Praja Deveena
Newspaper Banner
Date of Publish : 02 November 2026, 12:44 pm Posted by : praja deveena

USA and Uttar Pradesh Tragic Incidents : బిగ్ బ్రేకింగ్, రెండు ఘోర విషాద ఘటనలు, అమెరికాలో 9 మం ది,యూపీలో 6మంది సజీవద హనం

USA and Uttar Pradesh Tragic Incidents : ప్రజా దీవెన, హైదరాబాద్: అమె రికా, భారత్‌లో చోటుచేసుకున్న రెండు వే ర్వేరు ఘోర ప్రమాదాలు తీవ్ర విషాదాన్ని నింపాయి. అమె రి కాలో ప్రైవేట్ జెట్ కుప్పకూలి తొమ్మిది మంది ప్రాణాలు కోల్పో గా, ఉత్తరప్రదేశ్‌లో ట్రైలర్‌ను ఓ మ్నీ వ్యాన్ ఢీకొన్న ఘటనలో ఆ రుగురు దుర్మరణం చెందారు. ఈ రెండు ప్రమాదాలు పలు వురి కుటుంబాల్లో తీరనిశోకాన్ని మిగిల్చాయి.

   ప్రైవేట్ జెట్ కూలి తొమ్మిదిమంది మృతి

అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం పామ్ బీచ్ కౌంటీలో ఘోర వి మాన ప్రమాదం చోటుచేసుకుంది. టె క్సాస్‌లోని ఆస్టిన్-బెర్గ్‌ స్ట్రోమ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బహామాస్‌కు తొమ్మిది మందితో బయలుదేరిన ప్రైవేట్ జెట్ ఒక్కసారిగా ప్రమాదానికి గురైంది.గగనతలంలో విమానానికి సాంకేతిక సమస్యలు ఎదురవ డంతో పాటు, ప్రతికూల వాతావ రణ పరిస్థితులు ప్రమాదానికి కారణమైనట్లు ప్రాథమిక సమాచా రం. విమానంపై మంచు పేరుకు పోవడం, వాతావరణంలో తీ వ్ర అస్థిరత ఏర్పడటంతో పైలట్ అ త్యవసర పరిస్థితిని ప్రకటిం చాలరు. అయితే, ఎమర్జెన్సీ ప్రకటించిన కొద్ది క్షణాల్లోనే విమా నం వేగంగా కిందికి దూసుకొచ్చి నేలను బలంగా ఢీకొట్టింది. భా రీ శబ్దంతో పేలుడు సంభవించడంతో విమానం క్షణాల్లోనే అ గ్నిగోళంగా మా రిపోయింది. ఈ ప్రమాదంలో పైల ట్ సహా వి మానంలో ఉన్న మొ త్తం తొమ్మిది మంది ప్రాణాలు కో ల్పోయి నట్లు అమెరికా రవాణా శాఖ కార్యదర్శి సీన్ డఫీ అధికా రికం గా ధ్రువీకరించినట్లు సమాచారం.

యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురి ప్రాణాలు బలి

మరోవైపు ఉత్తరప్రదేశ్‌లోని ఖుషీ నగర్ జిల్లాలో ఆదివారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. ఎ నిమిది మందితో ప్రయాణిస్తున్న మారు తి ఓమ్నీ వ్యాన్‌ను భా రీ ట్రైలర్ ట్రక్కు బలంగా ఢీకొట్టింది.ఈ ప్ర మాద తీవ్రతకు వ్యా న్ తీవ్రంగా దెబ్బతింది. అందులో ప్రయాణి స్తున్న వారిలో ఆ రుగురు తీవ్రగాయాలు, రక్తస్రావంతో ఘటనాస్థ లంలోనే ప్రా ణాలు కోల్పోయారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడి కొన ఊ పిరితో కొట్టుమిట్టాడారు.సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేప ట్టారు. క్షతగాత్రులను అత్యవసర చికిత్స నిమిత్తం గోరఖ్‌పూ ర్‌ లోని బీఆర్‌డీ మెడికల్ కాలేజీకి తరలించారు.రెండు ప్రాంతా ల్లో రెండు ఘోర ప్రమాదాలు, మొత్తం 15 మంది మృత్యువా త పడటంతో బాధిత కుటుంబాల్లో విషాద ఛాయలు అలము కున్నాయి.