Praja Deveena
Newspaper Banner
Date of Publish : 10 November 2026, 12:44 pm Posted by : praja deveena

Woman Home Guard Murder in Nalgonda : నల్లగొండలో దారుణం.. పోలీస్ క్వార్టర్స్‌లో మహిళా హోంగార్డు హత్య, భార్యాభర్తల మధ్య వి వాదంతో బండకేసి తలపై కొట్టిన భర్త

–తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి
–నిందితుడిని అదుపులోకి తీసు కున్న పోలీసులు

Woman Home Guard Murder in Nalgonda : ప్రజా దీవెన, నల్లగొండ క్రైమ్: నల్లగొండ జిల్లా కేంద్రంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. పోలీస్ క్వార్టర్స్‌లో నివాసం ఉంటు న్న మహిళా హోంగార్డు భర్త చేతిలో హత్యకు గురైంది. కుటుం బ కల హాలు చివరకు హత్యకు దారితీ యడంతో పోలీసు వ ర్గాల్లో తీవ్ర కలకలం రేగింది.నల్లగొండ రూర ల్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని పో లీ స్ క్వార్టర్స్‌లో మంగళవారం ఈ ఘ mటన జరిగింది. హెడ్‌క్వార్ట ర్స్‌లో హోంగార్డుగా విధులు నిర్వ హిస్తు న్న మహబూబ్ బీ (43)ను ఆమె భర్త సతీష్ హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

పోలీసుల ప్రాథమిక వివరాల ప్ర కారం పిల్లలు పాఠశాలకు వెళ్లి న తర్వాత భార్యాభర్తల మధ్య వి వాదం ప్రారంభమైంది. మా టా మాటా పెరిగి వాగ్వాదం తీవ్రరూ పం దాల్చింది. ఈ క్రమం లో ఆగ్ర హానికి గురైన సతీష్, భార్య మ హబూబ్ బీ తలను బండకేసి బ లంగా కొట్టినట్లు సమాచారం. తీ వ్ర గాయాలపా లైన ఆమె అక్కడి కక్కడే ప్రాణాలు కోల్పోయింది.

    కుటుంబ భారమంతా ఆమెపైనే

మహబూబ్ బీకి సుమారు 15 ఏ ళ్ల క్రితం గతంలో హోంగార్డు గా ప నిచేసిన సతీష్‌తో వివాహమైంది. అయితే కొన్నేళ్ల క్రితం సతీష్ విధుల నుంచి తొలగింపునకు గురయ్యాడు. అప్పటి నుంచి కు టుంబ పోషణ బాధ్యతలను మహబూబ్ బీనే నిర్వహిస్తున్న ట్లు తెలిసింది. వీరికి ఇద్దరు కు మార్తెలు, ఒక కుమారుడు ఉన్నా రు.

ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసు అధికారులు

సమాచారం అందుకున్న డీఎస్పీ శివరామిరెడ్డి, సీఐ ఆదిరెడ్డి, రూ రల్ ఎస్సై శివప్రసాద్, వన్‌టౌన్ ఎస్సై నాంపల్లి వెంకట్ నారాయ ణ ఘటనా స్థలాన్ని పరిశీలిం చా రు. నిందితుడు సతీష్‌ను అదు పులోకి తీసుకుని విచారిస్తున్న ట్లు డీఎస్పీ శివ రామి రెడ్డి వెల్ల డించారు. పోలీసులు కేసు దర్యా ప్తు కొనసాగి స్తున్నారు. ముగ్గురు పిల్లలకు తల్లిని దూరం చేసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.

Woman Home Guard Murder in Nalgonda