–ప్రభుత్వ స్థలం కేటాయించి పనులు వెంటనే ప్రారంభించాలి
–నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి
Nalgonda Brs ex mla bhupal Reddy : ప్రజా దీవెన, నల్లగొండ టౌన్ : నల్లగొండ పట్టణంలోని పలు కాల నీల ప్రజల రాకపోకల కష్టాలకు తెరదించేందుకు సాగర్ రోడ్డు నుంచి వెం కటరమణ కాలనీ వర కు లింక్ రోడ్డు నిర్మించాలని మాజీ ఎ మ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేవలం 100 మీటర్ల మేర రహ దారి నిర్మిస్తే ఐదు కాలనీల ప్ర జలకు రవాణా సౌకర్యం మెరుగుపడుతుందని ఆయన స్ప ష్టం చేశారు.పట్టణంలోని 9వ డివిజన్ పరిధిలో కొత్తగా నిర్మిస్తు న్న ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ నుంచి వెంకటర మణ కాలనీ వరకు లింక్ రోడ్డు ఏ ర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు.
గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే ఈ ర హదారి నిర్మాణానికి అ నుమతులు మంజూరయ్యాయని, అ యినప్పటికీ ఇప్పటివరకు పనులు పూర్తికాకపోవడం విచా రక రమని పేర్కొన్నారు.సాగర్ రోడ్డు నుంచి వెంకటరమ ణ కాలనీ, వసుం ధర కాలనీ, ప టేల్ నగర్, సూర్యవంశం కాలనీ, చైతన్య పురి కాలనీలకు నేరుగా అనుసంధాన రహదారి లేకపోవడం తో స్థానికులు ప్రతిరోజూ రాకపోకల్లో ఇబ్బందులు ఎదుర్కొం టున్నారని తెలిపారు.
100 మీటర్ల రోడ్డుతో ఐదుకాలనీలకు ప్రయోజనం
ప్రభుత్వం చొరవ తీసుకుని అవ సరమైన 100 మీటర్ల మేర ప్రభు త్వ స్థలాన్ని కేటాయిస్తే లింక్ రో డ్డు నిర్మాణం సులభంగా పూర్తవు తుందని భూపా ల్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ప్రజల సౌకర్యాన్ని దృష్టి లో పెట్టుకుని అధికారులు, ప్రజాప్రతినిధులు వెంట నే స్పం దించాలని, ఎలాంటి జాప్యం లే కుండా ని ర్మాణ పనులు ప్రారం భించాలని కోరారు.ఈ కార్య క్రమంలో మాజీ మున్సిపల్ చై ర్మన్ మందడి సైది రెడ్డి, టౌన్ ప్రెసి డెంట్ భువన గిరి దేవేందర్, 9వ డివి జన్ కార్పొరేటర్ దీప్లా నాయక్, కార్పొ రేటర్లు మార గోని భవాని గణేష్, గోపగోని స్వాతి, రాజశేఖర్ గౌ డ్, టౌన్ యూత్ వైస్ ప్రెసి డెంట్ వజ్జ శ్రీనివాస్ యాదవ్, మాజీ కౌన్సిలర్ దండంపల్లి సత్తయ్య, రావుల శ్రీనివాస్ రెడ్డి తదితర బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Nalgonda Brs ex mla bhupal Reddy