Praja Deveena
Newspaper Banner
Date of Publish : 29 October 2026, 2:02 pm Posted by : praja deveena

Telangana ACB surprise rides : బిగ్ బ్రేకింగ్, రూ.22 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన గ్రామపాలనా అధికారి

–రెవెన్యూ రికార్డుల్లో పేరు సవర ణకు లంచం డిమాండ్‌ –రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న ఏసీబీ అధికారులు

Telangana ACB surprise rides : ప్రజా దీవెన, మంచిర్యా ల: ప్రభు త్వ కార్యాలయాల్లో లంచం డిమాండ్‌ చేసే అధికారు లపై అవినీ తి నిరోధక శాఖ (ఏసీబీ) కొరడా ఝళిపిస్తోంది. ఈ క్రమంలో మం చిర్యాల జిల్లా మోసం గ్రామానికి చెందిన గ్రామ పాలనా అధికారి (జీపీఓ) డి. శ్రీనివాస్‌ రూ.22 వే ల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు.2026 అక్టో బర్‌ 29న ఈ ఘటన చోటు చేసుకుంది. ఫిర్యాదుదారుని తం డ్రి పేరును రెవెన్యూ రికార్డుల్లో స రిచేసి, ఆ విషయంపై ఉన్న తాధికారులకు నివేదిక సమర్పించేందుకు జీపీఓ రూ.22,000 లంచం డిమాండ్‌ చేసినట్లు ఏసీబీ అధి కారులు వెల్లడించారు. ఈ ప్రక్రి య పూర్తయితే ఫిర్యాదుదారు డు, ఆయన సోదరుడు తమ వ్య వసాయ భూమికి సంబంధించి వారసత్వ హక్కులు పొందేం దు కు అవకాశం ఉండేది.

ఈ నేపథ్యంలో లంచం తీసుకుం టున్న సమయంలో ఆదిలా బాద్‌ రేంజ్‌ ఏసీబీ అధికారులు పక్కా ప్రణాళికతో దాడి చేసి, శ్రీని వా స్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకు న్నారు. ఆయన కార్యా లయంలో లంచంగా స్వీకరించిన రూ.22,0 00 నగదును స్వా ధీనం చేసుకు న్నారు.తన అధికారిక హోదాను దుర్వినియోగం చేస్తూ ప్రభుత్వ పనిని అనుకూలంగా చేసేందుకు లంచం డి మాండ్‌ చేసి స్వీకరించి నట్లు ఏసీబీ పేర్కొంది. నిందితు డిని అరెస్టు చేసి, కరీంనగర్‌లోని ఎస్‌పీఈ, ఏసీబీ కేసుల ప్రత్యేక న్యాయస్థానం ఎదుట జ్యుడీషి యల్‌ రిమాండ్‌ నిమిత్తం హాజరు పరిచేందుకు అధికారులు చర్య లు చేపట్టారు. ఈ కేసులో తదు పరి విచారణ కొనసాగుతోంది. ఫిర్యాదుదారుని భద్రత దృష్ట్యా ఆయన వివరాలను ఏసీబీ గో ప్యంగా ఉంచింది.

లంచం అడిగితే 1064కు ఫిర్యాదు చేయండి

ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా లంచం డిమాండ్‌ చేస్తే ప్రజలు నిర్భయంగా తెలంగాణ ఏసీబీని సంప్రదించాలని అధికారులు సూచించారు.టోల్‌ఫ్రీ నంబర్‌ 1064, వాట్సాప్‌ 94404461 06, ఫేస్‌బుక్‌ Telangana ACB ఎక్స్‌ (ట్విట్టర్‌) @Telang ana ACB లతో పాటు అలాగే ప్ర భు త్వ కార్యాలయాలు, ప్రధాన బ హిరంగ ప్రదేశాల్లో అందుబాటు లో ఉన్న ఏసీబీ క్యూఆర్‌ కోడ్‌ ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చు. ఫిర్యాదు దారుల పేర్లు, వ్య క్తిగత వివరాలను గోప్యంగా ఉం చుతామని ఏసీబీ అధికారులు స్పష్టం చేశారు.