–కాళేశ్వరం అదనపు టీఎంసీతో బస్వాపూర్ మీదుగా డిండికి నీటిని తరలించాలి
–ఎల్లూరు పంపుహౌస్ డిజైన్ మార్పుతో పాలమూరుకు అన్యా యం
–సీఎం రేవంత్ రెడ్డి రేసుగుర్రం కాదు కీలుగుర్రంగా మారిపోయా రు
–ప్రశ్నించాల్సిన బీఆర్ఎస్ నాన్ పెర్ఫార్మింగ్ అసెట్‌గా మిగిలింది
Trs Chief Kalvakuntla Kavitha : ప్రజా దీవెన, డిండి: ఉ మ్మడి నల్లగొండ జిల్లా ఎదుర్కొంటున్న సాగు, తాగునీటి స మస్యల కు గోదావరి, కృష్ణా నదుల అనుసంధా నమే శాశ్వత పరిష్కా రమని తె లంగాణ రక్షణ సేన చీఫ్ కల్వ కుంట్ల కవిత స్పష్టం చేశారు. డిం డి రిజర్వాయర్‌కు ఏదుల నుంచి నీటిని తరలిస్తా మంటూ ముఖ్య మంత్రి రేవంత్‌రెడ్డి చేస్తున్న ప్రక టనలు ఆచ రణ సాధ్యం కానివని విమర్శించారు. ఏదులకే రెండు టీఎంసీ ల నీటిని తీసుకురాలేని పరిస్థితుల్లో అక్కడి నుంచి డిండికి నీ ళ్లు ఎలా తెస్తారని ప్రశ్నించారు.శనివారం డిండి రిజర్వాయ ర్ ను సందర్శించిన కవిత..నదుల అనుసంధానం, సాగునీటి ప్రా జెక్టుల నిర్మాణం, పంపుహౌస్‌ల సాంకేతిక అంశాలపై పవర్‌పా యింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. నిపుణులు, ఇంజనీర్లతో చర్చిం చిన అనంతరం రూపొందించిన ప్రత్యామ్నాయ ప్రతిపాదనల ను వివరించారు.
ఏదుల నుంచి డిండికి నీళ్లు ఎలా తెస్తారు?
శ్రీశైలం నుంచి పాలమూరు,రం గారెడ్డి ప్రాజెక్టుకే రెండు టీఎం సీల నీటిని తీసుకోవడం కష్టంగా ఉ న్నప్పుడు డిండి వరకు నీ టిని ఎలా తరలిస్తారని కవిత ప్రశ్నించారు. గతంలో శ్రీశైలం నుంచి నీటిని తీసుకునే స్థాయి 800 అడు గులుగా ఉండగా, ప్రస్తుతం 820 అడుగులకు పెరిగిన విషయాన్ని గుర్తుచేశారు. ఎల్లూరు పంపుహౌస్‌ను ఓపెన్‌కట్ విధానం నుంచి అండర్‌గ్రౌం డ్ విధానానికి మార్చడం వల్లే అనేక సాంకేతిక సమ స్యలు తలెత్తాయని ఆరోపించా రు. అప్రోచ్ చానల్ సామర్థ్యం 140 మీటర్ల నుంచి 50 మీటర్లకు తగ్గిపోయిందని పేర్కొన్నారు. ఎ ల్లూరు పంపుహౌస్ నిర్మాణం సం దర్భంగా చేపట్టిన బ్లాస్టింగ్ల కా రణంగా కల్వకుర్తి పంపుహౌస్‌లో ఒక పంపు దెబ్బతిన్నదని తెలిపా రు.ఇప్పటికే ఉన్న సమస్యలను పరి ష్కరించకుండా మరో 0.6 టీ ఎం సీల నీటి కోసం కొత్తగా పంపుహౌస్ నిర్మాణా నికి ప్రయత్నిస్తే కల్వ కుర్తి, పాలమూరు ప్రాజెక్టులకు ప్రమాదం పొంచి ఉంటుందని హెచ్చరించారు. ఏ ప్రాతిపదికన ఏదులను డిండి ప్రాజెక్టుకు సోర్స్ పాయింట్‌గా ప్రకటిస్తున్నారో ప్రభుత్వం స్పష్టం చేయాలని డి మాండ్ చేశారు.
గోదావరి జలాలతోనే డిండికి నీళ్లు
డిండి ప్రాజెక్టుకు నీటిని అందిం చేందుకు కాళేశ్వరం అదనపు టీ ఎంసీని వినియోగించి బస్వా పూర్ రిజర్వాయర్ మీదుగా డిం డి ఎత్తిపోతలకు నీటిని తరలిం చాలన్నది తమ ప్రతిపాద నగా కవిత వెల్లడించారు. బస్వాపూర్ రిజర్వాయర్ పనులు ఇ ప్పటికే 8 0 శాతం పూర్తయ్యాయని, మిగిలిన పనులను వేగ వంతం చేస్తే డిండి ప్రాంతానికి నీటిని అందించడం సులభమ వుతుందని వివరించారు.శివన్నగూడెం, కిష్టరాయిపల్లి ప్రాజె క్టు లు పూర్తికాకపో యినా మల్లన్నసాగర్ నుంచి గోదావరి జలా ల ను తరలించే అవ కాశాలున్నాయని చెప్పారు. బస్వాపూర్ నుంచి ఉల్పరకు కూడా నీటిని అందించవచ్చన్నారు. కొండపో చంపల్లి, షామీర్పేట చె రువు మార్గాల ద్వారా శివన్నగూ డెం కు గోదావరి నీటిని తరలించే అవకాశాలను వివరించారు. గో దావరి, కృష్ణా నదులను అను సంధానం చేయడం ద్వారా రెం డు ప్రాంతాల నీటి అవసరాలను తీర్చవచ్చని, నల్లగొండలో ఫ్లో రైడ్ సమస్యకు కూడా దీర్ఘకాలిక పరి ష్కారం లభిస్తుందని పే ర్కొన్నారు. గతంలోనే మాజీ ప్రధాని పీవీ నరసింహారావు ఈ ఆలోచనకు ప్రాధాన్యత ఇచ్చారని, ఎస్సా రెస్పీ ద్వారా నల్లగొం డ వరకు నీటి ని అందించేలా కాలువల వ్యవస్థను రూపొం దించారని గుర్తుచేశారు.
గత ప్రభుత్వాల తప్పిదాలతో ప్రాజెక్టులు పెండింగ్
తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రజలకు అవసరమైన సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయడంలో బీఆర్ఎస్ ప్రభుత్వం విఫల మైందని కవిత విమర్శించారు. గతంలో తొమ్మిదిసార్లు సర్వేలు చేసి నప్పటికీ డిండి ప్రాజెక్టుకు సరైన సోర్స్ పాయింట్‌ను గు ర్తించలేక పోయారని తెలిపారు. ఆనాటి ప్రభుత్వంలో భా గ స్వామిగా ఉ న్నందుకు ప్రజలకు క్షమాపణలు చెబుతున్నా న న్నారు.కాంగ్రెస్ ప్ర భుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్లు గ డుస్తున్నా పెండింగ్ ప్రాజెక్టులపై దృష్టిపెట్టడం లేదని ఆరోపిం చారు. బస్వాపూర్ పను లను పూర్తిచేయకుండా గంధమల్ల ప్రాజెక్టు పనులను ప్రారంభించడం వెనుక ఉద్దేశమేంటని ప్ర శ్నించారు. ముందుగా అసంపూర్తి ప్రాజెక్టులను పూర్తి చేసి ప్ర జలకు మేలు చేయాలని సూచించారు.
ప్రశ్నించేది.. పరిష్కారం చూపించేది మేమే
రాష్ట్రంలోని ప్రజా సమస్యలపై పోరాటం చేయడమే కాకుండా వాటికి పరిష్కార మార్గాలను కూ డా చూపిస్తున్నామని కవిత అ న్నారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలోనూ ప్రత్యా మ్నాయాలను సూచించామని తెలిపారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించా ల్సిన బీఆర్ఎస్ పార్టీ నాన్ పె ర్ఫార్మింగ్ అసెట్‌గా మారిపోయిందని విమర్శించారు.ప్రస్తుత ముఖ్యమంత్రి రేవం త్‌రెడ్డిని రేసు గుర్రంలా భావించి ప్రజలు అవ కాశం ఇస్తే, ఆ యన కీలుగుర్రంగా మారిపోయారని ఎద్దేవా చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజ లను నిరాశపరిచారని ఆరో పించారు. కరువు పరిస్థితుల్లో పం టలు వేయవద్దని సూచిస్తు న్న ప్రభుత్వం, రైతులకు ఎలాంటి పరిహారం ఇస్తుందో స్పష్టం చే యాలని డిమాండ్ చేశారు. పం టలు వేయని రైతులకు ఎకరాకు రూ.25 వేల పరిహారం చెల్లిం చాలని కోరారు.
నల్లగొండలో చిన్న రిజర్వాయర్లు నిర్మిస్తాం
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఇటీవ ల మళ్లీ ఫ్లోరైడ్ కేసు నమో దవడం ఆందోళన కలిగిస్తోందని కవిత అన్నారు. ఫ్లోరైడ్ సమ స్యకు శాశ్వత పరిష్కారం లభించాలం టే కనీసం 40 ఏళ్లపా టు ఈ ప్రాంత భూములు నదీజలాలతో తడవాల్సిన అవ సరం ఉందన్నా రు.తాము అధికారంలోకి వస్తే నల్లగొండ జిల్లా లో చిన్నచిన్న రిజర్వాయర్లను నిర్మించి నీటి సమస్యకు పరి ష్కారం చూపుతామని హామీ ఇచ్చారు. జూరాల నుంచి శ్రీశై లం వరకు సుమారు 200 కిలోమీటర్ల పరిధిలో కొత్త ప్రాజెక్టుల నిర్మాణంపై గత ప్రభు త్వాలు నిర్లక్ష్యం చేశాయని విమర్శించా రు.మరోవైపు సన్నబియ్యం అందు బాటులో ఉన్నప్పటికీ ధర లు పెరగడం ప్రభుత్వ వైఫల్యమేనని ఆరోపించారు. మిల్లర్ల అక్రమాల్లో కాంగ్రెస్ పార్టీ నేతల ప్రమేయం ఉందని విమర్శించా రు. నల్లగొం డ జిల్లాకు చెందిన రోడ్లు, భవనాల శాఖ మంత్రి కో మటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ ప్రాంతంలోని రహదారుల దుస్థితిపై ప్ర త్యేక దృష్టి పెట్టాలని సూచించారు.
మహిళా రైతుల కష్టాలు చూసిచలించిన కవిత
డిండి ప్రాజెక్టు పర్యటన సందర్భంగా చందంపేట మండలం పో లేపల్లి రైతు వేదిక వద్ద వేరుశనగ విత్తనాల కోసం ఉదయం నుంచి ఎదురుచూస్తున్న మహిళా రైతులను చూసి కవిత చ లించిపోయారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు విత్తనాల కోసం పడిగాపులు కాస్తున్న రైతుల సమస్యలను అడిగి తెలు సుకున్నారు.గత ఏడాది 1,100 క్వింటాళ్ల వేరుశనగ విత్తనాలు పంపిణీ చే యగా, ఈ ఏడాది కేవలం 600 క్వింటాళ్లు మాత్రమే కేటాయిం చడంతో రైతులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయ ని మహిళా రైతులు ఆమె దృష్టికి తీసుకొచ్చారు.
వెంటనే నల్లగొండ జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్‌తో ఫోన్లో మా ట్లాడిన కవిత.. రైతుల ఇబ్బందులను వివరించారు. స్పం దిం చిన కలెక్టర్, ఎదురుచూస్తున్న మహిళా రైతులకు తక్షణమే విత్తనాలు పంపిణీ చేయాలని అధికారుల ను ఆదేశించారు. ఇంకా ఎంతమే ర విత్తనాలు అవసరమో రైతుల వివరాలు సేకరించి ఇండెంట్ పం పాలని సూచించారు.కలెక్టర్ ఆదే శా ల తో అధికారులు వెంటనే వే రుశనగ విత్తనాల సంచులను మ హిళా రైతులకు అందజేశారు. దీంతో చాలాసేపటి నుంచి ఎదు రుచూస్తున్న రైతులు ఊపిరి పీ ల్చుకున్నారు.మొత్తంగా డిండి నీటి సమస్యకు ఏదుల ప్రతిపా దన కాకుండా గోదావరి–కృష్ణా నదుల అనుసంధానమే శాశ్వత పరిష్కారమని, తమ పార్టీ అధి కారంలోకి వస్తే పెండింగ్ ప్రాజెక్టు లను పూర్తి చేసి నల్లగొం డకు సాగు, తాగునీటి భద్రత కల్పిస్తామని కవిత స్పష్టం చేశా రు.
Trs Chief Kalvakuntla Kavitha


