Praja Deveena
Newspaper Banner
Date of Publish : 29 October 2026, 4:05 am Posted by : praja deveena

Noble service even in death : బిగ్ బ్రేకింగ్, మరణంలోనూ మహోన్నతసేవ, అవయవదానంతో ఎనిమిదిమందికి ప్రాణదానం

 

Noble service even in death : ప్రజా దీవెన, నల్లగొండ టౌన్ బతికున్నంత కాలం విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పి, వారి భవిష్య త్తుకు బాటలు వేసిన ఉపాధ్యాయురాలు.. మర ణం అంచున కూడా తన సేవాభావాన్ని చాటుకున్నారు. తాను ఈ లోకాన్ని విడిచిపోతూ.. మరో ఎ నిమిది మంది జీవితాల్లో వెలుగులు నింపారు. అవయవదానం ద్వారా ఎనిమిది మంది కి ప్రాణ దానం చేసిన ఉపాధ్యాయురాలు చాడ నీరజారెడ్డి త్యాగం పలువు రికి ఆదర్శంగా నిలుస్తోంది.

    బ్రెయిన్ డెడ్‌తో విషాదం

నల్లగొండ జిల్లా కేంద్రంలోని వీటీ కాలనీలో నివాసం ఉంటున్న చా డ నీరజారెడ్డి.. యాదాద్రి భువన గిరి జిల్లా చౌటుప్పల్ మం డలం దామోరా ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా విధులు ని ర్వహిస్తున్నారు. గతంలో నల్లగొం డ జిల్లాలోని కనగల్ మండలం రేగటే ఎంపీపీఎస్, నార్కట్‌పల్లి మండలం అక్కెనపల్లిలో పనిచే శారు.సోమవారం ఉదయం ఇంట్లో అక స్మాత్తుగా కుప్పకూలిన ఆమెను కుటుంబ సభ్యులు హై దరా బాద్‌లోని ఆసుపత్రికి త ర లించారు. పరీక్షించిన వైద్యు లు ఆమె బ్రెయిన్ డెడ్‌కు గురైనట్లు నిర్ధారించారు. దీంతో కుటుం బం లో తీవ్ర విషాదం నెలకొంది.

  కుటుంబ సభ్యుల గొప్ప నిర్ణయం

ఈ విషాద సమయంలో అఖిల భారత శరీర అవయవదాతల సంఘం జాతీయ కన్వీనర్, నల్ల గొండకు చెందిన ఎల్వీ కుమా ర్.. నీరజారెడ్డి భర్త గొర్రె నర్సిరెడ్డి, కు టుంబ సభ్యులను సంప్ర దించా రు. అవయవదానం ప్రాధాన్యత ను వివరించి, మరణిం చినా ఇత రుల జీవితాల్లో వెలుగులు నింప వచ్చని అవ గా హన కల్పించారు.కుటుంబ సభ్యులు అంగీకరించ డంతో వై ద్యులు నీరజారెడ్డి శరీ రం నుంచి అవసరమైన కీలక అ వయ వాలను సేకరించి, అవయ వా mల కోసం ఎదురుచూస్తున్న బాధితులకు అందజేశారు.దీంతో ఆమె మరణానంతరం కూడా మ రో ఎనిమిది మందికి జీవించే అవకాశం కల్పించినట్లయింది.

అవయవదానంపై అపోహలు వీడాలి

ఈ సందర్భంగా ఎల్వీ కుమార్ మాట్లాడుతూ కన్నబిడ్డను, తో డ బుట్టిన వారిని కోల్పోయినంతటి బాధలోనూ సమాజం కోసం ఆ లోచించి అవయవదానానికి అం గీకరించిన కుటుంబ సభ్యుల ని ర్ణయం అభినందనీయమని అ న్నారు. అవయవ దానంపై ఉన్న మూఢనమ్మకాలను పక్కనపెట్టి, ప్రతి ఒక్కరూ అవగాహన పెంచు కోవాలని పిలుపునిచ్చారు.

ఇదిలా ఉండగా నీరజారెడ్డి మృ తి పట్ల పీఆర్టీయూ రాష్ట్రక్రమ శిక్షణ సంఘం కన్వీనర్ కోమ టి రెడ్డి నర్సింహారెడ్డి, నల్లగొండ జి ల్లా అధ్యక్షుడు కాళం నారాయణ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఆ మె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.ఈ కా ర్య క్రమంలో అఖిల భారత అవయ వదాతల సంఘం కోఆర్డినేటర్ శ్రీ నివాస్, రాష్ట్ర నాయకులు అని రుద్ధ రెడ్డి, అంజయ్య, కేజీయ నా గేందర్, శ్యామ్ తదితరులు పా ల్గొన్నారు.నీరజారెడ్డి భౌతికంగా దూరమైనా ఆమె అందించిన ప్రాణదానం ఎ నిమిది మంది జీవితాల్లో ఆశాదీ పంగా నిలవ నుంది. ఆమె సేవా భావం సమా జానికి స్ఫూర్తిగా నిలుస్తుంది.