–బీసీలను మోసం చేస్తున్న అమి త్ షా రాజీనామా చేయాలి
–ఓబీసీ కాలం చేర్చకపోతే బిజెపి ని బీసీలే ఘోరీ కడతరు
— రాష్ట్రానికి ఎవరు వచ్చినా పర్యటనలను అడ్డుకుంటాం
BC Association jajula Srinivas Goud : ప్రజా దీవెన, హై దరాబాద్:బీసీ కులగణనన చేస్తామని హామీ ఇచ్చి మోసం చే సిన బిజెపి పార్టీని వచ్చే ఎన్నికల్లో బీసీలే రాజకీయంగా ఆ పా ర్టీని గోరి కట్టడం ఖాయమని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అ ధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ బిజెపి ఫైర్ అయ్యారు. సోమ వారం కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా హైదరాబాద్ పర్యట న ను నిరసిస్తూ బీసీ సంఘాల ఆధ్వర్యంలో హైదరాబాదు లో ని అంబర్ పేటలో లోనీ మహాత్మ జ్యోతిబాపూలే విగ్రహం ముం లదు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన ధర్నా చేపట్టారు. ఈ నిరసన ధర్నాలో జాజుల శ్రీనివాస్ గౌడ్ హాజరై మాట్లాడు తూ దేశం లోని 80 కోట్ల మంది బీసీల ప్రగాఢ ఆకాంక్ష అయిన బీసీ కు లాల లెక్కలు చేపట్టాలని దశాబ్దాలుగా పోరాటం చే స్తుంటే ఎన్నికలలో లబ్ధి పొందడానికి బీసీ కుల గణన చేస్తా మని కేంద్ర క్యాబినెట్ సమావేశంలో నిర్ణయించి, తీరా జనగణ న చేపడు తున్న ఈ సందర్భంలో ఓబీసీ కాలం చేర్చకుండా బీసీలకు బి జెపి ప్రభుత్వం తీవ్రని అన్యాయం చేస్తుందని ఆయన ఆరోపించారు
బీసీ కులాల లెక్కలు లేకుంటే బీసీలకు భవిష్యత్తు లేదని, బీసీ లు విద్యా, ఉద్యోగ రాజకీయ రంగాల్లో అస్తిత్వం కోల్పోయే ప్ర మాదం పొంచి ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. బీసీ ల కు ఇంత అన్యాయం జరుగుతు న్న బీసీల ఓట్లతో నాలుగు సార్లు ఎమ్మెల్యేగా, రెండుసార్లు పార్ల మెంట్ సభ్యునిగా, కేంద్ర మం త్రిగా అయిన జి కిషన్ రెడ్డి కనీసం స్పందించకపోవడం సిగ్గు చేటు అన్నారు. బీసీలను మోసం చేసిన కేంద్ర మంత్రుల కు దేశం లో ఎక్కడ కూడా పర్యటించే అర్హత లేదని, భవిష్య త్తులో బిజెపి జాతీయ నేతలు కేంద్ర మంత్రులు తెలంగాణలో పర్యటిస్తే ఖచ్చితంగా అడ్డుకొని తీరుతామని ఆయన తీవ్రంగా హెచ్చరించారు, బీసీ కులగనన చేపట్టడం చేతకాకపోతే కేంద్ర హోంశాఖ పదవికి అమిత్ షా తక్షణమె రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు
బీసీలకు చారిత్రాత్మకంగా ఇంత అన్యాయం చేస్తున్న బిజెపి అధిష్టానం పై బిజెపిలో ఉన్న చీము నెత్తురు ఉన్న బీసీ నేతలు ప్రధాని మోదీ, కేంద్రమంత్రి అమిత్ షా లపై తిరుగుబాటు చే యాలని ఆయన పిలుపునిచ్చారు బీసీ కాలం చేర్చే వరకు, బీసీలకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు పెంచే వరకు కేంద్ర ప్రభుత్వాన్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదని, డిసెంబర్ 14,15 తేదీలలో ఢిల్లీ నీ వేలాది మంది తో ముట్టడించి బీసీల తడాఖా ఎట్లుంటదో బిజె పి ప్రభుత్వానికి రుచి చూపిస్తా మని జాజుల శ్రీనివాస్ గౌడ్ తీ వ్రంగా హెచ్చరించారు.ఈ ఆందోళన కార్యక్ర మంలో బిసి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎర్ర సత్యనారా యణ, కుందారం గణేష్ చారి, గుజ్జ కృష్ణ, కుల్కచర్ల శ్రీనివాస్ ముదిరా జ్, తాటికొండ విక్రమ్ గౌడ్, కనకాల శ్యాం కుర్మా, పిట్ల శ్రీధర్, ఉ ప్పరి శేఖర్ సగర, మురళి కృష్ణ, కాటేపల్లి వీరాస్వామి,జాజుల లింగం గౌడ్, గొడుగు మహేష్ యాదవ్, ఈడిగ శ్రీనివాస్ గౌడ్, రావులకోల్ నరేష్ ప్రజాపతి, కెవి గౌడ్, కౌల జగన్నాథం, గూ డూరు భాస్కర్ మేరు, గోధ వరుణ్ కుమార్ గౌడ్, తారకేశ్వరి, సంధ్యారాణి, గౌతమి, ఇంద్రం రజక, కొప్పుల చందు గౌడ్, గజ్జె ల సత్యరాజ్ గౌడ్, సిద్ధాంతం శ్యామల, గుంటి మహేష్, దేవిక, శ్రావణి, అంజమ్మ, నరసమ్మ, తదితరులు పాల్గొన్నారు..
BC Association jajula Srinivas Goud

