Praja Deveena
Newspaper Banner
Date of Publish : 11 November 2026, 9:09 am Posted by : praja deveena

Government employee resignation for mlc elections : బిగ్ బ్రేకింగ్, ప్రభుత్వ ఉన్నత ఉ ద్యోగానికి రాజీనామా,పట్టభద్రు ల ఎమ్మెల్సీ బరిలోకి యార్కల శ్రీనివాస్ గౌడ్

–నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పనే ప్రధాన లక్ష్యం
–పట్టభద్రుల సమస్యలపై పోరా టానికి సిద్ధం
–పట్టభద్రుల గొంతుకగా మండలి లో అడుగుపెట్టడమే ఆశయమన్న శ్రీనివాస్

:Government employee resignation for mlc electi ons :  ప్రజా దీవెన, నల్లగొండ: ప్రభుత్వ ఉన్నత ఉద్యోగాన్ని వదులుకొని ప్రజాసేవే లక్ష్యంగా రాజకీయ రంగంలోకి అడుగు పెట్టేందుకు యర్కల శ్రీనివాస్ గౌడ్ సిద్ధమయ్యారు. అటవీ శా ఖలో ఉన్నత స్థాయి ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి, రాబోయే నల్లగొండ –ఖమ్మం–వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. ఆయన నిర్ణ యం రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది.

ఉద్యోగ భద్రతతో కూడిన ప్రభు త్వ పదవిని వదులుకొని ప్రజా స మస్యల పరిష్కారం కోసం ప్రజా క్షేత్రంలోకి రావడం తనకు ఎంతో సంతృప్తినిస్తోందని శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. ముఖ్యం గా ఉద్యో గాల కోసం ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్న నిరుద్యో గ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం తన ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.

పట్టభద్రులు ఎదుర్కొంటున్న స మస్యలు, నిరుద్యోగం, ఉద్యోగ భద్రత, విద్యావ్యవస్థలో మార్పులు, యువత భవిష్యత్తుకు సంబంధించిన అంశాలపై శాసనమండలిలో గళం విప్పుతా నని తెలిపారు. అర్హత ఉన్న యువతకు తగిన అవకాశాలు క ల్పించే దిశగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తానని వెల్లడించారు.

ఏ రాజకీయ పార్టీకి అనుబంధం గా కాకుండా స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలవాలని ని ర్ణయించుకున్నట్లు ప్రకటించారు. రాజకీయాలకు అతీతంగా పట్ట భద్రుల సమస్యలను ప్రాధాన్యం గా తీసుకొని, వారి ఆశలు, ఆ కాంక్షలకు ప్రతినిధిగా నిలవడమే తన లక్ష్యమని పేర్కొన్నారు.

   పట్టభద్రుల హక్కుల కోసం మరో గొంతుక

నల్లగొండ–ఖమ్మం–వరంగల్ ప ట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో య ర్కల శ్రీనివాస్ గౌడ్ ప్రవేశం ఎ లాంటి రాజకీయ సమీక రణాలకు దారితీస్తుందో, పట్టభద్రుల నుంచి ఆయనకు ఎలాం టి స్పందన లభిస్తుందో వేచి చూడాలని రాజకీయ పరిశీలకు లు భావిస్తున్నారు.

Government employee resignation for mlc elections