Praja Deveena
Newspaper Banner
Date of Publish : 07 November 2026, 3:18 pm Posted by : praja deveena

Nalgonda district collector Chandra Shekhar : సెల్‌ఫోన్లకు దూరంగా, క్రీడలకు దగ్గరవ్వాలి, విద్యార్థుల్లో క్రీడాస్ఫూర్తిని పెంపొందించడమే లక్ష్యం

–కలెక్టర్ ఎలెవన్ ఎస్పీ ఎలెవన్ స్నేహపూర్వక క్రికెట్ మ్యాచ్‌లో ఎస్పీ జట్టు విజయం

Nalgonda district collector Chandra Shekhar : ప్రజా దీవెన, నల్ల గొండ: విద్యార్థు లు సెల్‌ఫోన్లు, సోషల్ మీడియాకు బానిసలు గా మారకుండా క్రీడల వైపు అడుగులు వేయాలని నల్గొండ జి ల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. చిన్న వయస్సు నుంచే క్రీడలపై ఆసక్తి పెంచుకోవడం ద్వారా శారీరక దృఢ త్వం తో పాటు మానసిక ఉల్లాసం, ఆరోగ్యకరమైన ఆలో చనా విధానం అలవడుతాయని ఆయన పేర్కొన్నారు.

నేటి తరం పిల్లలు సెల్‌ఫోన్లు, సో షల్ మీడియాకు ఎక్కువ సమయం కేటాయిస్తూ విలువైన సమయాన్ని వృథా చేసు కుంటున్నారని, తోటి వారితో కలిసి మెలిసి ఉండే స్వభావం కూడా తగ్గుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా 10 నుంచి 18 ఏ ళ్ల వయస్సు పిల్లలను క్రీడల వైపు ప్రోత్స హిం చాల్సిన బాధ్యత తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సమాజంపై ఉందన్నారు. శనివా రం నల్గొండలోని మేకల అభినవ్ స్టేడి యంలో కలెక్టర్ ఎలెవన్, ఎ స్పీ ఎలెవన్ జట్ల మధ్య నిర్వ హిం చిన స్నేహపూర్వక క్రికెట్ మ్యాచ్‌ను జిల్లా కలెక్టర్ బి. చం ద్రశేఖ ర్, ఎస్పీ శరత్ చంద్ర ప వా ర్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సం దర్భంగా ఇరువురు అధికారులు స్వయంగా బ్యాటింగ్, బౌలిం గ్‌లో పాల్గొని క్రీడాకారుల్లో ఉత్సాహం నింపారు.

    ఎస్పీ జట్టుకు విజయం

12 ఓవర్ల పాటు సాగిన ఈ ఉ త్కంఠభరిత మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్పీ ఎలెవన్ జట్టు 118 పరుగులు సాధిం చింది. అనంతరం లక్ష్య ఛేదనకు ది గిన కలెక్టర్ ఎలెవన్ జట్టు 107 పరుగులకే పరిమితమైంది. దీం తో 11 పరుగుల తేడాతో ఎస్పీ జట్టు విజయం సాధించింది.విజేత జట్టుకు కలెక్టర్ ట్రోఫీ అం దజేసి అభినందించారు. ఈ పో టీలో బెస్ట్ బౌలర్‌గా ఇ రుగు రవి, బెస్ట్ బ్యాట్స్‌మెన్‌గా శ్రీరామ్, మ్యాన్ ఆఫ్ ది మ్యా చ్‌గా హరిబాబు వ్యక్తిగత ట్రోఫీలను అందుకున్నారు.

   అధికారులకూ క్రీడలు అవసరమే

ప్రభుత్వ విధుల్లో నిత్యం బిజీగా ఉండే అధికారులు కూడా అ ప్పుడప్పుడు క్రీడల్లో పాల్గొనడం ద్వారా శారీరక దృఢత్వాన్ని కాపాడు కోవడంతో పాటు మానసిక ఉల్లా సాన్ని పొందవచ్చని కలెక్టర్ తెలి పారు. సమాజానికి మంచి సందే శాన్ని అందిం చ డంతో పాటు వి ద్యార్థుల్లో క్రీడాస్ఫూర్తిని పెంపొం దించడమే ఈ స్నేహపూర్వక మ్యాచ్ ప్రధాన ఉద్దేశమని వివరించారు. భ విష్యత్తులో మరిన్ని క్రీడా పోటీలు నిర్వహిస్తామని వెల్లడించా రు.

ఎస్బీఐ సీఎస్ఆర్ నిధులతో ఆర్వో ప్లాంట్ ప్రారంభం

ఇదే కార్యక్రమంలో కలెక్టర్ బి. చంద్రశేఖర్, ఎస్పీ శరత్ చంద్ర పవార్, స్థానిక కార్పొరేటర్ సుభా ష్ కలిసి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండి యా సీఎస్ఆర్ నిధులు రూ.1.8 0 లక్షలతో ఏర్పాటు చేసిన ఆర్వో ప్లాంట్‌ను ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో అ దనపు ఎస్పీ రమేష్, ఎస్బీఐ రీజినల్ మేనేజర్ పద్మ బాబు గౌడ్, చీఫ్ మేనేజర్ శ్రీరాములు, కలెక్టరేట్ బ్రాంచ్ మేనేజర్ ఆర్. సౌమిత, సమాచార శాఖ సహాయ సంచాలకులు యు. వెం కటేశ్వర్లు, జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి అక్బర్ అలీ, జి ల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ రాహుల్, కామెంటేటర్ గిరి బాబు, రెవెన్యూ, పోలీసు అధికారులు తదితరులు పాల్గొ న్నా రు.

Nalgonda district collector Chandra Shekhar