—నియోజకవర్గంపై ప్రభుత్వం ప్రత్యేకదృష్టి సారించాలి
Mla Komatireddy Raj Gopal Reddy : ప్రజా దీవెన, ము నుగోడు: మునుగోడు నియోజకవ ర్గ అ భి వృద్ధికి ప్రత్యేక నిధు లు కేటాయించి, వెనుకబడిన ప్రాంతాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిం చాలని స్థానిక ఎమ్మెల్యే కోమ టి రెడ్డి రాజ గోపాల్ రెడ్డి కోరారు. కొ డంగల్ నియోజ కవర్‌గా నికి రూ.9 వేల కోట్లతో అభివృద్ధి పనులకు శంకు స్థాపనలు చేస్తున్న ప్రభుత్వం.. ము నుగోడు ప్రజ లకు కూ డా సమాన ప్రాధాన్యత ఇవ్వాలని ప్ర శ్నించారు. మునుగోడు ప్ర జలు ఏం పాపం చేశారని, తమ నియోజకవర్గానికి నిధులు ఎందుకు రావడం లేదని ఆయన ఆ వేదన వ్యక్తం చేశారు. మునుగో డులోని పీఆర్ఆర్ గార్డె న్స్లో ని ర్వహించిన పీఆ ర్టీయూ టీఎస్ రాష్ట్ర సంఘం మాజీ అధ్యక్షుడు, మునుగోడు ఎంపీపీఎస్ ప్రధానో పాధ్యాయుడు సుంకరి బిక్షం గౌ డ్ ఉద్యోగ విరమణ కార్యక్రమా నికి ఎమ్మెల్యే హాజరయ్యారు. ఈ సందర్భంగా బిక్షం గౌడ్‌ను ఘనం గా స న్మానించి, ఉద్యోగ విరమ ణ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సం దర్భంగా రా జ గోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. కృషి, పట్టు దల, దీక్షకు మారుపేరు సుంకరి బిక్షం గౌడ్ అ ని కొనియాడా రు. ఉపా ధ్యాయు డిగా అంకితభా వంతో పనిచేస్తూ ఇంటిం టికీ తిరిగి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచేం దుకు విశేషంగా కృషి చేశారని ప్ర శంసించారు. ఇలాంటి ని బద్ధత కలిగిన వ్యక్తులకు ఉద్యోగ విరమణ అనేది ఉండదని, ఇకపై కూడా సమాజానికి సేవలందిం చాలని ఆకాంక్షించారు. సమా జంలో అవినీతి పెరిగిపోతున్నదని, దానిని అరికట్టిన ప్పుడే పేదలకు న్యాయం జరుగుతుందని ఎమ్మె ల్యే పేర్కొన్నా రు. నాయకులు నీ తినిజాయి తీలతో వ్యవహరిస్తేనే ప్రజలకు మం చి పాలన అందుతుందని అన్నారు.
బీసీలకురాజకీయప్రాధాన్యత కల్పించాలి
కాంగ్రెస్ పార్టీ పేదలు, బడుగు బ లహీన వర్గాల పార్టీ అని పేర్కొ న్న రాజగోపాల్ రెడ్డి.. బీసీలకు రాజకీయంగా పెద్దపీట వేయాలనే ఉద్దేశంతోనే బీసీ వర్గానికి చెందిన సుంకరి బిక్షం గౌడ్‌కు పీ ఆ ర్టీయూ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇవ్వాలని తాను ప్రయ త్నించినట్లు వెల్లడించారు. ప్రజలే అం తిమ న్యాయనిర్ణేతలని, వారి నిర్ణయానికి ప్రాధా న్యత ఇవ్వాలని అన్నారు.
మునుగోడుకు నిధులకే టాయింపులో వివక్ష వద్దు
కొడంగల్ అభివృద్ధికి నిధులు కేటాయించడాన్ని తాను వ్యతి రేకించడం లేదని, అయితే ము నుగోడు వంటి వెనుకబడిన ప్రాం తాలకు కూడా సమానం గా నిధులు కేటాయించాలని కోరుతున్నానని స్ప ష్టం చేశారు. ముఖ్యమం త్రి అదృష్టం కలి సి వచ్చి పదవి లోకి రావడాన్ని తాను తప్పుపట్ట డం లేదని, కానీ అన్ని నియోజ కవర్గాలను సమానంగా చూ డాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉం దని వ్యాఖ్యా నించారు. ప్రపంచం లోనే అత్యధిక ఫ్లోరైడ్ సమస్య తో బాధపడిన ప్రాంతాల్లో మును గోడు ఒకటని గు ర్తుచేస్తూ.. ని యోజకవర్గాన్ని అభి వృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లాలన్న తపన తనకు ఉంద న్నా రు. ఈ విషయంపై ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమం త్రి భట్టి విక్రమార్కను పలుమార్లు కలిసి విజ్ఞప్తి చేసినట్లు తెలిపా రు.
వెనుకబడిన ప్రాంతాలకు న్యాయం చేయాలి
రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి మునుగో డుతో పాటు ఇతర వెనుకబడిన నియోజక వ ర్గా లను గుర్తించాలని, ఆయా ప్రాంతాల అవసరాలకు అనుగు ణంగా ప్రత్యేక నిధులు కేటాయిం చి అభి వృద్ధికి సహకరించాలని ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి కోరారు.ఉపాధ్యాయుడిగా సుంకరి బి క్షం గౌడ్ అందించిన సే వలను అభినందిస్తూనే.. మునుగోడు అభి వృద్ధి, ఫ్లోరైడ్ సమస్య పరిష్కారం, ప్రాంతీయ సమానత్వం వం టి అంశాలను ఎ మ్మె ల్యే తన ప్రసంగంలో ప్రదానంగా ప్రస్తావించారు.
