Praja Deveena
Newspaper Banner
Date of Publish : 04 November 2026, 3:16 pm Posted by : praja deveena

Nalgonda BRS ex MLA Kancharla Bhupal Reddy : నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి అప్పీల్, గ్రాడ్యు యేట్ ఓటర్ల నమోదుపై బీఆర్ఎ స్ ప్రత్యేక దృష్టి

–నగరంలోని ప్రతి ఇంటికీ వెళ్లి ఓటర్లను నమోదు చేయించాలి

–గత అనుభవాలను దృష్టిలో పె ట్టుకుని అప్రమత్తంగా ఉండాలి

–నాలుగైదు రోజుల్లో ప్రతి ఒక్క రూ బాధ్యత తీసుకోవాలి

Nalgonda BRS ex MLA Kancharla Bhupal Reddy : ప్రజా దీవెన, నల్లగొండ: గ్రాడ్యు యేట్ ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు కా ర్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని, అర్హులైన ప్రతి పట్ట భద్రుడిని ఓటరుగా నమోదు చే యించే బాధ్యత పార్టీ నాయ కులు, కార్యకర్తలు తీసుకోవాలని నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి పిలుపునిచ్చారు. గ్రాడ్యుయేట్ ఓటర్ల నమోదు కా ర్యక్రమంలో భాగంగా బుధవారం తన క్యాంపు కార్యాలయంలో న ల్లగొండ నగర ముఖ్య నాయకు లు, ఓటర్ ఎన్‌రో లర్లతో ప్రత్యేక సమావేశం నిర్వ హించారు. ఈ సమావే శానికి శాసన మండలి స భ్యుడు మంకెన కోటిరెడ్డి, జెడ్పీ మా జీ చైర్మన్ బండా నరేందర్ రె డ్డి ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు.

మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి మాట్లాడుతూ ఓటర్ల నమోదు గడువుకు కేవలం నాలుగైదు రోజులే సమయం ఉ న్నందున నాయకులు, ఎన్‌రోలర్లు వేగం పెంచాలని సూచిం చా రు. ప్రతి డివి జన్‌లోని ముఖ్య నాయకులు ఇంటింటికీ వెళ్లి అర్హులైన పట్టభ ద్రుల వివరాలు సేకరించి, వారి పేర్లను ఓటర్ల జాబితాలో నమో దు చేయించాలని కోరారు. అందరూ సమ న్వయంతో పనిచేసి ఈ కొద్ది రోజులను పూర్తిగా ఓటర్ల న మో దు కార్యక్రమానికే కేటాయించాలని పిలుపునిచ్చారు.

 పొరపాట్లు పునరావృతం కావొద్దు: బండా నరేందర్ రెడ్డి

జెడ్పీ మాజీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి నా యకుడు ఓటర్ల నమోదు బా ధ్య తను వ్యక్తిగతంగా తీ సు కోవాలని అన్నారు. నగరంలోని ప్రతి వీధిలో పర్యటిస్తూ పట్టభ ద్రులకు ఓటు నమోదు ప్రాధాన్యతను వివరించాలని సూచిం చారు. గతం లో ఓటర్ల నమోదు సరిగా జరగకపోవడంతో స్వ ల్ప మెజార్టీతో ఓటమి ఎదుర్కోవాల్సి వచ్చిందని గుర్తుచేస్తూ, ఈసారి అటువం టి పరిస్థితులు పునరావృతం కాకుండా ముందస్తు జాగ్రత్తలు తీ సుకోవాలని కోరారు.

నమోదు విషయంలో నిర్లక్ష్యం వద్దు: మంకెన కోటిరెడ్డి

ఎమ్మెల్సీ మంకెన కోటిరెడ్డి మా ట్లాడుతూ గ్రాడ్యుయేట్ ఎమ్మె ల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని అ న్నారు.ఈ ఎన్నికల్లో పార్టీకి వచ్చే ఫలితాలు భవిష్యత్ రాజకీ య పరిణామా లపై ప్రభావం చూపుతాయని పేర్కొన్నారు. ప్ర తి పట్టభద్రుడిని ఓటరుగా నమోదు చేయించడం విజయానికి తొలి అడుగు అని, ఈ విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం చేయ కుండా నాయకులు, కార్య కర్తలు సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ నాయ కత్వంలో బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి రావాలనే లక్ష్యంతో పార్టీ శ్రేణులు పనిచేయా లని ఆయన పేర్కొన్నారు.

ఈ సమావేశంలో రాష్ట్ర కార్పొరే షన్ మాజీ చైర్మన్ కటికం సత్త య్య గౌడ్, ఏఎంసీ మాజీ చైర్మన్ చీర పంకజ్ యాదవ్, రాష్ట్ర కార్యదర్శి నిరంజన్ వలి, నల్లగొండ మున్సిపల్ మాజీ చైర్మన్ మం ద డి సైదిరెడ్డి, బక్క పిచ్చయ్య, సింగం రామ్మోహన్, అభి మన్యు శ్రీనివాస్, నగర పార్టీ అధ్యక్షుడు భువనగిరి దేవేందర్, కార్పొరేటర్లు మారగోని భవాని గణేష్, పెరిక యాదయ్య, పేర్ల మల్లీశ్వరి అశో క్, రత్నగిరి తారకమ్మ శ్రీనివాస్, కుందూరు దీపి కా ప్రవీణ్ రెడ్డి, బాణావత్ దీప్లా, దొడ్డి రమేష్, గోపగోని స్వాతి రాజశేఖర్, మా జీ కౌన్సిలర్ రావుల శ్రీనివాస్ రె డ్డి, జమాల్ ఖాద్రి, బొజ్జ వెంకట య్య, సింగం లక్ష్మి, యాట జయ ప్రద రెడ్డి, పెరిక కరుణ్, జయరా జ్, కన్నారావు, శ్యాంసుందర్, అ యిత గోని జనార్దన్ గౌడ్, అఫ్జల్, అశ్వాక్, కంచర్ల విజయ తదిత రు లు పాల్గొన్నారు.

Nalgonda BRS ex MLA Kancharla Bhupal Reddy