప్రభుత్వ ప్ర ధాన ఆసుపత్రిని సందర్శించి అత్య వసర విభాగం, ఐసీయూ, యూ డీఐడీ కేంద్రంలోని సౌకర్యాలను, రోగులకు అందుతున్న వైద్య సేవ లను పరిశీలించారు.ఆసుపత్రికి ప్రతిరోజూ సుమా రు 1,200 మం ది అవుట్‌పేషెంట్లు వస్తుండగా, 7 00 మంది ఇన్‌పేషెంట్లకు చికిత్స అందించే సామర్థ్యం ఉందని అ ధికా రు లు వివరించారు. ప్రతి నె ల సుమారు 800 ప్రసవాలు జ రు గుతున్నాయని, వాటిలో 60 శాతం సాధారణ ప్రసవాలు, 40 శాతం సిజేరియన్ ప్రసవాలు ఉంటున్నాయని తెలిపారు.

సాధ్యమైనంత వరకు సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాల ని, వైద్యపరమైన అత్యవసర పరిస్థి తుల్లో మాత్రమే సిజేరి యన్ శస్త్ర చికిత్సలు చేయాలని వైద్యులకు సూచించారు. త ల్లుల ఆరోగ్యా న్ని దృష్టిలో ఉంచుకుని గర్భిణులకు అవగాహ న కల్పించాలని కోరారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాణ్యమైన వైద్యులు, అవసర మైన సదుపాయాలు అందుబాటులో ఉ న్నాయని, ప్రజలకు మె రుగైన వైద్యం, విద్య అందించడం స మాజానికి చేసే గొప్పసేవ అని పేర్కొన్నారు.

విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి

విద్యాసంస్థలు, సంక్షేమ హాస్టళ్ల లో విద్యార్థులకు నాణ్యమైన ఆ హారం అందించేందుకు ప్రత్యేక చ ర్యలు చేపట్టినట్లు కలెక్టర్ బి. చం ద్రశేఖర్ తెలిపారు. ఆహార భద్రత కోసం మండల, డివి జన్, జిల్లా స్థాయుల్లో కమిటీలను ఏర్పాటు చేశామని, ప్రతినె ల నివేదికలు తె ప్పించుకుంటూ, మండల ప్రత్యేక అధికారుల తో వారానికోసారి స మీక్షిస్తున్నామని వివరించారు.హాస్టళ్లలో బియ్యం, కూరగా య లు, ఇతర వంట సామగ్రి నాణ్య తలో లోపాలు గుర్తిస్తే వెంటనే వా టిని మార్చేలా చర్యలు తీసుకుం టున్నామని చెప్పారు. సీనియర్ సిటిజన్లకు సంబంధించిన ఫి ర్యా దులను కూడా ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ, బాధితుల కు న్యాయం జరిగేలా చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు.

ప్రజాసేవే అధికారుల ప్రధాన బాధ్యత

ప్రజలకు సేవలు అందించడమే పరమావధిగా అధికారులు పని చేయాలని జస్టిస్ షమీమ్ అక్తర్ సూచించారు. మానవ హక్కుల పరిరక్షణలో ప్రతి శాఖ సమన్వ యంతో, శక్తివంచన లేకుండా కృషి చేయాలని కోరారు. ఫిర్యా దులపై వేగంగా స్పం దిస్తూ బాధి తులకు న్యాయం అందించడం ద్వారా ప్రజల్లో ప్ర భుత్వ వ్యవస్థ లపై విశ్వాసం పెరుగుతుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, నల్గొండ ఆర్డీవో వై. అశోక్ రెడ్డి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ రాహు ల్, ఆసుపత్రి డి ప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ నాగేష్, అద నపు ఎస్పీ రమేష్, జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి విజయేం దర్ రెడ్డి, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి కమలాకర్ రెడ్డి, సాం ఘిక సంక్షేమ శాఖ డీడీ శశి కళ, బీసీ సంక్షేమ అధికారి సంజీ వులు, నల్గొండ తహసీల్దార్ పరశురాం తదితరులు పాల్గొన్నా రు. అంతకుముందు చైర్‌పర్సన్‌కు జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఇతర అధికారులు పుష్ప గుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు.