–కరువొచ్చినా రైతులకు నీటి ఇ బ్బందులుoడకుండా చేస్తాం
–నల్లగొండ వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతనపాలకవర్గ ప్రమాణ స్వీకారం
Minister Komatireddy : ప్రజా దీవెన, నల్లగొండ : ఎస్ ఎల్ బీసీ సొరంగ మార్గం పూర్తయితే ఎంతటి కరువు పరిస్థితులు ఎదురైనా శ్రీశైలం ప్రాజెక్టు డెడ్స్టో రేజీ నుంచి నీటిని తరలించి రైతులకు సాగునీరు అందించే అవకాశం ఉంటుందని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడించారు. ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు పూర్తితో న ల్గొండ జిల్లా సాగునీటి కష్టాలకు శాశ్వత పరిష్కారం లభి స్తుం దని ఆయన పేర్కొన్నారు.గురువారం నల్గొండ జిల్లా కేంద్రం లో ని జిల్లా మార్కెటింగ్ శాఖ కా ర్యాలయంలో నిర్వహించిన న ల్గొండ వ్యవసాయ మార్కెట్ కమి టీ నూతన పాలకవర్గ ప్రమా ణ స్వీకార కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజర య్యారు. నూతన చైర్మన్, వైస్ చైర్మన్, డైరెక్టర్లతో మార్కెటింగ్ శాఖ సహాయ సంచాలకులు ఛాయాదేవి ప్రమాణ స్వీకారం చేయించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మార్కెట్ కమిటీ పద వు లు కేవలం హోదాలు మాత్రమే కాదని, రైతులకు నేరుగా సేవలందించే కీలక బాధ్యతలని అన్నారు. రైతుల సంక్షేమమే లక్ష్యంగా నూతన పాలకవర్గం పనిచేయాలని సూచించారు. ప్ర జా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నల్గొండ మార్కెట్ కమిటీకి రెండో పాలకవ ర్గం ఏర్పాటవడం సంతోషకరమన్నారు.
ఫ్లోరైడ్ సమస్యకు ఎస్ఎల్బీసీ తో పరిష్కారం
నల్గొండ జిల్లాను ఫ్లోరైడ్ రహితంగా మార్చడంతోపాటు జిల్లా అంతటా సాగునీరు అందించాలనే లక్ష్యంతో సుమారు రూ.2 ,000 కోట్లతో ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును చేపట్టినట్లు మంత్రి వివ రించారు. గత ప్రభుత్వ హయాంలో పనులు నిలిచిపో యా యని, ప్రజా ప్ర భుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తిరిగి ప్రారంభించామని తెలిపారు. మధ్యలో మరోసారి పనులకు ఆ టంకం ఏర్పడినప్ప టికీ ఇటీవలే తిరిగి పనులు ప్రా రంభించి వేగవంతం చేసినట్లు వె ల్లడించారు.
ఎస్ఎల్బీసీ ద్వారా జిల్లా మొ త్తాన్ని సస్యశ్యామలం చేయా లన్న సంకల్పంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని చెప్పా రు. బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టును తమ హయాంలోనే చేపట్టా మని, ఇప్పటివరకు 35 వేల ఎకరాలకు సాగునీరు అందించా మని తెలి పారు. లక్ష ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో పనిచే స్తున్నట్లు పేర్కొన్నారు.
రూ.450 కోట్లతో ఏఎంఆర్పీ కాలువల లైనింగ్
ఏఎంఆర్పీ కాలువల లైనింగ్ ప నులను రూ.450 కోట్లతో చేప ట్టినట్లు మంత్రి తెలిపారు. ము శంపల్లి సబ్స్టేషన్తోపాటు ర హదారి కూడా మంజూరు చేయిం చినట్లు వెల్లడించారు. జిల్లా లో కాలువలు, రిజర్వాయర్లు పూ ర్త యితే పరిసర ప్రాంతాల్లో భూ గ ర్భ జలాలు పెరిగి బోర్లలో నీటి లభ్యత మెరుగుపడు తుందని వివ రించారు.
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన ఉచిత విద్యుత్ పథకం రైతులకు ఎంతో ప్రయోజనం చేకూ ర్చిందని, ప్రస్తుతం దేశంలోని పలు రాష్ట్రాల్లోనూ ఈ విధానం అమలవు తుండటం విశేషమని అన్నారు.నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోనూ వివిధ అభివృద్ధి పనులు కొనసా గు తున్నాయని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా, రాష్ట్ర ప్రజలకు ముందస్తుగా దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు.
నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం
నల్గొండ వ్యవసాయ మార్కెట్ క మిటీ చైర్మన్గా బి. హేమలత వెం కటరెడ్డి, వైస్ చైర్మన్గా వి. శ్రీనివాస్ గౌడ్ ప్రమాణ స్వీకారం చే శారు. వీరితోపాటు నూతన డైరె క్టర్లు కూడా బాధ్యతలు స్వీకరించారు.ఈ కార్యక్రమంలో ఎమ్మె ల్సీ శంకర్ నాయక్, నల్గొండ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి, మాజీ మున్సిప ల్ చైర్మన్ శ్రీనివా స్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ గుమ్మల మోహన్ రె డ్డి, జిల్లా మార్కెటింగ్ శాఖ సహాయ సంచాలకులు ఛా యాదే వి తదితరులు పాల్గొన్నారు.
Minister komatireddy Venkat Reddy key words in Nalgonda district headquarter https://t.co/gJlYfC3K3V
— praja deveena web site and digital edition e paper (@PDeveena40655) November 5, 2026
Minister Komatireddy Venkat Reddy

