Praja Deveena
Newspaper Banner
Date of Publish : 05 November 2026, 12:31 pm Posted by : praja deveena

District Sports Officer ACB Bribery Case : బిగ్ బ్రేకింగ్, రూ.లక్ష లంచం తీ సుకుంటూ ఏసీబీకి చిక్కిన జిల్లా క్రీడా అధికారి, టైపిస్ట్,రూ.3.10 లక్షల భోజన బిల్లుల చెల్లింపున కు లంచం డిమాండ్

District Sports Officer ACB Bribery Case : ప్రజా దీవె న, మహబూబ్‌నగర్: ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతికి అ డ్డుకట్ట వేసేందుకు ఏసీబీ అధికారులు చేపడుతున్న చర్యలు కొనసాగుతున్నాయి. ఈక్రమంలో మహబూబ్‌నగర్ జిల్లా యు వజన, క్రీడల శాఖ కార్యాల యంలో పనిచేస్తున్న జిల్లా యు వజన, క్రీడల అధికారి, కాంట్రాక్ట్ ప్రాతిపదికన పనిచేస్తున్న టై పిస్ట్ ఏసీబీ వలలోచిక్కారు. అధికారిక పనిని పూర్తి చేసేందుకు ఏకంగా రూ.లక్ష లంచం తీసుకుంటూ ఇద్దరూ రెడ్‌హ్యాం డెడ్‌ గా పట్టుబడటం జిల్లాలో కలకలం రేపింది.ఏసీబీ వివరాల ప్ర కారం.. జిల్లా యువజన, క్రీడల అధికారి జక్కు రాజశేఖర్ రెడ్డి (AO-1), టై పిస్ట్ గోరె ఉమేష్ (AO-2) కలిసి ఫిర్యాదుదారుడి నుంచి రూ.లక్ష లంచం డిమాండ్ చేశారు. ఆగస్టు 2026 నెల కు సంబంధించి SA TG వాలీబాల్ హాస్టల్‌లో ఉంటున్న క్రీడా కారులకు అందించిన భో జనానికి సంబంధించిన పెండింగ్ బి ల్లులను ప్రాసెస్ చేసి, ఆమోదించి, రూ.3.10 లక్షల చెక్కును వి డుదల చేయడానికి ఈ మొత్తాన్ని డిమాండ్ చేసినట్లు ఏసీబీ వె ల్లడించింది.

ఈ మేరకు నవంబర్ 5న మహ బూబ్‌నగర్ పరిధిలోని ఏసీబీ అ ధికారులు పక్కా ప్రణాళికతో దా డి చేసి, రూ.లక్ష నగదును స్వీక రిస్తున్న సమయంలో జిల్లా క్రీడా అధికారి రాజశేఖర్ రెడ్డి ని రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆ యన వద్ద నుంచి లం చం సొమ్మును స్వాధీనం చేసుకున్నారు.ఈ లంచం మొత్తాన్ని ఇద్దరూ పంచు కోవాలనే ముందస్తు ఒప్పందం మేరకు AO-1 తనతో పాటు A O-2 తరఫున కూడా నగదును స్వీకరించిన ట్లు ఏసీబీ పేర్కొంది. అధికార హోదాను అడ్డుపెట్టుకుని అక్ర మంగా లబ్ధి పొందేందుకు ప్రయత్నించినట్లు ప్రాథమికంగా గు ర్తించింది.

ఇద్దరు నిందితులను అరెస్టు చే సిన ఏసీబీ అధికారులు నాంప ల్లిలోని SPE & ACB కేసుల ప్ర త్యేక న్యాయస్థానంలో హాజరు పరిచి న్యాయపరమైన రిమాండ్‌ కు తరలించే ప్రక్రియ చేపట్టా రు. ఈ ఘటనపై తదుపరి విచారణ కొనసాగుతోంది. ఫిర్యా దుదారుడి భద్రత దృష్ట్యా ఆయన వివరాలను ఏసీబీ గోప్యం గా ఉంచింది.

లంచం అడిగితే 1064కు ఫోన్ చేయండి

ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా ప నులు చేసిపెట్టేందుకు లంచం డి మాండ్ చేస్తే ప్రజలు భయపడ కుండా తెలంగాణ ఏసీబీ టో ల్‌ఫ్రీ నంబర్ 1064కు ఫిర్యాదు చే యాలని అధికారులు సూ చించారు.వాట్సాప్: 9440446106, ఫేస్‌బుక్: Telanga na ACB, ఎక్స్ (ట్విట్టర్): @Telangana ACB,ప్రభుత్వ కా ర్యా లయాలు, ప్రధాన బహిరంగ ప్రదేశాల్లో ఏర్పాటు చేసిన ఏసీబీ క్యూఆర్ కోడ్ ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. ఫిర్యాదుదారుల పేర్లు, వ్యక్తిగత వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచుతామని ఏసీబీ స్పష్టం చేసింది.