Praja Deveena
Newspaper Banner
Date of Publish : 06 November 2026, 11:17 am Posted by : praja deveena

Nalgonda SC ST Court 31 Years Jail Sentence : నల్లగొండ ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక న్యా యస్థానం సంచలన తీర్పు, మ హిళపై లైంగిక దాడికియత్నం, ఆ త్మహత్యకు ప్రేరేపణ, నిందితుడి కి 31ఏళ్ల కఠిన కారాగార శిక్ష

Nalgonda SC ST Court 31 Years Jail Sentence : ప్రజా దీవెన, నల్లగొండ: మహిళపై లైంగిక దాడికి యత్నిం చ డం, అక్రమంగా నిర్బంధించడం, ఆత్మ హత్యకు ప్రేరేపించడం వంటి తీవ్ర మైన నేరాలకు పాల్పడిన వ్యక్తికి న్యాయస్థానం కఠి న శిక్ష విధించింది. నిందితుడికి మొత్తం 31 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.20 వేల జరిమానా విధిస్తూ నల్ల గొండ ఎస్సీ, ఎస్టీ కేసుల ప్రత్యేక న్యాయస్థానం తీర్పు వెలువ రించింది. ఈ విషయాన్ని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ వెల్ల డించారు.నల్లగొండ వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2021లో Cr.No.270/2021, SC.No.1 41/2021గా ఈ కేసు నమో దైంది. అనంతారం గ్రామానికి చెందిన వజ్జ శ్రీను అలియాస్ కార్తీక్ (3 1), ప్రస్తుతం నల్లగొండ పట్టణంలోని అబ్బాసియా కాలనీలో ని వాసం ఉంటున్నాడు. మహిళపై లైంగిక దాడికి యత్నించడం, ఆ మెను అక్రమంగా నిర్బంధించడం, ఆత్మహ త్యకు ప్రేరేపించడం తదితర ఆరోపణలపై పోలీసులు కేసు న మోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

   నాలుగు సెక్షన్ల కింద శిక్షలు

ఈ కేసుపై విచారణ చేపట్టిన నల్ల గొండ ఎస్సీ, ఎస్టీ కేసుల ప్ర త్యేక న్యాయస్థానం కమ్ II అదనపు జిల్లా, సెషన్స్ జడ్జి 06-11-2026 న తీర్పు ప్రకటించారు. నిందితు డికి ఐపీసీ సెక్షన్ 306 కింద 10 సంవత్సరాలు, సెక్షన్ 376 రెడ్‌ విత్ 511 కింద 10 సంవత్సరా లు, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీస్ నిరో ధక చట్టంలోని సెక్షన్ 3(2)(v)(v a) కింద 10 సంవత్సరాలు, ఐపీ సీ సెక్షన్ 342 కింద ఏడాది పాటు కఠిన కారాగార శిక్ష విధించారు. ప్రతి సెక్షన్ కింద రూ.5 వేల చొ ప్పున మొత్తం రూ.20 వేల జరి మా నా విధించారు. అన్ని శిక్షలు ఏకకాలంలో అమలు చేయాలని న్యాయస్థానం ఆదేశించడంతో నిందితుడు మొత్తం 31 ఏళ్ల జై లు శిక్షను ఎదుర్కోనున్నాడు.

నేరస్తులకు శిక్షపడేలా కఠిన చర్యలు

ఈ సందర్భంగా ఎస్పీ శరత్ చం ద్ర పవార్ మాట్లాడుతూ మ హిళలపై, ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ వ ర్గాలకు చెందిన మహిళల పై నేరాలకు పాల్పడే వారిపట్ల పోలీస్ శాఖ ఏమాత్రం ఉపే క్షిం చబోదని స్పష్టం చేశారు. ప్రతికేసులో నాణ్యమైన దర్యాప్తు, పక్కా సాక్ష్యాధారాల సేకరణ, న్యాయస్థానంలో సమర్థవంత మైన వాదనలకు అవసరమైన సమన్వయంతో నేరస్తులకు శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

పోలీస్, ప్రాసిక్యూషన్ బృందానికి అభినందనలు

ఈ కేసులో సమర్థవంతంగా దర్యాప్తు నిర్వహించిన అధికారు లు గుత్తా వెంకట్ రెడ్డి, జి. వెంక టేశ్వర్ రెడ్డితో పాటు ప్రస్తుత ఎస్‌ డీపీఓ కె. శివరాం రెడ్డి, సీఐ కె. ఆ దిరెడ్డి, పబ్లిక్ ప్రాసిక్యూ టర్లు ఎస్. శోభారాణి, ఆర్. అఖిల, డీసీఆర్‌బీ సీఐ శ్రీను నా యక్, కోర్టు డ్యూటీ ఆఫీసర్ బి. వెంకటేశ్వ ర్లు, లైజన్ అధికా రులు పి. నరేందర్, ఎన్. మల్లికార్జున్‌లను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. కేసు నమోదు నుంచి తుది తీర్పు వెలువడే వరకు సమన్వయంతో పనిచేసిన ప్రతి ఒక్కరి కృషిని ప్ర శంసిం చారు. ఇదే నిబద్ధతతో భ విష్యత్తులోనూ విధులు నిర్వహిస్తూ బాధితులకు న్యాయం జరిగేలా పనిచేయాలని సూచిం చారు.

వృద్ధురాలి హత్య కేసులో సంచలన తీర్పు, ప్రధాన నిందితురాలికి రెండు జీవిత ఖైదులు

నల్లగొండ: ఆరేళ్ల క్రితం జరిగిన వృద్ధురాలి దారుణ హత్య కే సులో నల్లగొండ ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక సెషన్స్ కోర్టు కీలక తీర్పు వె లువరించింది. హత్యకు పాల్పడిన ప్రధాన నిందితురాలికి రెం డు జీవిత ఖైదులతో పాటు వివిధ సెక్ష న్ల కింద కఠిన కారాగార శిక్షలు, రూ.20 వేల జరిమానా విధించిం ది. ఈ విషయాన్ని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ వెల్లడించారు.2019 జూలై 1వ తేదీ తెల్లవారు జామున సుమారు 2 గంటల స మయంలో కేతేపల్లి మండలం కో ర్లపహాడ్ గ్రామంలోని రెగులగ డ్డ లో ఈ దారుణం చోటుచేసుకుంది. గ్రామంలో కిరాణా దుకాణం నిర్వ హిస్తూ జీవనం సాగిస్తున్న సయ్యద్ ఆశాబీ (74)ను బెల్ట్ షాప్ నిర్వహణకు సంబంధించిన పాత కక్షలు, మనస్పర్థల నేప థ్యంలో నిందితులు లక్ష్యంగా చేసుకున్నారు.

పథకం ప్రకారం ఇంట్లోకి అక్రమం గా ప్రవేశించిన నిందితులు వృద్ధు రాలిపై గొడ్డలితో దాడి చేసి, కత్తి తో గొంతు కోసి హత్య చేసినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఘటన జరిగిన రోజు ఉదయం మృతురాలి బంధువు సయ్యద్ జాకీర్ కేతేపల్లి పోలీసులకు ఫి ర్యాదు చేయడంతో కేసు నమో దైంది.

ముగ్గురు నిందితులపై కేసు నమోదు

క్రైమ్ నంబర్ 79/2019గా ఐపీ సీ 120(B), 452, 302, 201 రె డ్‌విత్ 34 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేప ట్టారు. ఈ కేసులో రెగులగడ్డకు చెందిన ముషం అంతమ్మ (54), బండపాలెంకు చెందిన చింతల శ్రీను (34), నేరేడుచెర్లకు చెందిన విప్పు ధనలక్ష్మి అలియాస్ ధన మ్మ (34)లను నిందితులుగా గు ర్తించారు. వారిని అరెస్టు చేసి, ఆ ధారాలతో న్యాయస్థానంలో అభి యోగపత్రం దాఖలు చేశారు.

ప్రధాన నిందితురాలికి డబుల్ జీవిత ఖైదు

సుదీర్ఘ విచారణ అనంతరం ఏ-1 ముషం అంతమ్మపై నేరం రుజు వు కావడంతో న్యాయస్థానం రెం డు జీవిత ఖైదులు విధించింది.ఐపీసీ 302 హత్య నేరానికి జీవి త ఖైదు, రూ.5, 000 జరిమానా.ఐపీసీ 120(B) నేరపూరిత కుట్ర కు మరో జీవిత ఖైదు, రూ.5 ,00 0 జరిమానా. ఐపీసీ 452 ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ. 5,000 జరిమానా, ఐపీసీ 201 ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ. 5,000 జరిమానా మొత్తంగా రూ.20 వే ల జరిమానా విధిం చింది. జరి మానా చెల్లించని పక్షంలో ప్రతి సెక్షన్‌కు సంబంధిం చి నాలుగు నెలల సాధారణ జైలు శిక్ష అను భవించాలని తీ ర్పులో పేర్కొంది.ఇదిలా ఉండగా, ఏ-2 చింతల శ్రీ ను మరణిం చగా, ఏ-3 విప్పు ధ నలక్ష్మి అలియాస్ ధనమ్మపై న మోదైన అన్ని అభియోగాల నుంచి న్యాయ స్థా నం నిర్దోషిగా విడుదల చేసింది.

దర్యాప్తు అధికారులకు ఎస్పీ అభినందనలు

ఈ కేసు దర్యాప్తులో అప్పటి కేతే పల్లి ఎస్ఐ బి. రామకృష్ణ, శాలి గౌరారం సర్కిల్ ఇన్‌స్పెక్టర్లు కె. కా స్ట్రో, పి.ఎన్.డి. ప్రసాద్ కీలకంగా వ్యవహరించారు. ఆధారాల సేకరణ, న్యాయస్థానం లో వాటి స మర్పణలో సమర్థవంతంగా పని చేశారు. ప్రభు త్వం తరఫునఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టు అదనపు పబ్లిక్ ప్రాసి క్యూటర్ గ్రేడ్-1 ఎస్. శోభా రాణి, పబ్లిక్ ప్రాసిక్యూటర్ గ్రేడ్-1 ఆర్. అఖిల వాదనలు వినిపించారు.

ప్రస్తుత కేతేపల్లి ఎస్హెచ్ఓ ఎస్. స తీష్, శాలిగౌరారం సీఐ పి. రాజ శేఖర్, నల్లగొండ ఎస్‌డీపీఓ కె. శి వరాం రెడ్డి, డీసీఆర్‌బీ సీఐ శ్రీను నాయక్ పర్యవేక్షణలో కోర్టు ప్రక్రి యలు కొనసా గా యి. కోర్టు డ్యూ టీ అధికారులు ఎం.డి. వసీం, జి. సురేష్, లైజ న్ అధికారులు పి. న రేందర్, ఎన్. మల్లికార్జున్ సాక్షు ల హా జరు, కోర్టు సమన్వయంలో కీలక పాత్ర పోషించారు. వృద్ధురా లి హత్య కేసులో ప్రధాన నింది తురాలికి జీవిత ఖైదు పడేలా కృ షి చేసిన అప్పటి దర్యాప్తు అధి కారులు, ప్రస్తుత పోలీసు అధి కారులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, కోర్టు డ్యూటీ, లైజన్ అధి కారులను జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ప్రత్యేకంగా అభినం దించారు.