–పట్టభద్రుల ఎన్నికల్లో బీఆర్ఎ స్‌కు మద్దతు ఇవ్వండి
–ఆకునూరు లక్ష్మయ్య పదవీ విరమణ సభలో దేవీప్రసాద్, కంచర్ల పిలుపు
Government Employees Issues problems : ప్రజా దీ వెన,నల్లగొండ: ఉద్యో గు ల సంక్షేమాన్ని విస్మరిస్తూ, వారి స మస్యల పరిష్కారం పట్ల నిర్ల క్ష్యంగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి రానున్న పట్టభద్రు ల ఎన్నికల్లో తగిన గుణపాఠం చె ప్పాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయ కులు, టీఎన్జీవో మాజీ అ ధ్యక్షుడు గుండవరపు దేవీప్రసాద్ రావు, నల్లగొండ మాజీ ఎ మ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి పిలుపునిచ్చారు. ఉద్యోగుల సంక్షేమానికి పెద్ద పీట వేసిన కేసీఆర్ ప్రభుత్వ పాలనను గు ర్తుచేసుకుని బీఆర్ఎ స్‌కు అండగా నిలవాలని కోరారు. భూ గర్భ జలవనరుల శాఖలో సూపరింటెండెంట్‌గా విధులు ని ర్వ హించి పదవీ విరమణ పొంది న ఆకునూరు లక్ష్మయ్యకు నిర్వ హించిన ఆత్మీయ సన్మాన సభ లో దేవీప్రసాద్, కంచర్ల భూపా ల్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
ఉద్యోగులపై కాంగ్రెస్ ప్రభుత్వ కక్షసాధింపు చర్యలు
ఈ సందర్భంగా దేవీప్రసాద్ మా ట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రా ష్ట్ర సాధన ఉద్యమంలో టీఎన్జీ వోలు కీలక పాత్ర పోషిం చా రని గుర్తుచేశారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఉద్యోగులకు 43 శా తం ఫిట్‌మెంట్ ప్రకటించడంతో పాటు, ఉద్యోగులు ప్ర శాంత వా తావరణంలో విధులు నిర్వహిం చుకునే పరిస్థితు లు కల్పించార ని పేర్కొన్నారు.అయితే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభు త్వ పాలనలో ఉ ద్యోగులు అనేక ఇబ్బందులు ఎ దుర్కొంటు న్నారని విమర్శించా రు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉ న్నారనే కారణంతో ఇప్పటివరకు 180 మంది ఉద్యోగులను సస్పెం డ్ చేయడం కక్షసాధింపు చర్యల కు నిదర్శనమని ఆరోపించారు. ఉద్యోగులకు రావాల్సిన ప్రయో జనాలు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
రానున్న పట్టభద్రుల ఎన్నికల్లో ఉద్యోగులు, పట్టభద్రులు కాం గ్రెస్ ప్రభుత్వ వైఖరిని ప్రశ్నించాలని, బీఆర్ఎస్ పార్టీకి మద్ద తుగా నిల వాలని కోరారు.అనంతరం పదవీ విరమణ పొం దిన ఆకునూరు లక్ష్మయ్య సేవలను కొనియా డుతూ.. భూగ ర్భ జలవనరుల శాఖలో ఆయన అనేక బాధ్యతలను సమర్థ వంతంగా నిర్వహిం చారని ప్రశంసించారు. పదవీ విర మణ అనంతరం కూడా ప్రజలకు మరిన్ని సేవలు అందిస్తూ ఆయు రారోగ్యాలతో సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు.
సభకు అడ్డంకులు సృష్టించడం బాధాకరం
మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి మాట్లాడుతూ ఆకునూ రు లక్ష్మయ్య తన ఉద్యోగ జీవితంలో అంకితభావంతో పని చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నారని అభినందించారు. వా స్తవానికి ఈ ప దవీ విరమణ సన్మాన కార్యక్రమాన్ని టీఎన్జీవో హాల్లో నిర్వహించా ల్సి ఉండగా, రాజకీయ కారణాలతో కొం దరు టీఎన్జీవో నాయకు లు అడ్డంకులు సృష్టించి లక్ష్మ య్యను అవమానపరిచారని ఆరోపించారు. ఇది అత్యంత బాధాక రమైన విషయమని అన్నా రు.లక్ష్మయ్య భవిష్యత్తులో మ రిం త ప్రజాసేవ చేయాలని, బీ ఆర్ఎస్ పార్టీలో చేరాలని ఆహ్వా నించారు. ఆయన పార్టీలోకి వస్తే సముచిత స్థానం కల్పించి గౌరవి స్తామని హామీ ఇచ్చారు. పానగ ల్ ప్రాంతానికి పూర్వ వైభవం తీ సుకురావడంలో భాగస్వాములు కావాలని కోరారు.
కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఉద్యోగులు సంతోషంగా ఉన్నార ని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఉ ద్యోగుల సమస్యలను పట్టిం చు కోవడం లేదని విమర్శించారు. ఉ ద్యోగులు గత పాలనలో పొందిన ప్రయోజనాలను, ప్రస్తుత పరిస్థి తులను బేరీజు వేసు కుని రాజకీ య నిర్ణయం తీసుకోవాలని విజ్ఞ ప్తి చేశారు.ఈ కార్యక్రమంలో నల్లగొండ నగ ర బీఆర్ఎస్ అధ్యక్షుడు భువన గిరి దేవేందర్, కంచనపల్లి రవీం దర్ రావు, కొండూరు సత్యనా రా యణ, కార్పొరేటర్లు కొండూరు దీ పిక, ప్రవీణ్ రెడ్డి, బాణావత్ దీ ప్లా, రావుల శ్రీనివాస్ రెడ్డి, జమా ల్ ఖాద్రి, పెరిక కరణ్, జయరాజ్, యాట జయప్రద రెడ్డి, జిల్లా టీఎ న్జీవో మాజీ అధ్యక్షుడు శ్రవణ్ కు మార్‌తో పాటు పలువురు టీఎ న్జీవో నాయకులు, ఉద్యోగులు పాల్గొన్నారు.
Government Employees Issues problems