Praja Deveena
Newspaper Banner
Date of Publish : 29 October 2026, 2:04 pm Posted by : praja deveena

software engineer suicide in Hyderabad : బిగ్ బ్రేకింగ్, దుర్గం చెరువు కేబు ల్ బ్రిడ్జిపై విషాదం, సాఫ్ట్‌వేర్ ఇం జినీర్ అదృశ్యం

–యువకుడు చెరువులోకి దూకి నట్లు సమాచారం
–గాలింపు చర్యలు ముమ్మరం

Big breaking software engineer suicide: ప్రజా దీవెన, హైదరాబాద్‌: హై ద రాబాద్‌లోని ప్రముఖ పర్యాటక ప్రాంతం దుర్గం చెరువు కేబుల్ బ్రి డ్జి వద్ద విషాదకర ఘటన చోటు చే సుకుంది. విహారానికి వచ్చిన ఓ యువ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ చె రువులోకి దూకినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలపడంతో కలకలం రేగింది. యువకుడి ఆచూకీ కోసం సహాయక బృందాలు గా లింపు చర్యలు కొనసాగిస్తున్నాయి.

స్నేహితులను కలిసిన అనంతరం ఘటన

ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నానికి చెందిన రాజేష్‌ (25) హైద రాబా ద్‌లోని ఓ ఐటీ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజినీ ర్‌గా పని చే స్తున్నాడు. నాచారం ప్రాంతంలోని ఓ హాస్ట ల్‌ లో ఉంటూ వి ధులు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో మాదాపూర్‌ అయ్యప్ప సొసైటీలో నివసించే తన స్నే హితులను కలిసేందుకు వెళ్లాడు. అనంతరం దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిని సందర్శించాడు. బ్రి డ్జిపై నడుచు కుంటూ వెళ్తున్న రాజేష్‌ ఒక్కసారిగా చెరువులోకి దూకి నట్లు అక్కడున్న ప ర్యాటకులు గుర్తించారు. ఈ ఘ ట నతో దిగ్భ్రాంతికి గురైన వారు వెంటనే పోలీసులకు స మాచారం అందించారు.

రంగంలోకి ఎన్‌డీఆర్‌ఎఫ్‌, డీఆర్‌ ఎఫ్‌ బృందాలు

సమాచారం అందుకున్న మాదా పూర్‌ పోలీసులు ఘటనా స్థలా నికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. రాజేష్‌ ఆచూకీ కోసం జాతీయ విపత్తు స్పందన దళం (ఎన్‌డీఆర్‌ఎ ఫ్‌), విపత్తు స్పందన దళం (డీఆర్‌ఎఫ్‌) సి బ్బంది రంగంలోకి దిగారు. బోట్ల సాయంతో చెరువులో గాలింపు చర్యలు చేప ట్టారు.

   కారణాలపై పోలీసుల దర్యాప్తు

రాజేష్‌ ఈ నిర్ణయం తీసుకోవడా నికి గల కారణాలు ఇంకా తెలి యరాలేదు. పని ఒత్తిడి లేదా వ్య క్తిగత సమస్యలు ఏమైనా ఉన్నా యా అనే కోణాల్లో పోలీసులు వి చారణ జరుపుతున్నారు. రాజేష్‌ సోదరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు, ఫోన్‌ కాల్‌ డేటా, సీసీటీవీ దృశ్యా లను పరిశీలిస్తూ ఘటనకు సం బంధించిన వివరాలను సేకరిస్తు న్నారు.

software engineer suicide in Hyderabad