–-ఒక కాలులో ఇంకా మూడు బుల్లెట్లు
–తీవ్ర రక్తస్రావంతో ఆస్పత్రిలో చికిత్స కాసేపట్లో కీలక ఆపరేషన్
Doctors may consider amputating the legs of the Raptadu case accused ప్రజా దీవెన, అనంతపురం :రా ప్తాడు బాలికపై దాడి కేసులో నిందితుడు హేమంత్ పరిస్థితి వి షమంగా మారినట్లు సమాచా రం. పోలీసుల కాల్పుల్లో రెండు కాళ్ల మోకాళ్ల కింది భాగాల్లోకి ఆరుబుల్లెట్లు దూసుకెళ్లడంతో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. కుడి కాలులో మరో మూడు బుల్లెట్లు ఉన్నట్లు తె లుస్తోంది. తీవ్ర రక్తస్రావం కావడంతో వైద్యులు ఇ ప్పటికే నాలుగు యూనిట్ల రక్తా న్ని ఎక్కించారు. నిందితుడి కాళ్ల కు తీవ్రంగా గాయాలు కావడంతో వాటిని తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడే అవకాశం ఉందన్న ప్రచా రం కలకలం రేపుతోంది. వైద్యు లు కాసేపట్లో శస్త్రచికిత్స నిర్వ హించేందుకు సిద్ధమవు తున్నట్లు సమాచారం. ఆపరేషన్ అనంతరం అత డి ఆరోగ్య పరిస్థితిపై స్పష్టత వచ్చే అవకాశం ఉం ది.
రంపంతో దాడి.. అడవుల్లోకి పరార్
రాప్తాడులోని ఓ పాఠశాలలో బాలికపై రంపంతో దాడి చేసిన హేమంత్ అనంతరం అక్కడి నుంచి పరారై ఆత్మకూరు అటవీ ప్రాంతంలోకి వెళ్లాడు. నిందితుడి ఆ చూకీ గుర్తించిన పోలీసులు అత డి ని పట్టుకునేందుకు వెళ్లగా, పోలీసులపై తిరగబడి దాడికి యత్నించినట్లు సమాచారం. దీంతో పోలీ సులు ఆరు రౌండ్ల కాల్పులు జరిపారు.
మరోవైపు బాధిత బాలికకు చికిత్స కొనసాగుతోం ది. తీవ్రంగా గా యపడిన విద్యార్థిని బెంగళూరు లోని మణిపాల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కో లుకుంటున్నట్లు సమాచారం.ఈ ఘటన రా ష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాం శంగా మారింది. నిం దితుడి ఆరో గ్య పరిస్థితి, శస్త్రచికిత్స ఫలితాలు, బాలిక ఆరోగ్య పురోగతిపై తదుపరి వివరాల కో సం అందరూ ఎదురుచూస్తున్నారు. వీరిద్దరి ఆరో గ్యం విషయంలో హెల్త్ బు లిటిన్ విడుదలయితేనే స్పష్టత వచ్చే అవకాశం లేకపోలేదు.
Doctors may consider amputating the legs of the Raptadu case accused
