–పట్టభద్రుల ఓటరు నమోదు ప్ర క్రియను ప్రతిష్టాత్మకంగా తీసుకో వాలి
–కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత
–మాజీ ఎమ్మెల్యే డా. గాదరి కిషోర్ కుమార్
Target to Brs Rakesh Reddy Victory : ప్రజా దీవెన, తుంగతుర్తి: కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజల్లో తీవ్ర వ్య తిరేకత వ్యక్తమవుతోందని, రాబోయే నల్లగొండ–ఖమ్మం–వ రంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎ న్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి రా కేష్ రెడ్డి విజయమే లక్ష్యంగా పార్టీ శ్రే ణులంతా సమష్టిగా కృషి చేయా లని మాజీ ఎమ్మెల్యే డా. గాదరి కిషోర్ కుమార్ పిలుపు నిచ్చారు.గురువారం తుంగతుర్తి మండల కేంద్రంలోని బీఆర్ఎ స్ పార్టీ కా ర్యాలయంలో నిర్వహించిన పట్ట భద్రుల ఓటరు న మోదు సమీక్ష సమావేశానికి ఆయన ముఖ్య అ తిథిగా హాజరై మాట్లాడారు. మూడు జిల్లాల ఎమ్మెల్సీ పరిధి లో సుమారు 3 4 నియోజకవర్గా లు ఉన్న నేపథ్యంలో ఓటు హ క్కు కలిగిన ప్రతి పట్టభద్రుడిని గుర్తించి ఓటరుగా నమోదు చేయించే బా ధ్యత పార్టీ నాయకులు, కార్యకర్తలపై ఉందన్నారు.ప్రతి గ్రా మంలో పట్టభద్రుల ఇళ్లకు స్వయంగా వెళ్లి ఓటరు నమో దు ప్రక్రియను పూర్తి చేయించాలని, ఈ విషయంలో ఏమాత్రం ని ర్లక్ష్యం వహించవద్దని సూచించారు. ఓటరు నమోదు విధానం పై నాయకులకు సమగ్రంగా వివరించారు.
కాంగ్రెస్ పాలనపై తీవ్ర విమర్శలు
రైతులకు సాగునీరు, నాణ్యమైన విద్యుత్ అందించడంలో, నిరు ద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని గాదరి కిషోర్ వి మర్శించారు. చేసిన పనులకు బి ల్లులు చెల్లించాలంటూ కాంట్రాక్ట ర్లు ఇబ్బందులు ఎదుర్కొంటు న్నారని, నిధుల కోసం సొంత పా ర్టీ ఎమ్మెల్యేలే ఆమరణ దీక్షకు సి ద్ధమవుతామని ప్రకటించడం ప్ర భుత్వ పరిస్థితికి అద్దం పడుతోం దని ఎద్దేవా చేశారు.ప్రభుత్వ వై ఫ ల్యాలు, పాలకుల వ్యవహారశై లిని ప్రజలు నిశితంగా గమని స్తున్నారని పేర్కొన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాకేష్ రెడ్డి గెలుపు కోసం ప్రతి నాయకుడు, కార్యకర్త బాధ్యతగా పని చేయాలని పిలుపునిచ్చారు.
ప్రమాద బాధితుడికి పరామర్శ
సమావేశం అనంతరం బీఆర్ఎస్ అధికార ప్రతినిధి తునికి సాయి ల్ కుమారుడు తునికి నాగరాజు ప్రమాదానికి గురైన విషయం తె లుసుకున్న డా. గాదరి కిషోర్ కు మార్ ఆయనను పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసు కున్నారు. ఈ కార్యక్రమంలో బీఆ ర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వై. వెంక టేశ్వర్లు, రాష్ట్ర నాయకులు గుజ్జ యుగంధర్ రావు, మండల పార్టీ అధ్యక్షుడు తాటికొండ సీతయ్య, సంకేపల్లి రఘునందన్ రెడ్డి, ఎస్. ఏ. రజాక్, మున్నా మల్లయ్య యాదవ్, మాజీ ప్రజాప్రతి నిధు లు, గ్రామాల ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్చార్జిలు, మండల ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
న్యాయవాద గ్రాడ్యుయేట్ ఓటర్ల నమోదును చేపట్టాలి
నల్లగొండ: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలను దృష్టిలో ఉంచు కుని అర్హులైన ప్రతి పట్టభద్రుడిని ఓట రుగా నమోదు చేయిం చే బాధ్య తను న్యాయవాదులు తీసుకో వాలని నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి పిలుపునిచ్చారు. న్యా యవాదులు తమ కుటుంబ సభ్యులు, స్నేహితుల తో పాటు పరిధిలోని ప్రతి పట్టభ ద్రుడికి ఓటు హక్కు కల్పించేలా కృషి చేయాలని కోరారు. శుక్రవా రం నల్లగొండ జిల్లా కోర్టు ఆవరణ లోని బార్ అసోసియేషన్ కార్యా లయంలో నిర్వహించిన ప ట్టభద్రుల ఓటరు నమోదు కార్యక్ర మంలో ఆయన పాల్గొని మాట్లా డారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో న్యాయవా దుల పాత్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుం దని కొనియాడారు. ఉద్యమానికి అవసరమైన న్యాయ సలహా లు అందిస్తూ పోరాటాన్ని ముందుకు నడిపించారని, కేసులు ఎదుర్కొన్న అనేక మంది ఉద్యమకారులకు ఉచితంగా న్యా య సహాయం అందించి అండగా నిలిచారని గుర్తుచేశారు.
ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ విధానాల వల్ల తెలంగాణలోని అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విమర్శించా రు. సమాజంపై అవగాహన కలిగిన మేధావులుగా న్యాయవా దులు ప్రజలకు వాస్తవ పరిస్థితులను వి వరించాల్సిన అవ సరం ఉంద న్నారు.గతంలో ఎమ్మెల్సీ అభ్య ర్థిగా పోటీ చేసిన ఏనుగుల రాకే ష్ రెడ్డి ఓటమి చెందినప్పటికీ నిరుద్యోగులు, యువత సమస్య లపై నిరంతరం పోరాటం చేస్తూ వారికి అం దుబాటులో ఉంటు న్నారని పేర్కొన్నారు. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మరో సారి బరిలో నిలుస్తున్న నేపథ్యంలో ఆ యన విజయానికి న్యాయ వాదులు సహకరించాలని కోరారు. ముందుగా అర్హులైన పట్టభ ద్రులందరినీ ఓటర్లుగా నమోదు చే యించే కార్యక్రమాన్ని విస్తృతం గా చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.
న్యాయవాదుల సమస్యల పరిష్కారానికి తనవంతు సహకా రం ఎల్లప్పుడూ ఉంటుందని, వారికి అండగా నిలుస్తానని కం చర్ల భూపాల్ రెడ్డి భరోసా ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో నల్లగొండ ము న్సిపల్ మాజీ చైర్మన్ మం దడి సై దిరెడ్డి, బార్ అసోసియేషన్ అ ధ్యక్షుడు ఏ. సతీష్ కు మార్, కా ర్యదర్శి అశోక్, సీనియర్ న్యా యవాదులు గుండె వెంకటేశ్వర్లు, మునగాల నారాయణరావు, జి. జవహర్, సిరి గిరి వెంకట్ రెడ్డి, లోడంగి గోవర్ధన్, కంచనపల్లి ర వీందర్ రావు, యడవెల్లి సింగిల్ విండో చైర్మన్ దోటి శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్ రావుల శ్రీనివాస రె డ్డి, న్యాయవాదులు యాదగిరి, ప్రవీణ్ కు మార్, ఏ.వెంకట్ రెడ్డి, మంద నాగేష్ తదితరులు పాల్గొన్నారు.
Target to Brs Rakesh Reddy Victory



