–కోర్టు ఉత్తర్వుల ఉల్లంఘనపై తె లంగాణ హైకోర్టు సంచలన తీర్పు
Ranga Reddy district Collector Jail Sentence : ప్రజా దీవెన, హైదరాబాద్: న్యా యస్థానం ఇచ్చిన ఆదేశాలను అమ లు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తే ఎంతటి ఉన్నతాధికారులైనా శిక్షకు గురికావాల్సిందేనని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. కోర్టు ఉత్తర్వులను ఉద్దేశపూ ర్వకంగా ఉల్లంఘించిన కేసులో రంగా రెడ్డి జిల్లా కలెక్టర్ సి. నారా యణరెడ్డికి ఆరు నెలల సాధారణ కారాగార శిక్ష విధిస్తూ సంచల న తీర్పు వెలువరిం చింది. అంతే కాకుండా రూ.2 వేల జరిమానా కూడా విధించిం ది. జస్టిస్ కె. ల క్ష్మణ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసిం ది. అయితే, తీర్పుపై అప్పీలు చే సుకునేందుకు వీలుగా శిక్ష అమ లును నాలుగు వారాల పాటు నిలిపివేసింది.
అసలు వివాదం ఏమిటంటే?
రిజిస్ట్రేషన్ చట్టం–1908లోని సె క్షన్ 22-A ప్రకారం నిషేధిత ఆస్తు ల జాబితాలో ఉన్న కొన్ని ప్లాట్ల ను తొలగించాలంటూ బాధితు లు హైకోర్టును ఆశ్రయించారు. వారి వినతిని పరిశీలిం చి నిర్ణయం తీసుకోవాలని 2025 ఆగ స్టులో న్యాయస్థానం జిల్లా కలె క్టర్‌ను ఆదేశించింది. కోర్టు నిర్దే శించిన ప్రకారం 60 రోజుల్లోగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.అయితే గడువు ముగిసినా కలె క్టర్ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో బాధితులు 20 25 అక్టోబర్ 15న కోర్టు ధిక్కరణ పిటిషన్ దా ఖలు చేశారు. ఈ పి టిషన్ దాఖలైన తర్వాతే అధికార యం త్రాంగం స్పందించింది. బాధితులకు నోటీసులు జారీ చేసి 20 26 ఫిబ్రవరి 26న వారి వినతిని తిరస్కరించింది. అనంతరం జూలై 8న మరోసారి తిర స్కరణ ఉత్తర్వులు జారీ చేసింది.
కోర్టు ఆగ్రహం.. కలెక్టర్‌కు శిక్ష!
న్యాయస్థానం విధించిన గడువులోగా స్పందించకుండా, కోర్టు ధి క్కరణ పిటిషన్ దాఖలైన తర్వాత మాత్రమే నిర్ణయం తీసు కోవడంపై ధర్మాసనం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. న్యా యస్థానం ఆదేశాలను అమలు చేయ డంలో ఉద్దేశపూర్వక నిర్లక్ష్యం ప్రదర్శించినట్లు నిర్ధారించింది.ఐఏఎస్ స్థాయి ఉన్న తాధికారి సైతం న్యాయస్థానం ఉత్తర్వు లను బేఖాతరు చే యడం సమ ర్థనీయం కాదని స్పష్టం చేస్తూ కలెక్టర్ సి. నారా యణరెడ్డికి ఆరు నెలల సాధారణ జైలు శిక్ష, రూ.2 వేల జరి మానా విధించింది. అ యితే అప్పీలు చేసుకునేందుకు నాలు గు వారాల గడువు కల్పి స్తూ శిక్ష అమలును తాత్కాలికంగా నిలి పివేసింది. న్యాయస్థానం ఆదేశాల అమలులో నిర్లక్ష్యం వ హిస్తే ఉన్నతాధికారులకూ చట్టం నుంచి మినహాయింపు ఉండ దనే విషయాన్ని ఈ తీర్పు మరోసారి స్పష్టం చేసింది.
Ranga Reddy district Collector Jail Sentence
