Praja Deveena
Newspaper Banner
Date of Publish : 05 November 2026, 2:53 am Posted by : praja deveena

AI Based Land Dispute Resolution : ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో భూ వివాదాల పరిష్కారమా ?

–జనగామ కలెక్టర్ ఉత్తర్వులపై హైకోర్టు తీవ్ర అభ్యంతరం

–ఆదేశాలు తాత్కాలికంగా సస్పెండ్

AI Based Land Dispute Resolution : ప్రజా దీవెన, హైద రాబాద్: ప్రభు త్వ కార్యాలయాల్లో ప్రజల ఫిర్యాదుల పరిష్కా రానికి ఆర్టిఫిషి యల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వినియోగిస్తున్న తీ రుపై తెలంగాణ హైకోర్టు కీలక ప్రశ్నలు లేవనెత్తింది. ము ఖ్యం గా ప్రజల ఆస్తి హ క్కులకు సంబంధించిన భూ వివాదాల్లో ఏఐ రూపొందించిన స మాచారాన్ని ఆధారంగా చేసుకుని అధికా రులు నిర్ణయాలు తీసుకోవడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చే సింది. ఈ క్రమంలో జనగామ జిల్లా కలెక్టర్ జారీ చేసిన ఉత్త ర్వులను తాత్కాలికంగా నిలిపివేస్తూ కీలక ఆదేశాలు జారీ చే సింది. వివరాల్లోకి వెళితే..జనగామ జిల్లా దేవరుప్పుల మండ లం పెద్ద మడూరు గ్రామానికి చెందిన మేడిపల్లి కొమురయ్య తన భూ వి వాదంపై హైకోర్టును ఆశ్రయించారు. ప్రత్యర్థులు సమర్పించిన ఫి ర్యాదుపై జిల్లా కలెక్టర్ గత సె ప్టెంబర్ 8న ఉ త్తర్వులు జారీ చే శారని, అయితే తన వాదనలు వినకుం డా నే, భూమికి సంబం ధించిన రికార్డులు, వాస్తవాలను పూర్తి స్థా యిలో పరిశీలించకుం డానే ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారని పిటిషనర్ ఆరోపించారు.

  ఏఐతో ఉత్తర్వుల తయారీపై అభ్యంతరం

పిటిషనర్ తరఫున న్యాయవాది ఎం. మాధవరెడ్డి వాదనలు వినిపిస్తూ.. అధికారులు ఏఐటూల్స్ ద్వారా రూపొందించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకుని ఉత్త ర్వులు జారీ చేశా ర ని, స్వతంత్రం గా విచారణ జరిపి నిర్ణయం తీసుకోలేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ వ్యవహారంపై జస్టిస్ ఎన్.వి. శ్రవణ్ కు మార్ విచారణ చేపట్టారు.భూమి, ఆస్తి హక్కులకు సంబంధిం చిన వివాదాల్లో సం బంధిత పత్రాలను క్షుణ్ణంగా పరి శీలించ డం, వాస్తవాలను నిర్ధారిం చడం, ఇరుపక్షాల వాదనలు వి న డం అధికారుల బాధ్యత అని కోర్టు స్పష్టం చేసింది. కేవలం ఏ ఐ రూపొందించిన సమాచారంపై ఆధారపడి కీలక నిర్ణయాలు తీసుకోవడం సమంజసం కాదన్న అభ్యంతరాలను పరిగణ న లోకి తీసుకుంది.

కలెక్టర్ ఉత్తర్వులకు తాత్కాలిక బ్రేక్.. అధికారులకు నోటీసు

ఇరుపక్షాల వాదనలు పరిశీలించి న హైకోర్టు.. సెప్టెంబర్ 8న జనగా మ కలెక్టర్ జారీ చేసిన ఉత్తర్వు లను తాత్కాలికంగా నిలిపివే సిం ది. ఈ వ్యవహారంపై రెవెన్యూ శాఖ ముఖ్య కార్య దర్శి, జనగామ జిల్లా కలెక్టర్, దేవరుప్పుల తహ సీల్దార్‌తో పా టు సంబంధిత ప్రై వేటు వ్యక్తులకు నోటీసులు జారీ చేసిం ది.ఈ ఘటనపై ప్రభుత్వం దృష్టి సారించిందని అసిస్టెంట్ గవ ర్నమెంట్ ప్లీడర్ హరిత కోర్టు కు వివరించారు. తదుపరి చర్య లపై అడ్వకేట్ జనరల్ కార్యాల యాన్ని సంప్రదించినట్లు తెలి పారు.

బాధ్యులపై చర్యలేమిటి? 18న మరోసారి విచారణ.

ఈ వ్యవహారంలో బాధ్యులైన అ ధికారులపై రాష్ట్ర ప్రభుత్వం ఇ ప్పటివరకు తీసుకున్న చర్యలు ఏమిటి? ఇకపై ఎలాంటి చ ర్యలు తీసుకోబోతోంది? అనే వివరాల ను సమర్పించాలని అ డ్వకేట్ జనరల్ ఏ. సుదర్శన్ రెడ్డిని హైకోర్టు ఆదేశించింది. త దుపరి విచారణను నవంబర్ 18వ తేదీకి వాయిదా వేసింది.

   టెక్నాలజీకి హద్దులు ఉండాలా?

ప్రభుత్వ పాలనలో ఏఐ వినియో గం పెరుగుతున్న నేపథ్యం లో ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది. ఫిర్యాదుల నమో దు, సమాచార విశ్లేషణ, ఉత్తర్వుల ముసాయిదాల తయారీ లో ఏఐ ఉపయోగపడవచ్చు. అయితే ప్రజల భూములు, ఆస్తి హక్కుల ను ప్రభావితం చేసే నిర్ణయాలను యంత్రాలు రూపొం దించిన స మాచారానికే పరిమితం చేయడం ప్రమాదకరమనే ఆందోళ న లు వ్యక్తమవుతున్నాయి. పరిపాలనలో వేగం కో సం సాంకేతికతను వినియోగించినా.. తుది నిర్ణయం తీసుకు నే ముందు వాస్త వాలను స్వయంగా పరిశీలించడం, సంబం ధి త వ్యక్తులకు న్యా యం చేయడం అధికారుల బాధ్యత. జన గామ భూ వివాదంపై హైకోర్టు జారీ చేసిన ఆదేశాలు ప్రభుత్వ యంత్రాంగంలో ఏఐ వినియోగం, అధికారుల జవాబు దారీత నంపై కీలక చర్చకు తెరలేపాయి.

AI Based Land Dispute Resolution